ప్రతిఘటన … రషీద్ హుస్సేన్, పాలస్తీనా కవి.
నా దేశపు ఏ యోధుడూ ఒక చిన్న వరికంకుకైనా హాని చెయ్యడానికి నేను వ్యతిరేకం
పిల్లలు… ఏ పిల్లలైనా సరే, తుపాకులు ధరించవలసిరావడానికి నేను వ్యతిరేకం
నా చెల్లెలు సాయుధ కవాతు చెయ్యడానికి నేను వ్యతిరేకం
ఆ మాటకొస్తే, నేను నీ అభీష్టాలకి వ్యతిరేకం…
కానీ, వాళ్ల కళ్ళముందే నిరాఘాటంగా మనుషులప్రాణాలు పోతుంటే
ఎంత స్థిత ప్రజ్ఞులైనా ఏమిచెయ్యగలరు?
పదేళ్ళకే పిల్లలు వీరమరణం చెందడానికి నేను వ్యతిరేకం
ప్రతిచెట్టూ పళ్ళకి బలు, తూటాలు కాయడానికి వ్యతిరేకం
నా తోటలోని చెట్టుకొమ్మలు ఉరికంబాలవడానికి నేను వ్యతిరేకం
అభయాన్నివ్వ వలసిన నా నేల, మృత్యుసీమగా మారడానికి వ్యతిరేకం
గులాబీలు పూయవలసిన తోటలు కందకాలుగా మారడానికి వ్యతిరేకం.
అయితే,
నా నేలనీ,
నా మిత్రుల్నీ
నా యవ్వనాన్నీ తగలేసిన తర్వాత,
నా పద్యాలు తుపాకులు కాకుండా ఎలా ఉంటాయి?
.
రషీద్ హుస్సేన్
(1936 – 1977)
పాలస్తీనా కవి.
.
.
Opposition
.
I am against my country’s fighters hurting a single ear of corn
I am against a child – any child having to carry a gun
I am against my sister learning weapons drill
I am against what you will … but
What would even the saints have done
had their eyes been filled with killing?
I am against children becoming heroes at ten
Against the tree bearing shells for fruit
Against branches in my garden becoming gallows
I am against the sanctuary of my land being made into a scaffold
Against the rose-beds turning to trenches
And yet
After the burning of my land
and my friends
and my youth
How can my poems not become guns?”