పగటిపూట విమానప్రయాణం… జాక్ డేవిస్, ఆస్ట్రేలియను కవి
జెట్ లో కూచుని కళ్ళుమూసుకున్నాను.
నాతో పాటే ఒక వినీలాకాశపు తునకనీ,
ఒక చారెడు మైలుతుత్తంవంటి సముద్రపు చెలకనీ
తీసుకెళ్ళనిస్తుందేమోనని ఎయిర్ హోస్టెస్ ని అడిగేను
బాగా దిగువన నా దేశం తళతళలాడుతోంది
బక్క చిక్కుతున్న నదుల్తో, లేతనీలి సరస్సులతోనూ;
నేను కలగంటూ కోరున్నది నిద్రతోవాలిన తలక్రిందకీ
తలగడలా మడుచుకుందికీ, పైన కప్పుకుందికీ
ఉత్త ఎర్రటి ఎడారి చౌకాన్ని.
.
జాక్ డేవిస్,
ఆస్ట్రేలియను కవి
11 మార్చి 1917- 17 మార్చి 2000.
జాక్ డేవిస్, 20వ శతాబ్దపు ప్రముఖ ఆస్ట్రేలియను కవి, నాటక కర్త. అతను ఆదిమ ఆస్ట్రేలియన్ నూంగర్ జాతికి చెందిన వాడు. అతని అనుభవాలనే అతను కవిత్వంలో బలంగా చెప్పాడు.అతని నాటకాలు ఆస్ట్రేలియన్ స్కూళ్లలో పాఠ్యాంశాలుగా ఉన్నాయి. 1976లో Order of British Empire (MBE)తోనూ, 1985లో Order of Australia (AM) తోనూ సత్కరించబడ్డాడు.
ఈ కవితలో దేశాన్ని (స్వంత ఊరిని) వదిలి వెళుతున్న ప్రతిసారీ మళ్ళీ ఇక్కడకి రాగలమో లేదోనని మనందరికీ కలిగే అనుభూతిని ఇక్కడ చెప్పాడు. మనతో తీసుకెళ్ళేవి, తీసుకెళ్ళగలిగేవి, ఆ జ్ఞాపకాల తలగడలనీ, దుప్పట్లనే. ఆరుద్ర “నీటి గడియారం” అన్న కవితలో, జ్ఞాపకాల సందుగుల్నీ, అనుభవాల పరుపుల్నీ రోడ్డుమీద పారేకండి బాబ్బాబు, వచ్చేజన్మలో చూసుకుందాం … ” అని అంటాడు. ఎవరికైనా మట్టితో విడదీయరాని సంబంధం ఉంటుంది… చివరకి అక్కడికే చేరాలి కదా!
.
Day Flight
.
I closed my eyes as I sat in the jet
And asked the hostess if she would let
Me take on board a patch of sky
And a dash of the blue-green sea.
Far down below my country gleamed
In thin dry rivers and blue-white lakes
And most I longed for, there as I dreamed,
A square of the desert, stark and red,
To mould a pillow for a sleepy head
And a cloak to cover me.
Jack Davis
(11 March 1917 – 17 March 2000)
Australian Poet and Playwright
దీన్ని మెచ్చుకోండి:
మెచ్చుకోండి వస్తోంది…
స్పందించండి