అనువాదలహరి

అన్వేషణ … గెమాలియల్ బ్రాడ్ ఫోర్డ్, అమెరికను

నేనొక పరమ పాపిని; కానీ నాకు ఋషిత్వం అంటే ఏమిటో తెలుసు

అలసి వంగిన వాళ్ళ మోకాళ్ళూ, చిన్నా పెద్దా అపరాధాలూ,

వేనవేల సూదులు గుచ్చుతున్నట్లు అంతులేని పశ్చాత్తాపాలూ,

చిత్తంతో చేసిన పాపాలకి, జీవితాంతం నిజంగా చెల్లించే ప్రాయశ్చిత్తాలూ.  

.

నాకు అన్నిదిక్కులా తిరగాలనుంటుంది, కాని నాకు జైలు అంటే తెలుసు,

చెప్పుకోడానికెవరూ ఉండరు కాబట్టి, అలా రుద్రాక్షలకు చెప్పుకోడమే

రాగరంజితమైన ఈ శరీరం, దాని చిత్రవిచిత్రమైన చమత్కారాలూ

కళ్ళుమిరిమిట్లుగొలిపే శిలువ యశస్సుముందు చులకనచెయ్యడమే.

.

ఒకరితరఫున నేను వకాల్తా పుచ్చుకోలేను గాని, నా  అంతరాంతరాల్లో ఆత్మ

కోరికల మధ్య సంఘర్షణలో చివికి జీవితం దిక్కుమాలిపోయింది.

నేను ముందుకు నడిచివెళ్ళిన దారుల్లోనే, వెనక్కి వచ్చిన సందర్భాలున్నై

నేను దయ్యాన్ని వెంటాడుతున్నాను గాని, నే వేటాడదలిచింది దేముడిని.

.  

 

గెమాలియల్ బ్రాడ్ ఫోర్డ్.

9 October 1863 – 11 April 1932 )

అమెరికను కవి.

ఇదిచాలా చిత్రమైన కవిత. గెమాలియల్ బ్రాడ్ ఫోర్డ్ చాలా విలక్షణంగా కవితచెప్పడంలో ప్రతిభకలవాడు. “ఈ శరీరం నశ్వరమైనది. ఇది మనకి మోక్షసాధనకి ఎంత కారణమో, వ్యామోహాలకూ అంతే కారణం. మోహపాశాలతో మనల్ని బంధిస్తుంది” అని ఆధ్యాత్మిక చింతనులు ఏ మతంలోనైనా మొదటినుండీ చెబుతూ వస్తున్నదే. చివరి వరకు, కవిత ఆ శైలిలోనే సాగుతూ, ఒక అద్భుతమైన పదప్రయోగంతో, కవిత స్వరూపాన్ని, తన తాత్త్వికచింతననీ రూపుకట్టిస్తాడు కవి. చిట్టచివరి వాక్యం గమనించండి: నేను దయ్యాన్ని వేటాడుతున్నా (Though I am haunter of Devil), ఇక్కడ వేటాడుతున్నది దయ్యానికి ప్రతిరూపాలైన శారీరక కాంక్షలని అయినా; నే వేటాడదలచింది (I am hunger after God) ఇక్కడి Hunger శారీరకమైన ఆకలి కాదు, తప్పు అర్థాన్ని స్ఫురింపజేసే Iconoclasm కూడా కాదు. ఈ ఆకలి భగవదన్వేషణ. తను అన్వేషిస్తున్నది, ఈ శరీరంతో భగవంతుణ్ణి. అంటే, భగవంతుణ్ణి చేరుకోడానికిశరీరం ఒక సాధనం. అయితే దానికోసం శరీరాన్ని శుష్కింపజెయ్యనవసరం లేదు, దాని సహజ సౌందర్యాన్ని ఆశ్వాదిస్తూనే భగవదన్వేషణ కొనసాగించవచ్చు”నని అతని తాత్పర్యం.

.

Gamaliel Bradford
Gamaliel Bradford
Image Courtesy: http://www.poemhunter.com/gamaliel-bradford/biography/

.

Hunger

.

I’ve been a hopeless sinner, but I understand a saint,

Their bend of weary knees and their contortions long and faint,

And the endless pricks of conscience, like a hundred thousand pins,

A real perpetual penance for imaginary sins.

I love to wander widely, but I understand a cell,

Where you tell and tell your beads because you’ve nothing else to tell,

Where the crimson joy of flesh, with all its wild fantastic tricks,

Is forgotten in the blinding glory of the crucifix.

I cannot speak for others, but my inmost soul is  torn

With a battle of desires making all my life forlorn.

There are moments when I would untread the paths that I have trod.

I’m a haunter of the devil, but I hunger after God.

.

Gamaliel Bradford.

(9 October 1863 – 11 April 1932 )

American

%d bloggers like this: