ఉమర్ ఖయ్యాం రుబాయీలు
.
ఓహో, జ్ఞానుల్ని చర్చించుకోనీ! రా, ఈ ముసలి ఖయ్యాం
తోడుగా నడు; ఒకటి మాత్రం నిజం- పరిగెడుతుంది జీవితం
మిగతావన్నీ అబద్ధమైనా ఈ ఒక్కటి మాత్రం నిజం:
ఒకసారి విరిసిన కుసుమం, రాలిపోవడం తథ్యం..
వయసులో ఉన్నప్పుడు తరచు సేవించేవాడిని
పండితులనీ, యోగులనీ ; ఇదీ, అదీ, ప్రతి విషయాన్నీ
చాలా కూలంకషంగా తర్కించేవాళ్ళు; ఎన్నిసార్లు వెళ్ళినగానీ
నాకేం లాభించలేదు. వెళ్ళినద్వారంలోంచే తిరిగొచ్చేవాడిని
వాళ్లలో జ్ఞాన బీజాలని అక్షరాలా నాటేను;
కష్టపడి చేజేతులా పెరగడానికి ప్రోదిచేశాను
కోసుకునేవేళకి మిగిలింది పిడికెడు చేను:
“నేను నీటితో వచ్చేను… గాలితో పోతాను.”
.
ఉమర్ ఖయ్యాం
(18 May 1048 – 4 December 1131)
పెర్షియన్ కవి, తత్త్వవేత్త, ఖగోళ, గణిత శాస్త్రజ్ఞుడు, బహుభాషాకోవిదుడు
.
-
-
Omar Khayyam
Image Courtesy: http://en.wikipedia.org