అనువాదలహరి

ఈ నంబరు వాడుకలో లేదు … మంగళేష్ దబ్రాల్, హిందీ కవి

ఈ నంబరు వాడుకలో లేదు

నేనెక్కడికెళ్ళినా, ఏ నెంబరు ప్రయత్నించినా 

ఆవలి అంచునుండి నాకో కొత్త గొంతు వినిపిస్తుంది:

ఈ నంబరు వాడుకలో లేదు,

మీరు డయలుచేసిన నంబరు  మరొకసారి సరిచూసుకొండి” అంటూ. 

 

నిన్న మొన్నటివరకూ, ఆ నంబరుకొడితే సమాధానమిచ్చిన మనుషులు

 “అయ్యో, మీరు తెలియకపోవడమేమిటి?

ఈ సృష్టిలో అందరికీ చోటుంది” అనేవారు.

కానీ ఇప్పుడు ఆ నంబరు పాతబడిపోయింది.

ఆ నంబరు వాడుకలో లేదు.

ఆ చిరునామాల్లో ఇప్పుడు ఎవరూ మిగలలేదు.

ఒకప్పుడు కాలిచప్పుడు అలికిడికి తలుపులు తెరుచుకునేవి.

ఇప్పుడు బెల్లుకొట్టి సందేహంతో ఎదురుచూడాలి.

చివరకి ఎలాగో తెరుచుకుని ఎవరైనా కనిపించినా

ఆ వ్యక్తి బహుశా మారిపోయి ఉండవచ్చు,

అతను “మీరు ఎప్పుడూమాటాడే వ్యక్తిని నేను కాదు;

మీ బాధలు వెళ్ళగక్కుకునే నంబరు ఇదికాదు,” అనొచ్చు.

.

నేనెక్కడికెళితే అక్కడ, నంబర్లూ, ముఖాలూ,

నైసర్గిక స్వరూపాలూ మారిపోయినట్టనిపిస్తుంది.

పాత డైరీలు కాలువల్లో చెల్లాచెదరై

పేర్లు నెమ్మదిగా నీటిప్రవాహానికి చెరిగిపోతున్నాయి;

ఇప్పుడు తీగలతోనూ, లేకుండానూ

కొత్తనంబర్లు దొరుకుతున్నై

కానీ అక్కడ నడిచే సంభాషణతీరు మారింది

జరిగేదల్లా అపరిచితుల్లా వ్యవహారాలూ

అమ్మకాలూ కొనుగోళ్ళూ వ్యాపారమే.

నేనెప్పుడు నంబరు కొట్టినా

రండి రండి, లోపలికి రండి,

మీరు కాస్త విశ్రాంతి తీసుకొండి,

మీకు ఎప్పుడు తీరుబాటైనా,

ఒకసారి తొంగిచూసిపోతుండండి

అబ్బే ఏమీ లేదు, ఊరికే,

కేవలం ప్రకృతిధర్మానికి, అంతే!”

అని సాదరంగా లోపలికి ఆహ్వానించే గొంతు

వినిపిస్తుందేమోనని

చాలా ఆత్రంగా ఎదురుచూస్తుంటాను.

.

మంగళేష్ దబ్రాల్

16th May 1948

హిందీ కవి.

.

Mangalesh Dabral
Mangalesh Dabral
Image Courtesy: http://www.kavitakosh.org/

.

THIS NUMBER DOES NOT EXIST

 .

This number does not exist.

Wherever I go whichever number I dial

At the other end a strange voice says

This number does not exist yeh number maujood nahin hai

Not too long ago at this number I used to reach people

Who said: of course we recognize you

There is space for you in this universe

 

But now this number does not exist it is some old number.

At these old addresses very few people are left

Where at the sound of footsteps doors would be opened

Now one has to ring the bell and wait in apprehension

And finally when one appears

It is possible that he might have changed

Or he might say I am not the one you used to talk to

This is not the number where you would hear out your grief

 

Wherever I go numbers maps faces seem to be changed

Old diaries are strewn in the gutters

Their names slow-fading in the water

Now other numbers are available more than ever with and without wires

But a different kind of conversation on them

Only business only transactions buy-and-sell voices like strangers

Whenever I go I desperately dial a number

And ask for the voice that used to say

The door is open you can stay here

Come along for a while just for the sake of it any time in this universe.

.

Mangalesh Dabral

(16th May 1948 – )

Hindi Poet

%d bloggers like this: