హైకూలలో సంప్రదాయం ప్రకారం ఎలా వచ్చిన ఆలోచనలని అలా రాయడమే తప్ప, వేరే ఆంతర్యం లేదు. ఒక రకంగా చెప్పాలంటే, అవి ఆలోచనలకి సద్యోరూపాలు. అయితే ఈ చిన్న త్రిపాద స్వరూపంలోనే అద్భుతమైన విన్యాసాలు సాధించగలిగినవాళ్ళు లేకపోలేదు. కాకపోతే ముందుతరాల రచనలు చదవకపోవడం వల్ల ఇప్పుడు చాలా మంది పూర్వం చెప్పిన భావనలనీ, ప్రతీకలనీ మళ్ళీ మళ్ళీ వినియోగిస్తున్నారు. చాలా హైకూలలో అనుభూతి ప్రకటన కంటే ఊహాత్మక విన్యాసం ఎక్కువ ఉంటుంది. ఆ మేరకి అది లోపమే.