అనువాదలహరి

వికలాంగసైనికుడు… ఆలివర్ గోల్డ్ స్మిత్ , ఇంగ్లీషు కవి

“ప్రపంచంలో సగంమందికి మిగతా సగంమందీ ఎలా బ్రతుకుతున్నారో తెలీదు”… అన్నంత అతి సాధారణమూ, యదార్థమైన పరిశీలన మరొకటి ఉండదేమో. గొప్పవాళ్ళ ఆపదలూ, కష్టాలూ మన ఆలోచనలను ప్రభావితం చేసేలా మనకి చెప్పబడుతుంటాయి; అవి ఉపన్యాసాలలోలా కాస్త అతిశయోక్తులతో కూడుకుని ఉంటాయికూడా; ‘అయ్యో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో(పడ్డారో) చూడం’డని ప్రపంచం దృష్టికి తీసుకెళతారు; బాధలవల్ల కలిగే ఒత్తిడిలో ఉన్న గొప్పవాళ్లకి వాళ్ళ బాధలు చూసి మిగతా వాళ్ళు జాలిపడుతున్నారు అన్న ఎరుక ఉంటూనే ఉంటుంది; వాళ్ళ ప్రవర్తన ఏకకాలంలో వాళ్లకి ప్రజల మెచ్చుకోలూ, జాలినీ కూడా సంపాదించిపెడుతుంది.

ప్రపంచం అంతా చూస్తున్నప్పుడు ధైర్యంగా కష్టాలని ఎదుర్కోడంలో గొప్పదనం ఏమీ లేదు; మనుషులు అటువంటి సందర్భాల్లో ఆడంబరానికైనా డాంబికంగా కష్టాలు ఎదుర్కున్నట్టు నటిస్తారు. కాని ఎవరైతే, అజ్ఞాతమనే లోయల్లో కష్టాలు ధైర్యంగా ఎదుర్కుంటారో; ఎవరైతే కష్టాల్లో తమకి అండగాఉండి ఉత్సాహపరచడానికి మిత్రులూ, జాలిపడడానికి పరిచయస్థులూ లేకపోయినా, అసలు తమ కష్టాలు గట్టెక్కుతాయన్న ఆశ ఏ కోశానా లేకపోయినా, ప్రశాంతంగా నడుచుకుంటూ, నిర్లిప్తంగా వాటిని స్వీకరిస్తారో వాళ్ళు నిజంగా గొప్పవాళ్ళు; వాళ్ళు సామాన్య జనపదులైనా, దర్బారులో సభికులైనా సరే, వాళ్ళు మన అభినందలనకి తగినవాళ్ళే గాక, వాళ్ళని మనం అనుకరించడానికీ, గౌరవించడానికీ కూడా యోగ్యులై ఉంటారు.

 కొన్ని దిగువతరగతులలో ప్రజలు ఒక రోజులో అనుభవించే దురవస్థలు, ఉన్నతవర్గాలలోని మనుషులు తమ జీవితకాలం మొత్తంమీద అనుభవించరు. ఐనప్పటికీ గొప్పవాళ్ల విషయంలో అతి సామాన్యమైన ఇబ్బందులని కూడా విపత్తులుగా ఎత్తిచూపుతూ, వాళ్ల కష్టాలని కావ్యాలుగా మలచి ఆలపిస్తే, సామాన్యులుపడే కష్టాల విషయంమాత్రం ఎవరూ పట్టించుకోరు; మన సైనిక, నావిక దళాలలో క్రిందిస్థాయి సైనికులు ఏ సణుగుడూ, ఏ విచారమూ, ఏ ఫిర్యాదులూ లేకుండా సహించే కష్టాలు మనం ఊహించలేము; ఆవేదనతో విధిని నిందించడంగాని, తమ వీరత్వంమీద దేశప్రజలు బ్రతుకుతున్నారని గొప్పలుచెప్పుకోడంగాని చెయ్యరు. నిజానికీ ప్రతిరోజూ వాళ్లు దుర్భరమైన జీవితమే గడుపుతారు, ఐనా ఏ అసంతృప్తి ప్రకటించకుండా దాన్ని అలాగే స్వీకరిస్తూ ఉంటారు.

ఒక ఓవిడ్ (Ovid), ఒక సిసీరో (Cicero), ఒక రబూటిన్ (Rabutin) వాళ్ల దురదృష్టాన్ని గురించి చెపుతున్నప్పుడు నాకు ఎంత కోపం వస్తుందో చెప్పలేను; ఇంతకీ వాళ్లు పడిపోతున్న ఓపలేని కష్టం ఏమిటయ్యా అంటే వాళ్ళు భూమిమీద ఏదోచోట ఆనందం ఉందని తెలివితక్కువగా ఊహించుకుంటే, ఆ ఊహించుకున్నచోటుకి వాళ్ళు వెళ్ళలేకపోవడం. జనసామాన్యం నిత్యం ఏ అయిష్టతా ప్రకటించకుండా అనుభవించే కష్టాలతో సరిపోల్చితే, వాళ్ల కష్టాలు కష్టాలుపడడం కాదు; ఆశించిన సుఖాలు అందకపోవడం. వాళ్ళు సుష్టుగా తింటారు, తాగుతారు, పడుక్కుంటారు. వాళ్ళకి సేవలు చెయ్యడానికి బానిసలు ఉండడమే గాక, రేపు జీవించడానికి జీవనోపాధి ఎలా అన్న చింత జీవితకాలమూ ఉండదు; అదే సాటి మనుషులలో చాలమంది ఒక స్నేహితుడి అండగాని, ఓదార్పు మాటలుగాని దొరకక, ప్రకృతి బీభత్సాలనుండి తలదాచుకుందికి ఏ రకమైన రక్షణకూడా లేకుండా బతకవలసి వస్తుంది.

నేను ఈ రకమైన ఆలోచనలలోకి వెళ్ళిపోవడానికి కారణం… కొద్దిరోజుల క్రితం, నేను చాలా కాకతాళీయంగా నాకు చిన్నప్పటినుండీ తెలిసిన కుర్రాడొకడు, ఇప్పుడు సైనికదుస్తులు వేసుకుని, కర్రకాలుతో, పట్నంలో కొన్నిదుకాణాలముందు నిలబడి అడుక్కోవడం చూడ్డం తటస్థించడమే. పల్లెలో ఉన్నంతకాలం అతను చాలా నిజాయితీ పరుడనీ, కష్టపడి పనిచేసేవాడనీ స్వయంగా నే నెరిగి ఉండడంవల్ల, పాపం అతను ఈ దౌర్భాగ్యస్థితిలోకి దిగజారిపోవడానికి కారణం ఏమయి ఉంటుదబ్బా అని కుతూహలం కలిగింది. అందుకని, నాకు ఉచితమని తోచినది అతని చేతులో పెడుతూ, అతని గత జీవితం గురించీ, పడిన కష్టాలగురించీ, అతనీ విధంగా దిగజారిపోవడానికి వెనకగల కారణాలగురించీ తెలుసుకో గోరాను. పాపం ఆ అవిటి సైనికుడు, నా ప్రార్థనని మన్నించి, తల గోక్కుంటూ, తన ఊతకర్రమీద ఆనుకుని నిలబడి, తన కథ ఈ విధంగా చెప్పనారంభించేడు:

“అయ్యా! కష్టాలంటే ఏం చెప్పమంటారు, మిగతావాళ్ళకంటే నేనేదో కష్టపడిపోయానని గొప్పలు చెప్పుకోలేను; ఎందుకంటే, దేముడిదయవల్ల, ఒక కాలు పోవడం, ఇలా అడుక్కోవలసి రావడం మినహాయిస్తే, నేను విచారించడానికి తగిన కారణం కనపడదు. అదే మా రెజిమెంట్ లో పాపం బిల్ టిబ్స్ అని ఉన్నాడు. అతనికైతే  రెండు కాళ్ళతోపాటు ఒక కన్నుకూడా పోయింది; దేముడిదయవల్ల నాకు అలా జరగలేదు.

 “నేను ష్రోప్ షైర్ లో పుట్టేను; నా తండ్రి ఒక కూలీ, అతను నాకు ఐదేళ్ళప్పుడు చనిపోయాడు. అందుకని నన్ను చర్చిసేవలో నియోగించేరు. నా తండ్రి ఎప్పుడూ దేశదిమ్మరిగా తిరగడంతో, నేను ఎక్కడ పుట్టానో, ఏ చర్చి పరిధిలోకి వస్తానో ఎవరూ నిర్ణయించలేకపోయారు; దాంతో నన్ను వాళ్ళు చర్చి ఒక అధికార పరిధినుండి మరొక చర్చి అధికారపరిధిలోకీ, అక్కడనుండి మూడోదాని అధికారపరిధిలోకీ పంపేరు. వాళ్ల వాలకం చూస్తే నాకేమనిపించిమదంటే, నన్నెక్కడా పుట్టనివ్వకుండా ఏ చర్చికీ చెందకుండా చేస్తారేమోనని. చివరికి ఎలాగయితేనేం, నా పుట్టుక సంగతి నిర్థారించేరు. నాకు చదువుమీద ఆసక్తి  ఉండడంతో, నేనెలాగైనా బాగా చదువుకోవాలనుకున్నాను. కాని నాకు ఆశ్రయం కల్పించిన “బీదగృహం” యజమాని, నాకు గరిటతిప్పడం వచ్చిన దగ్గరనుండీ పనిలో పెట్టాడు. ఒక అయిదేళ్లపాటు జీవితం సుఖంగానే గడిచింది అక్కడ. రోజుకి పదిగంటలు పనిచేసే వాడిని, దానితో నా భోజనం, పానీయం ఒడ్డెక్కిపోయేవి. నేను బయటికి వేళితే పారిపోతానేమోనన్న కారణం చేత నాకు బయటకి వేళ్ళే స్వేచ్ఛ అయితే ఇవ్వలేదు. ఇవ్వకపోతే మాత్రం ఏం? మొత్తం ఇల్లూ, ఆవరణా, అంతా నాదే. అది చాలు నాకు. ఆ తర్వాత నన్ను ఒక రైతుకి అప్పచెప్పేరు. అక్కడ నేను అవసరమైనపుడు పెందరాడే, లేకపోతే ఆలస్యంగా లేచే వాడిని. అక్కడ నాకు తినడానికీ తాగడానికీ సమృద్ధిగా దొరికేది. అతను అప్పచెప్పిన పనులు నాకు నచ్చడంతో అంతా సవ్యంగానే సాగిపోయింది అతను చనిపోయేదాకా. ఆ తర్వాత నా పొట్ట నేను పోషించుకోవలసి రావడంతో నేను నా అదృష్టాన్ని వెతుక్కుంటూ బయలుదేరాను.

“ఆ వేసవిలో ఒక పట్టణం నుండి మరో పట్టణానికి తిరుగుతూ, పనిదొరికినపుడు పనిచేసేవాడిని, లేనపుడు ఏదీ లేదు; ఒక రోజు “ప్యూనీ జడ్జి”(Puisne Judge) గారి పొలంలోంచి నేను వెళ్లడం తటస్థించింది; ఒక చెవులపిల్లి నా త్రోవకి అడ్డంగా పరిగెత్తడం చూశాను; ఆ క్షణంలో నా నెత్తిమీద ఏ శని తాండవించిందో తెలీదు కాని, దాన్ని కర్రతో వేటువెయ్యాలని దుర్బుద్ధిపుట్టింది. ఇంకేముంది? దాన్ని చంపి  తీసుకొస్తున్నాను. సరిగ్గా ఆ జడ్జిగారే నాకు ఎదురయ్యాడు. నన్ను ఒక దొంగవేటగాడిననీ (Poacher), దుర్మార్గుడిననీ నా కాలరు పట్టుకుని నే నెవరినో ఋజువుచేసుకోమన్నాడు. నేను వెంటనే అతని కాళ్లమీద పడి, క్షమాపణలు కోరుకుని, నాకు తెలిసిన మేరకి నా కులమూ, గోత్రమూ పుట్టుపూర్వోత్తరాలన్నీ ఉన్నదున్నట్టు విన్నవించుకున్నాను; కానీ జడ్జిగారు నన్ను నేను ఋజువుపరుచుకోలేకపోయానని చెప్పి ఆరోపించి, పేదవాడినవడంతో నేరస్థుడిగా ధృవీకరించి, లండనులో “న్యూగేట్”(Newgate) కి పంపించేడు… అక్కడనుండి నన్ను దేశదిమ్మరినని చెప్పి దేశాంతరం పంపించడానికి.

“న్యూగేట్ జైలు గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్పొచ్చు గాని, నామట్టుకు నా జీవితంలో అంత అనువైన ప్రదేశం ఎక్కడా కనిపించలేదు. అక్కడ కడుపునిండా తినడానికీ తాగడానికీ దొరకడంతో పాటు, ఏ పనీ పాటా ఉండేది కాదు;  అటువంటి జీవితము ఎన్నాళ్ళో కొనసాగదు; కొనసాగడానికి చాలా అదృష్టం కావాలి; ఐదునెలలు గడిచిన తర్వాత నన్ను జైలులోంచి విడుదలచేసి, మరో రెండు వందలమందితోపాటు ఓడ ఎక్కించి, ప్లాంటేషన్స్(Plantations) కి పంపించేశారు. మా ప్రయాణం సజావుగా సాగలేదు; అందర్నీ గొలుసులతో బంధించి ఒక్కచోట కట్టిపడేయ్యడంతో, సరియైన గాలి ఆడక వందమందికి పైగానే చనిపోయారు. మిగిలినవాళ్ళు ఎంతగా అనారోగ్యంపాలయ్యేరో ఒక్క భగవంతుడికి తెలుసు. మేము తీరం చేరగానే మమ్మల్ని ప్లాంటేషన్స్ యజమానులకి అమ్మేసేరు. నేను పెద్దగా చదువుకోలేదు కాబట్టి, నేను మిగతా నీగ్రోలతో పాటే పనిచేయవలసి వచ్చింది; విధిలేక నా శిక్షాకాలం అలా వెళ్లదీయవలసి వచ్చింది.

“నా శిక్ష పూర్తవగానే, నేను తిరుగుప్రయాణానికి కావలసిన డబ్బులుకోసం పనిచేశాను. తిరిగి మళ్ళీ ఇంగ్లండు చేరగలిగినందుకు ఆనందం వేసింది. ఎందుకంటే, నా దేశమంటే నాకు ప్రేమ. అయితే, నేను పల్లెటూర్లోకి వెళితే నన్ను దేశదిమ్మరినన్న నేరంమోపి మళ్ళీ ప్లాంటేషన్స్ కి పంపెస్తారేమోనన్న భయంతో, అక్కడికి వెళ్ళకుండా పట్నంలోనే  దొరికినప్పుడు చిన్న చిన్న పనులు చేసుకుంటూ గడిపేను.

“అలా కొంతకాలం సుఖంగానే గడిచింది. కానీ, ఒకరోజు సాయంత్రం పనినుండి ఇంటికి వచ్చేక, ఇద్దరు మనుషులు నన్ను క్రిందకి పడదోసి, తర్వాత నన్ను నిలబడమని అడిగేరు. వాళ్ళు యువకులని యుద్ధంలో బలవంతంగా నమోదుచేసే ముఠాకి చెందినవాళ్ళు. నన్ను న్యాయాధిపతిదగ్గరకి తీసుకుపోయారు. నన్ను నేను ఋజువుచేసుకోలేక పోవడంతో, అయితే నావికుడిగా, లేకపోతే సైనికుడిగా నమోదుచేయించుకోవడం తప్ప నాకు వేరే గత్యంతరం లేకపోయింది. నేను రెండో దాన్ని ఎంచుకున్నాను. ఆ హోదాలో నేను Flanders లో రెండు పోరాటాల్లోనూ, Val, Fontenoy యుద్ధాలలోనూ పాల్గొన్నాను. ఇదిగో ఇక్కడ నా గుండె పక్కనుండి ఒక తూటా వెళిపోతే, మా రెజిమెంట్ లోని డాక్టరు దాన్ని నయం చేసి, నేను త్వరగా కోలుకునేటట్టు చేశాడు కూడా.

“యుద్ధవిరమణ ప్రకటించగానే, నన్ను ఉద్యోగంనుండి విడుదలచేశారు. నా గాయం అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతుండడంతో ఉద్యోగంచెయ్యలేక నేను ఈస్ట్ ఇండియా కంపెనీ (East India Company)లో “లాండ్ మాన్ (Land Man)” ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాను. ఫ్రెంచి వాళ్లతో ఆరు తీవ్రమైన పోరాటాల్లో పాల్గొన్నాను; నాకే గనక చదవడం రాయడం వచ్చి ఉంటే, మా కేప్టెన్ నన్ను కార్పొరల్ ని చేసి ఉండేవాడని నాకు గట్టి నమ్మకం. కాని నాకు ఆ పదోన్నతి వచ్చే అదృష్టం రాసిపెట్టి లేదు. దానికి తోడు నేను వెంటనే అనారోగ్యం పాలవడంతో వెంటనే ఇంటికి తిరుగుముఖం పట్టవలసి వచ్చింది జేబులో నలభై పౌండ్లతో. ఇదంతా ఇప్పుడు జరుగుతున్న యుద్ధానికి ముందు సంగతి. నేను ఇంటికి చేరి ఈ డబ్బులతో ఎలాగో కాలం వెళ్లబుచ్చుదామనుకున్నాను; అయితే, ప్రభుత్వానికి యుద్ధానికి మనుషులు అవసరం పడడంతో, నేను ఇంకా నా కాలు నేలమీద మోపీమోపకుండానే, నన్ను మళ్ళీ నావికుడిగా తోలేసింది.

“ఓడ సరంగుకి, అతనే చెప్పినట్టు, నేను చాలా మొండివాడిలా కనిపించేను. నేను సోమరిగా కూచుని పూర్వీకుల పరువు తీస్తున్నానని, నాకు నా పనేమిటో అర్థం అయేలా చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. కానీ ఏం చెయ్యను నాకు సముద్రం మీద ఓడ వ్యవహారాలంటే ఏమీతెలీదు; అయినా, అతనేంచేస్తున్నాడో తెలీనంతగా కొడుతుండేవాడు. అతను కొట్టినప్పుడల్లా నా నలభై పౌండ్లూ నాదగ్గరున్నాయి, నాకదే చాలు అనుకుని నన్ను నేను ఊరడించుకునేవాడిని. ఆ డబ్బులు నా దగ్గర ఈ పాటికి ఉండవలసిందే కాని, దురదృష్టవశాత్తూ మా ఓడని ఫ్రెంచివాళ్ళు స్వాధీనం చేసుకోవడంతో ఆ డబ్బంతా పోయింది.

“ఓడ సిబ్బందిని అందర్నీ బ్రెస్ట్ (Brest) తీసుకుపోయి జైల్లో పడేశారు; నే నయితే రాటుతేరాను గనుక నాకేమీ కాలేదు గాని, జైలుజీవితం అలవాటులేక అందులో చాలా మంది అక్కడికక్కడే చనిపోయేరు. ఒకరోజు రాత్రి అలవాటుప్రకారం దుప్పటి కప్పుకుని వెచ్చగా బల్లచెక్కలమీద పడుక్కున్నప్పుడు, సరంగు నాదగ్గరికి వచ్చి నన్ను లేపి, “జాక్, ఆ ఫ్రెంచి సెంట్రీని లేపేగలవా?” అని అడిగేడు. తెలివితెచ్చుకుందికి ప్రయత్నిస్తూనే, “అదోపెద్దపనేం కాదు, కానీ, మరొకరి చేసాయం ఉండాలి,” అన్నాను. “అయితే పద,” అన్నాడు. నేను లేచి, దుప్పటీ నా నడుము చుట్టూ చుట్టుకుని ఫ్రెంచి కాపలాదారుడితో పోరాడడానికి బయల్దేరాను. నాకు ఆ ఫ్రెంచివాళ్ళంటే అసహ్యం; వాళ్లందరూ బానిసలే, కాళ్ళకి కర్రజోళ్ళు తొడుక్కునేవాళ్ళే.

“చేతిలో ఆయుధాలు లేకపోయినా, ఏ క్షణంలోనైనా ఒక ఫ్రెంచివాడు ఐదుమంది ఇంగ్లీషువాళ్ళని అవలీలగా ఓడించగల సమర్థుడు; మేము ఇద్దరం కాపలాదారులున్న ద్వారం దగ్గరకి వెళ్ళేము. వాళ్ళమీదకి ఒక్క సారి ఉరికి, ఒక్క క్షణంలో చేతుల్లోని ఆయుధాలు లాక్కుని వాళ్లని క్రిందపడేసేం. అక్కడనుండి తొమ్మిదిమందిమి జైల్లోంచి పారిపోయి రేవుగట్టుకి పరిగెత్తి, దొరికిన మొట్టమొదటి పడవ ఎక్కి హార్బరునుండి దూరంగా సముద్రం మీదకి చేరుకున్నాం. మూడురోజులైనా ప్రయాణం చేశామో లేదో, డోర్సెట్ (Dorset) కి చెందిన ఒక దొంగలఓడ మమ్మల్ని పట్టుకుంది; ఇంతమంది అనుభవమున్న పనివాళ్లు దొరకడంతో వాళ్లు సంతోషించేరు; మేం కూడా మా అదృష్టాన్ని పరీక్షించుకోదలుచుకున్నాం. కాని మేం అనుకున్నట్టు అదృష్టం కలిసిరాలేదు. ఇరవై మూడు ఫిరంగులే ఉన్న మేము, మరో మూడురోజులు తిరక్కుండా పాంపడోర్ (Pompadour)కి చెందిన నలభై ఫిరంగులున్న మరో దొంగలఓడకి చిక్కేము. మూడు గంటలసేపు వాళ్లతో పోరాడేం; మాకే గనక వెనక మరికొద్ది మంది మనుషులుంటే, మేము ఆ ఫ్రెంచి ఓడని పట్టుకునే వాళ్లమే; దురదృష్టం కొద్దీ, ఇక మేం గెలుస్తామనుకునే వేళకి మావాళ్లందరూ చనిపోయారు.

“మళ్ళీ నేను ఫ్రెంచివాళ్ల అధీనంలోకి పోయాను. నన్ను వాళ్ళు గనక బ్రెస్ట్(Brest) పంపించి ఉంటే, నా బ్రతుకు దుర్భరమైపోయి ఉండేది; అక్కడ అదృష్టం బాగుండి వాళ్ళు నన్ను వైపర్ (Viper) కి పంపేరు. అన్నట్టు చెప్పడం మరిచిపోయాను… ఈ పోరాటంలో నాకు రెండు చోట్ల దెబ్బలు తగిలేయి; నా ఎడం చేతి నాలుగు వేళ్ళూ పోయాయి, ఒక కాలు తెగిపోయింది. ఈ పోయిన వేళ్ళూ, కాలూ గనక ఏ దొంగ ఓడ మీదో కాకుండా, రాజుగారి ఓడమీద పోయి ఉండి ఉంటే నాకు జీవితాంతమూ కూడూ గుడ్డకి లోటులేకుండా ఏర్పాటు జరిగి ఉండేది. కానీ అంత అదృష్టం ఏదీ? ఒక మనిషి గొప్పవాళ్లింట్లో పుడితే మరొకడు పేదవాడింట్లో పుడతాడు. ఏమయినా, నేను భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. నేను ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండగలిగేను; స్వేచ్ఛనీ, నా దేశాన్నీ ప్రేమిస్తూనే ఉంటాను… స్వాతంత్ర్యం, సౌభాగ్యం, నా పూర్వపు ఇంగ్లండు ఎల్లప్పుడూ వర్ధిల్లాలి. జయహో!”

అని చెప్పి, తను కుంటుకుంటూ వెళ్ళిపోయాడు … నన్ను అతని ధైర్యానికీ, సంతుష్టికీ విస్తుపోమని చెబుతూ. తత్త్వబోధనకంటే, దైన్యానికి అలవాటుపడి జీవించడం జీవితాన్ని తృణప్రాయంగా స్వీకరించడం నేర్పుతుందన్న విషయం నేను ఒప్పుకోకుండా ఉండలేను.

.

ఆలివర్ గోల్డ్ స్మిత్

(10 November 1730 – 4 April 1774) 

  ఇంగ్లీషు- ఐరిష్ కవి, నవలాకారుడు, నాటక రచయిత  

***

.

Oliver Goldsmith
Oliver Goldsmith (Photo credit: Wikipedia)

.

The Disabled Soldier

No observation is more common, and at the same time more true, than that one half of the world are ignorant how the other half-lives. The misfortunes of the great are held up to engage our attention; are enlarged upon in tones of declamation; and the world is called upon to gaze at the noble sufferers: the great, under the pressure of calamity, are conscious of several others sympathising with their distress; and have, at once, the comfort of admiration and pity.

There is nothing magnanimous in bearing misfortunes with fortitude, when the whole. world is looking on: men in such circumstances will act bravely even from motives of vanity: but he who, in the vale of obscurity, can brave adversity; who without friends to encourage, acquaintances to pity, or even without hope to alleviate his misfortunes, can behave with tranquillity and indifference, is truly great: whether peasant or courtier, he deserves admiration, and should be held up for our imitation and respect.

While the slightest inconveniences of the great are magnified into calamities; while tragedy mouths out their sufferings in all the strains of eloquence, the miseries of the poor are entirely disregarded; and yet some of the lower ranks of people undergo more real hardships in one day, than those of a more exalted station suffer in their whole lives. It is inconceivable what difficulties the meanest of our common sailors and soldiers endure without murmuring or regret; without passionately declaiming against providence, or calling their fellows to be gazers on their intrepidity. Every day is to them a day of misery, and yet they entertain their hard fate without repining.

With what indignation do I hear an Ovid, a Cicero, or a Rabutin complain of their misfortunes and hardships, whose greatest calamity was that of being unable to visit a certain spot of earth, to which they had foolishly attached an idea of happiness. Their distresses were pleasures, compared to what many of the adventuring poor every day endure without murmuring. They ate, drank, and slept; they had slaves to attend them, and were sure of subsistence for life; while many of their fellow creatures are obliged to wander without a friend to comfort or assist them and even without shelter from the severity of the season.

I have been led into these reflections from accidentally meeting, some days ago, a poor fellow, whom I knew when a boy, dressed in a sailor’s jacket, and begging at one of the outlets of the town, with a wooden leg. I knew him to have been honest and industrious when in the country, and was curious to learn what had reduced him to his present situation. Wherefore, after giving him what I thought proper, I desired to know the history of his life and misfortunes, and the manner in which he was reduced to his present distress. The disabled soldier, for such he was, though dressed in a sailor’s habit, scratching his head, and leaning on his crutch, put himself into an attitude to comply with my request, and gave me his history as follows:

“As for my misfortunes, master, I can’t pretend to have gone through any more than other folks; for, except the loss of my limb, and my being obliged to beg, I don’t know any reason, thank Heaven, that I have to complain. There is Bill Tibbs, of our regiment, he has lost both his legs, and an eye to boot; but, thank Heaven, it is not so bad with me yet.

“I was born in Shropshire; my father was a labourer, and died when I was five years old, so I was put upon the parish. As he had been a wandering sort of a man, the parishioners were not able to tell to what parish I belonged, or where I was born, so they sent me to another parish, and that parish sent me to a third. I thought in my heart, they kept sending me about so long, that they would not let me be born in any parish at all; but at last, however, they fixed me. I had some disposition to be a scholar, and was resolved at least to know my letters: but the master of the workhouse put me to business as soon as I was able to handle a mallet; and here I lived an easy kind of life for five years. I only wrought ten hours in the day, and had my meat and drink provided for my labour. It is true, I was not suffered to stir out of the house, for fear, as they said, I should run away; but what of that? I had the liberty of the whole house, and the yard before the door, and that was enough for me. I was then bound out to a farmer, where I was up both early and late; but I ate and drank well; and liked my business well enough, till he died, when I was obliged to provide for myself; so I was resolved to go seek my fortune.

“In this manner I went from town to town, worked when I could get employment, and starved when I could get none; when, happening one day to go through a field belonging to a justice of peace, I spied a hare crossing the path just before me; and I believe the devil put it into my head to fling my stick at it. Well, what will you have on’t? I killed the hare, and was bringing it away, when the justice himself met me; he called me a poacher and a villain, and collaring me, desired I would give an account of myself. I fell upon my knees, begged his worship’s pardon, and began to give a full account of all that I knew of my breed, seed, and generation; but though I gave a very true account, the justice said I could give no account; so I was indicted at the sessions, found guilty of being poor, and sent up to London to Newgate, in order to be transported as a vagabond.

“People may say this and that of being in jail, but, for my part, I found Newgate as agreeable a place as ever I was in in all my life. I had my belly full to eat and drink, and did no work at all. This kind of life was too good to last for ever; so I was taken out of prison, after five months, put on board of ship, and sent off, with two hundred more, to the plantations. We had but an indifferent passage, for being all confined in the hold, more than a hundred of our people died for want of sweet air; and those that remained were sickly enough, God knows. When we came ashore we were sold to the planters, and I was bound for seven years more. As I was no scholar, for I did not know my letters, I was obliged to work among the negroes; and I served out my time, as in duty bound to do.

“When my time was expired, I worked my passage home, and glad I was to see old England again, because I loved my country. I was afraid, however, that I should be indicted for a vagabond once more, so did not much care to go down into the country, but kept about the town, and did little jobs when I could get them.

“I was very happy in this manner for some time till one evening, coming home from work, two men knocked me down, and then desired me to stand. They belonged to a press-gang. I was carried before the justice, and as I could give no account of myself, I had my choice left, whether to go on board a man-of-war, or list for a soldier. I chose the latter, and in this post of a gentleman, I served two campaigns in Flanders, was at the battles of Val and Fontenoy, and received but one wound through the breast here; but the doctor of our regiment soon made me well again.

“When the peace came on I was discharged; and as I could not work, because my wound was sometimes troublesome, I listed for a landman in the East India Company’s service. I have fought the French in six pitched battles; and I verily believe that if I could read or write, our captain would have made me a corporal. But it was not my good fortune to have any promotion, for I soon fell sick, and so got leave to return home again with forty pounds in my pocket. This was at the beginning of the present war, and I hoped to be set on shore, and to have the pleasure of spending my money; but the Government wanted men, and so I was pressed for a sailor, before ever I could set a foot on shore.

“The boatswain found me, as he said, an obstinate fellow: he swore he knew that I understood my business well, but that I shammed Abraham, to be idle; but God knows, I knew nothing of sea-business, and he beat me without considering what he was about. I had still, however, my forty pounds, and that was some comfort to me under every beating; and the money I might have had to this day, but that our ship was taken by the French, and so I lost all.

“Our crew was carried into Brest, and many of them died, because they were not used to live in a jail; but, for my part, it was nothing to me, for I was seasoned. One night, as I was asleep on the bed of boards, with a warm blanket about me, for I always loved to lie well, I was awakened by the boatswain, who had a dark lantern in his hand. ‘Jack,’ says he to me, ‘will you knock out the French sentry’s brains?’ ‘I don’t care,’ says I, striving to keep myself awake, ‘if I lend a hand.’ ‘Then, follow me,’ says he, ‘and I hope we shall do business.’ So up I got, and tied my blanket, which was all the clothes I had, about my middle, and went with him to fight the Frenchman. I hate the French, because they are all slaves, and wear wooden shoes.

“Though we had no arms, one Englishman is able to beat five French at any time; so we went down to the door where both the sentries were posted, and rushing upon them, seized their arms in a moment, and knocked them down. From thence nine of us ran together to the quay, and seizing the first boat we met, got out of the harbour and put to sea. We had not been here three days before we were taken up by the Dorset privateer, who were glad of so many good hands; and we consented to run our chance. However, we had not as much luck as we expected. In three days we fell in with the Pompadour privateer of forty guns, while we had but twenty-three, so to it we went, yard-arm and yard-arm. The fight lasted three hours, and I verily believe we should have taken the Frenchman, had we but had some more men left behind; but unfortunately we lost all our men just as we were going to get the victory.

“I was once more in the power of the French, and I believe it would have gone hard with me had I been brought back to Brest; but by good fortune we were retaken by the Viper. I had almost forgotten to tell you, that in that engagement, I was wounded in two places: I lost four fingers off the left hand, and my leg was shot off. If I had had the good fortune to have lost my leg and use of my hand on board a king’s ship, and not aboard a privateer, I should have been entitled to clothing and maintenance during the rest of my life; but that was not my chance: one man is born with a silver spoon in his mouth, and another with a wooden ladle. However, blessed be God, I enjoy good health, and will for ever love liberty and old England. Liberty, property, and old England, for ever, huzza!”

Thus saying, he limped off, leaving me in admiration at his intrepidity and content; nor could I avoid acknowledging, that an habitual acquaintance with misery serves better than philosophy to teach us to despise it.

***

Oliver Goldsmith

Text Courtesy:

http://www.bibliomania.com/0/5/24/341/17273/1/frameset.html

%d bloggers like this: