In The End… Vazir Rahman, Telugu, Indian . Nothing remains in the end! Even the dreadful snake… that herald of death Dissolves like a scrawl on water. Some wild plant peeps out with passion Breaking through the grave Sapping the essence of the bod Only to wither away soon. Some small dirty cranial bone remains Wallowing in sun and dust… Rejected even by a hungry fox. That’s it! Nothing remains in the end! Even that ethereal flower of youth That morphed the captivating carnal expanse Into an exuberant intoxicating music Shall have to bite dust With its hairline fracture on the bone. The libertine must pack up and depart dejected Leaving behind the ruins of body- temple Abhorring the cold flaccid breasts And the dead loathsome mocking memories It’s inviolable For the red-tailed wicky-bird feeding on oil In the dead of night To rise up suddenly into flames And pass into nothingness. That’s all! Nothing remains in the end! Every morning is a teasing promise. Every morning is a new seven-knot cessation. Won’t anything remain? Not exactly. In the end, At different times, and in different forms We remain In the cycle of birth and death. We stand … nodding our heads At the wonders of the Nature Somewhere amidst flowers of grass Or in the hollows of hills. Or walking hurriedly in an ant line We express our bewilderment At the heinous acts of humankind. We remain In the end… Eternally. . Vazir Rehman Indian. . I deeply regret that I could not furnish any details about the poet. . చివరికి . చివరికేం మిగలదు! చావుని పల్కిన భయానక సర్పం కూడా నీటిమీద గీతమల్లే చెరిగిపోతుంది దేహసారాన్ని పీల్చుకుని సమాధిని చీల్చుకుని ఏ పిచ్చి మొక్కో మత్తుగా తలెత్తి మాయమౌతుంది ఏ పుర్రె యెమికో మిగుల్తుంది ఎండలో దుమ్ములో దొర్లుతో, నక్కలు కూడా కాదని వొదిలే చిన్న మురికి బొమికె ఇంతే- చివరికేం మిగలదు! దేహమోహ సీమని మైక సంగీత మయం చేసిన యవ్వన మృదు పుష్పం సైతం మన్నులో మన్నై మలినమై ఎమికపై నూగారు గుర్తు కూడా! చివికిన చలిబారిన స్తనాలని, వెక్కిరించే ప్రేతరోత జ్ఞాపకాలని, అసహ్యించి దుల్పుకుంటో దేహాలయ శిధిలాలు వొదిలి విషణ్ణుడై వెళ్లక తప్పదు రసికుడు తప్పదు వొక జామురాత్రి చమురు తాగే ఎర్రతోక పిట్ట అకస్మాత్ ఎగిరిపోక తప్పదు శూన్యంలోకి ఇంతే- చివరికేం మిగలదు! ప్రతి వుదయం వొక వాగ్దానం వెక్కిరింపు! ప్రతి వుదయం వొక సరికొత్త సప్తకట్ల సవారి! చివరికేం మిగలదా? కాదు! చివరికి మళ్ళీ అనేక యుగాల్లో రూపాల్లో పుడుతో నశిస్తో మిగులుతాం- ఎక్కడో ఏ కొండ పంచనో గడ్డిపూల గుంపులోనో నించుని సృష్టి వైచిత్రికి తలలూపుతో మిగులుతాం- ఏ చీమల బారులోనో హడావుడిగ నడిచి వెడుతో నరజీవుల వికృత చేతలకి నివ్వెరపోతో మిగులుతాం- చివరికి మళ్ళీ నిరంతరం! . వజీర్ రహ్మాన్ Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… 2 వ్యాఖ్యలుఆగస్ట్ 3, 2013