అనువాదలహరి

నల్లమందు చేలలో … జేమ్స్ స్టీఫెన్స్, ఐరిష్ కవి

.

పాట్నీ ఓ పిచ్చోడు. వాడు నాతో అంటాడు:

ప్రతిరోజూ ఉదయం వాడు చూస్తుంటాడట

ఆకాశంలో ఒక దేవదూత విహరించడం;

ప్రభాత సూర్యకాంతుల ఆకాశం నుండి

దోసిళ్ళకొద్దీ నల్లమందు విత్తనాలను

అన్నిదిక్కులా పైరులమీద జల్లుతూ పోతాడట.

అని చెప్పి, తర్వాత ఆ దేవదూత సూర్యుడిలో

ఎరుపు రంగు కోసం పరిగెడతాడని చెప్పేడు.

అరే, నల్లమందు ఒక కలుపు మొక్క

అంటాన్నేను; కాదంటాడు వాడు.

పొడుగ్గా అందంగా ఉండే ఆ పువ్వుల్ని

పైరులమధ్యా, మైదానాలమీదా

తోటల్లో దొడ్లల్లో వ్యాప్తిచెయ్యడంలో

ఏ రాక్షసుడికి పాత్ర లేదంటాడు. కావాలంటే చూడు

ఏ రాక్షసుడికీ చేతిలో పువ్వుండదు.

ఉండేదల్లా వాడి అధీనంలో ధనబలం.

అని చెప్పి ఎండలో కాళ్ళుజాపుకుని వెల్లకిలా

దొర్లుతూ పకపకా నవ్వడం ప్రారంభించేడు

కాళ్ళు గాలిలో కొట్టుకుంటూ ఒకటే పిచ్చి నవ్వు

సూర్యుడు వాడి కాళ్ళకింద వెలుగుతునాడంటూ.

పైగా అంటాడూ తనింకా గుంటడినేననీ

తను ఏ జోకరుగాడికిందాపనిచెయ్యననీ.

లేచి నవ్వుతూ ఒక తూనీగ వెంటపడ్డాడు;

కేవలం ఆ ఆనందానికే గెంతులెయ్యసాగేడు.

.

జేమ్స్ స్టీఫెన్స్

(9 February 1882 – 26 December 1950)

ఐరిష్ కవి

చిన్నపిల్లలు వాళ్లలో వాళ్ళు మాటాడుకునేటప్పుడు చేసుకునే అభూత కల్పనలూ, అసూయలూ, ఏ చింతా లేకుండా ఆ క్షణంలో జీవించగల వాళ్ళ అమాయకత్వమూ … కవి ఈ కవితలో చాలా బాగా చూపించేడు.  

James Stephens
James Stephens
Image Courtesy: http://en.wikipedia.org/wiki/James_Stephens_(author)


.
 In the Poppy Field

.

Mad Patsy said, he said to me,
 That every morning he could see
 An angel walking on the sky;
 Across the sunny skies of morn
 He threw great handfuls far and nigh
 Of poppy seed among the corn;
 And then, he said, the angels run
 To see the poppies in the sun.

 A poppy is a devil weed,
 I said to him - he disagreed;
 He said the devil had no hand
 In spreading flowers tall and fair
 Through corn and rye and meadow land,
 by garth and barrow everywhere:
 The devil has not any flower,
 But only money in his power.

 And then he stretched out in the sun
 And rolled upon his back for fun:
 He kicked his legs and roared for joy
 Because the sun was shining down:
 He said he was a little boy
 And would not work for any clown:
 He ran and laughed behind a bee,
 And danced for very ecstasy.

 James Stephens
(9 February 1882 – 26 December 1950) 
Irish Poet and Novelist
%d bloggers like this: