అనువాదలహరి

ఒక సిగరెట్టు… ఎడ్విన్ జార్జి మోర్గన్, స్కాటిష్ కవి.

నువ్వులేకుండా పొగరాదు, నా అగ్నిశిఖా!

నువ్వు నిష్క్రమించిన తర్వాత 

నా ఏష్ ట్రేలో నీ సిగరెట్టు వెలుగుతూ, ప్రశాంతంగా.

సన్నని పొడవాటి బూడిదరంగు పొగ వదులుతోంది. 

పొగతాగని నా ఏష్ ట్రేలో

నీ సిగరెట్టు….

ప్రేమకి అంత గొప్ప ‘ప్రతీకగా’ నిలిచిన దాన్ని

ఎవరు నమ్ముతారా అన్న ఆలోచనతో నాకు నవ్వొచ్చింది.


ఆ చివరి మెలిక వణుకుతూ మీదకి ఎగయగానే

అకస్మాత్తుగా ఒక గాలి రివట

దాన్ని నాముఖం మీదకి కొట్టింది. 

అది సుగంధమా? అది అనుభవమా?

తక్షణం నువ్విక్కడ మెదిలావు, 

పొగవాసనవేసే నీ పెదాలమత్తులో నేను ములిగేను.

దీపం అవసరం లేదు.

చీకటిలో పొగని దాని మానాన్న దాన్నుండనీ.

ఆ నుసి నిట్టూరుస్తూ ట్రేలోకి జారేదాకా

రాత్రి మూడో ఝాము గడిచినా

నీ కడపటి ముద్దును శ్వాసిస్తూనే ఉంటాను.

.

ఎడ్విన్ జార్జి మోర్గన్

(27 April 1920 – 17 August 2010) 

స్కాటిష్ కవి.

ఈ కవితలో కవి ఒక “విడిచిపెట్టిన సిగరెట్టు”ని ఆసరాగా చేసుకుని ఒక చక్కని ప్రేమకవితని చెప్పాడు. ప్రేమలో, విరహంలో ఉన్న వ్యక్తులకి ఎప్పుడూ తమ ప్రియమైన వ్యక్తులు తమ సమీపంలో ఉన్న వస్తువులద్వారానో, లేదా వ్యక్తుల హావభావాలద్వారానో గుర్తుకు రావడం సహజం. ఇందులో “నా అగ్నిశిఖా!” అన్న పదం ద్వారా ఆత్మీయతనీ,  పొగ ఎంత నెమ్మదిగా పైకి ఎగస్తోందో అంత నెమ్మదిగానూ విరహవేదన ప్రజ్వలించడంద్వారానూ, చివరికి  మూడోఝాము గడిచేదాకా అనడంలో దాని తీవ్రతనూ కవి ప్రతిఫలించిన తీరు రసనిష్యందంగా ఉంది.

.

http://en.wikipedia.org/wiki/Edwin_Morgan_(poet)

One Cigarette.

.

No smoke without you, my fire.
After you left,
your cigarette glowed on in my ashtray
and sent up a long thread of such quiet grey
I smiled to wonder who would believe its signal
of so much love. One cigarette
in the non-smoker’s tray.
As the last spire
trembles up, a sudden draught
blows it winding into my face.
Is it smell, is it taste?
You are here again, and I am drunk on your tobacco lips.
Out with the light.
Let the smoke lie back in the dark.
Till I hear the very ash
sigh down among the flowers of brass
I’ll breathe, and long past midnight, your last kiss.

.

Edwin George Morgan 

(27 April 1920 – 17 August 2010)

Scottish Poet and Translator

%d bloggers like this: