తీరాల్నీ, వొడ్లనీ, అఖాతాల్నీ
విడిచిపెట్టే వందల తెరచాపల్లో
అలలతాకిడికీ, తుఫాన్లకీ
బలైపోయేవి ఎన్ని ఉండవు?
సంద్రాలమీదా నేలమీదా
బారులుతీర్చి ఎగిరే పక్షుల్లో
కెరటాలకిచిక్కి సముద్రంలో
మునకలేసేవి ఎన్ని ఉండవు?
నువ్వు నీ అదృష్టాన్ని, ఆదర్శాలనీ,
నువ్వు నీ సర్వస్వాన్నీ వెంటాడుతూపోతే
నీ వెనకే పరిగెత్తుకొస్తాయి
సుడిగాలులూ, సుడిగుండాలూ.
నీ ప్రార్థనలనుండి వెలువడే
ఆలోచనల గూఢార్థం ఎవరికీ తెలీదు
ఈ గాలులూ, ఈ సుడిగుండాలూ
పరిగెడుతూ, ప్రవహిస్తూ, గుసగుసలాడతాయి.
.
మిహైల్ ఎమినెస్క్యూ
(January 15, 1850 – June 15, 1889)
రుమేనియను కవి.
.

Romanian Poet
స్పందించండి