స్వాతంత్య్రాన్నయినా యినా ఇవ్వు, లేకుంటే మృత్యువైనా !… పాట్రిక్ హెన్రీ, అమెరికను

(అమెరికా స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా  ఆ దేశ స్వాతంత్య్రానికీ, వ్యక్తి స్వేచ్ఛకీ, సర్వమానవ సౌభ్రాతృత్వానికీ అసలు అమెరికను తత్త్వానికి పునాది వేసిన  జార్జి వాషంగ్టన్, అబ్రహాం లింకన్ వంటి మహానుభావుల్ని వారి మానవీయ ఆదర్శాలనీ స్మరించుకుంటూ, వారి ఆదర్శాలని ఆచరణలో పెట్టడానికి చిత్తశుద్ధిగల రాజకీయ నాయకులు మళ్ళీ అమెరికాలో అవతరించాలని మనః స్ఫూర్తిగా కోరుకుంటూ అమెరికను పౌరులందరికీ శుభాకాంక్షలు.

అధికారాన్ని తమ స్వంతలాభానికీ, తమపిల్లలకి దోచిపెట్టడానికి కాకుండా, తాము పదవీ ప్రమాణం చేసినప్పుడు పలికిన మాటలకి కట్టుబడుతూ దేశప్రజలకీ, దేశ రాజ్యాంగ స్ఫూర్తికీ పునరంకితమవగల రాజకీయ నాయకులు మనదేశంలో మళ్ళీ పుట్టాలంటే, ఈ నాటి యువతరానికి ఇటువంటి ఉపన్యాసాలు చదవడం మంచిదన్న ఆలోచనతో ఇది సవినయంగా సమర్పిస్తున్నాను.  ఏ ఒక్కరు ఉజ్జేతులవగలినా నా ప్రయత్నం సార్థకమైనట్టు భావిస్తాను.)

American Flag
American Flag (Photo credit: Cristian_RH7)

ఇంతసేపూ ఈ సభనుద్దేశించి ప్రసంగించిన విశిష్ట వ్యక్తుల దేశభక్తినీ, శక్తిసామర్థ్యాలనీ నాకంటే ఉన్నతంగా ఎవరూ సంభావించరు. కాని విభిన్న కారణాలవల్ల భిన్న వ్యక్తులు ఒకే విషయాన్ని వేర్వేరు కోణంలో చూడడం సర్వ సాధారణమైన విషయం; అందుచేత, వాళ్ల అభిప్రాయాలకు వ్యతిరేకమైన అభిప్రాయాలు కలిగి ఉన్న నేను నిర్భయంగా, ఏ అరమరికలు లేకుండా చెప్పడాన్ని వాళ్ళని  అవమానిస్తున్నట్టుగా భావించరని విశ్వసిస్తున్నాను. అయినా, ఇది మర్యాదలు పాటించడానికి సమయం కాదు. ఈ సభముందున్న సమస్య ఈ దేశానికి సంబంధించి అతి కీలకమైనది. నా వరకు, అది స్వాతంత్ర్యమో, దాస్యమో తేల్చుకోవలసినంత సమస్యకి ఏమాత్రం తీసిపోదని భావిస్తున్నాను; కనుక సమస్యకున్న తీవ్రత స్థాయిని బట్టి చర్చకూడ స్వేచ్ఛగా జరగాలి. అలాచెయ్యడంవల్ల మాత్రమే మనం సత్యానికి చేరువగా వచ్చి ఈ దేశానికీ, భగవంతుడికీ మనకున్న గురుతరమైన బాధ్యతని నిర్వర్తించగలమని ఆశిస్తున్నాను. ఇటువంటి సంక్లిష్ట సమయంలో మీ గౌరవానికి భంగం కలిగిస్తున్నానేమోనన్న భయంతో నా అభిప్రాయాలని నాలోనే అణచుకుంటే, నేను దేశద్రోహం చేసిన అపరాథంతోపాటు, ఈ భూమ్మీద అన్ని సార్వభౌమత్వాలకంటే మిన్నగా ఆ పైనున్న పరంధామునికి విశ్వాసఘాతం చేసినవాడినవుతాను.

అధ్యక్ష మహాశయా! మనిషి సహజంగా ఆశాలోలుడు. ఎదురుగా కనిపిస్తున్న బాధాకరమైన సత్యాన్ని విస్మరించి, మనల్ని మృగాలుగా మార్చే ఇంపైన అబద్ధాలకి చెవులొగ్గివినడం అలవాటే. కానీ, మహత్తరమైన స్వాతంత్ర్య సముపార్జనకి తీవ్రంగా కృషిచేస్తున్న మేధావులకి ఇది తగినపనేనా? వాళ్ళ లౌకిక విముక్తికి కళ్ళుండి చూడలేని వాళ్ళూ, చెవులుండి వినలేని సామాన్య జనాల్లా మనం కూడా ప్రవర్తించడానికే నిర్ణయించుకుందామా? నాకు సంబంధించినంతవరకు, మనసుకి ఎంత క్షోభకలిగినా, అసలు సత్యం ఏమిటో పూర్తిగా తెలుసుకోదలుచుకున్నాను; రాబోయే అనర్థం ఎంతటిదైనా తెలుసుకుని ఆ మూల్యాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను.

నా కాళ్ళు ముందుకి కదిలేది ఒక్క దీపపు వెలుగులోనే… అదే అనుభవమనే దీపం. గత అనుభవ ప్రమాణంతో తప్ప భవిషత్తుని అంచనావెయ్యగల మరోమార్గం నాకు తెలీదు. గత అనుభవాన్ని బట్టి చూస్తే, ఈ సభనీ, తమనీ సంతృప్తిపరచుకుందికి, గౌరవనీయ సభ్యులకి గత పది సంవత్సరాలుగా బ్రిటిషు ప్రభుత్వపు ప్రవర్తనలో ఏమి కనిపించిందో తెలుసుకోగోరుతున్నాను. మనం తాజాగా సమర్పించిన వినతిపత్రాన్ని స్వీకరిస్తునపుడు వాళ్ల పెదాలపై మొలిచిన కపట దరహాసమా? ఆర్యా! దాన్ని నమ్మకండి! అది మీ కాళ్లకి సంకెలగా పరిణమిస్తుంది. ఒక ముద్దుకు వంచింపబడే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఇంత ఔదార్యంతో స్వీకరించిన మన వినతిపత్రానికీ, ఈ దేశాన్ని కమ్ముకుంటున్న సముద్రజలాలపై నెలకొంటున్న యుద్ధ వాతావరణానికీ ఎలా పొత్తుకుదురుతుందో మిమ్మల్నిమీరొక్కసారి ప్రశ్నించుకొండి. యుద్ధ నౌకలూ, సైన్యమూ ప్రేమకీ, రాజీప్రయత్నాలకీ అవసరమా? బలప్రయోగంద్వారా మాత్రమే మన విశ్వాసాన్ని తిరిగిపొందడానికి, మనం రాజీ ప్రయత్నాలకి అంత విముఖత చూపించేమా? ఆర్యా, మనల్ని మనం మోసపుచ్చుకోవద్దు. ఇవి యుద్ధానికీ, అణచివేతకీ ఉపయోగించే సాధనసంపత్తులు; మహరాజులు అవలంబించే చివరి ఉపకరణాలు. గౌరవనీయులైన సభ్యులని నేనడిగేది ఒకటే: మనల్ని అణగదొక్కడానికి కాకపోతే, ఈ యుద్ధవ్యూహాల ఆంతర్యం ఏమిటి? గౌరవ సభ్యులు వేరొక కారణాన్ని ఊహించగలరా? ఈ సేనల్నీ, యుద్ధనౌకల్నీ ఇక్కడ మోహరించడానికి, ఈ ప్రాంతంలో బ్రిటనుకి శత్రువులెవ్వరైనా ఉన్నారా? ఆర్యా, లేరు గాక లేరు. అవి మనమీద ఉపయోగించడానికే; వాటి లక్ష్యం వేరెవ్వరూ కాదు. ఇంతకాలమూ బ్రిటిషుప్రభుత్వం మనకి తగిలించిన సంకెళ్ళను మరింతగా బిగించి పటిష్టం చెయ్యడానికి అవి పంపబడ్డాయి. వాటిని ఎదిరించడానికి మనదగ్గర ఏమున్నాయి?  మనం వాళ్లతో వాదిద్దామా? మనం గత పదిసంవత్సరాలుగా వాళ్లతో చేస్తున్న పని అదే! మనం ఈ విషయం మీద వాళ్ళకి కొత్తగా చెప్పడానికి ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఈ విషయాన్ని ఎన్ని కోణాల్లో చెప్పడానికి సాధ్యమవుతుందో అన్ని రకాలుగానూ విశదపరచడం జరిగింది; కానీ అది నిష్ఫలమైపోయింది. మనం ఇంక బ్రతిమాలటలకీ, దీనంగా అర్థించడానికీ దిగిపోవాలా? ఇంతవరకు ప్రయత్నించని ఏ కొత్త షరతులు మనం ప్రతిపాదించగలం? మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, మనల్ని మనం మోసగించుకోవద్దు. ఏ తుఫానైతే ఇప్పుడు కమ్ముకొస్తోందో దాన్ని నివారించడానికి ఎన్ని చర్యలు చేపట్టాలో అన్ని చర్యలూ చేపట్టాము. మనం విజ్ఞాపన చేశాం; మన ఆక్షేపణలు తెలియజేశాం; అభ్యర్థించేం; సింహాసనం ముందు మోకరిల్లి, ఈ ప్రభుత్వమూ, ఈ పార్లమెంటూ అనుసరిస్తున్న నియంతృత్వ విధానాలను అరికట్టడానికి జోక్యం చేసుకోవలసిందిగా వేడుకున్నాం. మన వినతిపత్రాలు తిరస్కరించబడ్డాయి; మన ఆక్షేపణలు మరింత అవమానాన్నీ, మరింత హింసనీ మోసుకొచ్చేయి; మన అభ్యర్థనలు నిరాదరించబడ్డాయి; తిరస్కృతులమై సింహాసనం పాదాలదగ్గరనుండి గెంటివేయబడి అవమానంతో తిరిగొచ్చేం. ఇన్ని జరిగినతర్వాతకూడా శాంతీ, సామరస్యం గురించి వ్యర్థమైన ఆశలు పెట్టుకోగలమా? ఆశావహంగా ఉండాడానికి ఇప్పుడు ఎక్కడా తగిన కారణం కనిపించదు. మనం స్వతంత్రులుగా ఉండాలనుకుంటే… మనం ఇన్నాళ్ళూ ఏ అమూల్యమైన హక్కులకోసం పోరాడుతున్నామో వాటిని నిలబెట్టుకోవాలంటే; మనం ఆశించిన ఉదాత్తమైన అంతిమ లక్ష్యం నెరవేరేదాకా ఎట్టిపరిస్థితులలోనూ విడనాడకూడదని మనకి మనం ప్రమాణం చేసుకున్న ప్రతిఘటనని అర్థాంతరంగా పిరికిగా విడిచిపెట్టకూడదనుకుంటే… మన తక్షణ కర్తవ్యం ఇప్పుడు పోరాడడమే! మరొక్కసారి చెబుతున్నాను, మనం యుద్ధం చెయ్యవలసిందే! మనకి మిగిలిందల్లా ఆయుధాలు చేపట్టమని ప్రజలనీ, ఆశీస్సులిమ్మని భగవంతునీ ప్రార్థించడం ఒక్కటే.

ఆర్యా! వాళ్లనొచ్చు, మనం బలహీనులమని. బలీయమైన శత్రువుతో తలపడలేమని. అయితే, మనం ఎప్పుడు బలంగా ఉండగలం?  వచ్చే వారం? వచ్చే సంవత్సరం? మనల్ని పూర్తిగా నిరాయుధుల్ని చేసి ప్రతి ఇంట్లోనూ బ్రిటిషు సైనికుడు కాపలా ఉన్నప్పుడా? నిర్నిర్ణయత్వం, నిష్క్రియాపరత్వంద్వారా మనం బలోపేతమవగలమా? నేలమీద బార్లా కాళ్ళుజాపుకుని పడుక్కుని కనిపించని ఆశకోసం ఆకాశంవంక చూస్తున్నప్పుడు మనశత్రువు మన కాళ్ళూ చేతులూ బంధించినపుడు ఎదిరించడానికి తగిన శక్తిని సమకూర్చుకోగలమా? ఆర్యా, భగవంతుడు మన అధీనంలో ఉంచిన సాధనాలని సద్వినియోగం చేసుకోగలిగితే మనం ఎన్నటికీ బలహీనులం కాదు. స్వాతంత్ర్యమనే పవిత్ర లక్ష్యంకోసం సాయుధులైన లక్షలమంది ప్రజలున్న ఈ దేశంలో, శత్రువు మనమీదకి ఎంతమంది సైనికులని పంపినా, మనలని నిర్జించలేడు. అదిగాక, మనం యుద్ధాన్ని ఒంటరిగా చెయ్యబోవడం లేదు. దేశాల భవిష్యత్తులని నిర్ణయించగల న్యాయవర్తియైన భగవంతుడు పైన ఉన్నాడు, అతనే మనకి యుద్ధంలో సహాయం చెయ్యడానికి స్నేహితులని సమకూరుస్తాడు. ఆమాటకి వస్తే, ఆర్యా, యుద్ధాల్లో గెలుపు ఎప్పుడూ బలవంతుడిదే కాదు; ఎవరైతే సాహసవంతులో, జాగరూకులో, చురుకుగా ఉంటారో వాళ్లది.  అదిగాక, అధ్యక్షా మనకిప్పుడు వేరే ప్రత్యామ్నాయం లేదు. మనం అంత పిరికివాళ్లమైతే తప్ప, యుద్ధం నుండి విరమించుకుందికి ఇపుడు తరుణం మించిపోయింది. తలవంచి బానిసత్వం చెయ్యడం తప్ప వేరే గత్యంతరం లేదు. మన సంకెళ్లు అప్పుడే తయారయ్యాయి. బోస్టను మైదానాల్లో వాటి గలగలలు అప్పుడే వినిపిస్తున్నై. యుద్ధం ఇప్పుడు అనివార్యం! దాన్ని రానీండి. మరొక్క సారి చెబుతున్నా, అధ్యక్షా, యుద్ధం వస్తే రానీండి.

ఈ విషయాన్ని ఇంకా సాగదియ్యడం అనవసరం. శాంతీ శాంతీ అని పెద్దమనుషులు అనవచ్చు… కాని  శాంతికి ఆస్కారం లేదు.  నిజానికి యుద్ధం అప్పుడే ఆరంభం అయిపోయింది! ఉత్తరం నుండి వీయబోయే గాలి తరగ మన చెవులకి ఆయుధాల సంఘర్షించుకుంటున్న శబ్దాల్ని మోసుకొస్తుంది.  మన సోదరులు అప్పుడే యుద్ధరంగంలో ఉన్నారు. మనం ఇక్కడ ఎందుకు పనిలేక నిల్చున్నట్టు?  ఈ గౌరవనీయ సభ్యులు ఆశించేది ఏమిటి? వాళ్ళకి ఏమిటి కావాలి? శృంఖలాలతోనూ దాస్యంతోనూ కొనుక్కుందికి ప్రాణం అంత విలువైనదీ, శాంతి అంత తియ్యనిదీనా? సర్వశక్తిమయుడవైన ప్రభూ! అమంగళం ప్రతిహతమగుగాక! మిగతావాళ్ళు ఏ మార్గం అనుసరిస్తారో అనుసరించనీ; నాకు మాత్రం అయితే  స్వాతంత్ర్యాన్నయినా ఇవ్వు, లేకుంటే మృత్యువైనా !

.

పాట్రిక్ హెన్రీ

అమెరికను ప్రతినిధి

(Notes:

లెఫ్టినెంట్ గవర్నర్ డన్ మోర్, అతని రాయల్ మెరైన్స్ ప్రమేయాన్ని తప్పించుకుందికి, మార్చి 20, 1775 న, విలియమ్స్  బర్గ్ లోని కేపిటోల్ లో కాకుండా, రెండవ వర్జీనియా సమావేశం ఇప్పుడు సెయింట్ జోన్స్ చర్చిగా పిలవబడుతున్న నాటి రిచ్ మండ్ చర్చిలో జరిగింది. యుద్ధానికి కావలసిన సైన్యాన్ని సమకూర్చుకుందికీ, వర్జీనియాని రక్షణకవచంగా తీర్చిదిద్దడానికీ పాట్రిక్ హెన్రీ అనే ఒక ప్రతినిధి ప్రతిపాదనలు చేశాడు. కానీ హెన్రీకి వ్యతిరేకులు జార్జి III చక్రవర్తికి కాంగ్రెసు  పంపిన వినతిపత్రానికి సమాధానం వచ్చేదాకా జాగరూకతతోనూ, సహనంతోనూ ఉండవలసిందిగా అభ్యర్థించేరు.

23వ తేదీన, వర్జీనియాలో ప్రతి గ్రామంలోనూ సాయుధులైన సైనికులని గాని, ఆశ్వికదళాన్ని గాని తనే స్వయంగా సంఘటితపరచే ప్రతిపాదనతో ముందుకొచ్చాడు. సంప్రదాయం ప్రకారం ఆ సమావేశానికి అధ్యక్షుడైన  విలియమ్స్  బర్గ్ కి చెందిన పేటన్ రుడోల్ఫ్ ని సంబోధిస్తూ ప్రసంగించేడు.  అతని మాటల్ని ఎవరూ వ్రాతప్రతిగా తిరగరాయకపోయినా, ఆరోజు అతన్ని విన్నవాళ్ళెవ్వరూ అతని వాగ్ధాటినిగాని, ముఖ్యంగా అతని చివరి వాక్యాలు “అయితే నాకు స్వాతంత్ర్యం ఇవ్వు, లేదా మృత్యువైనా” అన్న మాటలుగాని  మరిచిపోలేదు.)

Patrick Henry, portrait by George Bagby Matthe...
Patrick Henry, portrait by George Bagby Matthews c. 1891 after an original by Thomas Sully (Photo credit: Wikipedia)

Give Me Liberty Or Give Me Death

Patrick Henry

March 23, 1775.

No man thinks more highly than I do of the patriotism, as well as abilities,  of the very worthy gentlemen who have just addressed the House.  But different men often see the same subject in different lights; and, therefore, I hope it  will not be thought disrespectful to those gentlemen if, entertaining as I do  opinions of a character very opposite to theirs, I shall speak forth my  sentiments freely and without reserve.  This is no time for ceremony. The question before the House is one of awful moment to this country. For my own part, I consider it as nothing less than a question of freedom or slavery; and in proportion to the magnitude of the subject ought to be the freedom of the debate.  It is only in this way that we can hope to arrive at truth, and fulfill the great responsibility which we hold to God and our country.  Should I keep back my opinions at such a time, through fear of giving offense, I should consider myself as guilty of treason towards my country, and of an act of disloyalty toward the Majesty of Heaven, which I revere above all earthly kings.

Mr. President, it is natural to man to indulge in the illusions of hope. We are apt to shut our eyes against a painful truth, and listen to the song of that siren till she transforms us into beasts.  Is this the part of wise men, engaged in a great and arduous struggle for liberty? Are we disposed to be of the number of those who, having eyes, see not, and, having ears, hear not, the things which so nearly concern their temporal salvation?  For my part, whatever anguish of spirit it may cost, I am willing to know the whole truth; to know the worst, and to provide for it.

I have but one lamp by which my feet are guided, and that is the lamp of  experience.  I know of no way of judging of the future but by the past. And judging by the past, I wish to know what there has been in the conduct of the British ministry for the last ten years to justify those hopes with which  gentlemen have been pleased to solace themselves and the House. Is it that insidious smile with which our petition has been lately received? Trust it not, sir; it will prove a snare to your feet.  Suffer not yourselves to be betrayed with a kiss.  Ask yourselves how this gracious reception of our  petition comports with those warlike preparations which cover our waters and  darken our land.  Are fleets and armies necessary to a work of love and  reconciliation?  Have we shown ourselves so unwilling to be reconciled that  force must be called in to win back our love?  Let us not deceive ourselves,  sir.  These are the implements of war and subjugation; the last arguments to  which kings resort.  I ask gentlemen, sir, what means this martial array, if  its purpose be not to force us to submission?  Can gentlemen assign any other  possible motive for it?  Has Great Britain any enemy, in this quarter of the world, to call for all this accumulation of navies and armies?  No, sir, she has none.  They are meant for us:  they can be meant for no other. They are sent over to bind and rivet upon us those chains which the British ministry have been so long forging.  And what have we to oppose to them? Shall we try argument?  Sir, we have been trying that for the last ten years. Have we anything new to offer upon the subject?  Nothing.  We have held the subject up in every light of which it is capable; but it has been all in vain. Shall we resort to entreaty and humble supplication?  What terms shall we find which have not been already exhausted?  Let us not, I beseech you, sir, deceive ourselves.  Sir, we have done everything that could be done to avert the storm which is now coming on.  We have petitioned; we have remonstrated; we have supplicated; we have prostrated ourselves before the throne, and have implored its interposition to arrest the tyrannical hands of the ministry and Parliament.  Our petitions have been slighted; our remonstrances have produced additional violence and insult; our supplications have been disregarded; and we have been spurned, with contempt, from the foot of the throne! In vain, after these things, may we indulge the fond hope of peace and reconciliation.  There is no longer any room for hope.  If we wish to be free—if we mean to preserve inviolate those inestimable privileges for which  we have been so long contending—if we mean not basely to abandon the noble  struggle in which we have been so long engaged, and which we have pledged  ourselves never to abandon until the glorious object of our contest shall be obtained—we must fight!  I repeat it, sir, we must fight! An appeal to arms  and to the God of hosts is all that is left us!

They tell us, sir, that we are weak; unable to cope with so formidable an adversary.  But when shall we be stronger?  Will it be the next week, or the next year?  Will it be when we are totally disarmed, and when a British guard shall be stationed in every house?  Shall we gather strength by irresolution and inaction?  Shall we acquire the means of effectual resistance by lying supinely on our backs and hugging the delusive phantom of hope, until our enemies shall have bound us hand and foot?  Sir, we are not weak if we make a proper use of those means which the God of nature hath placed in our power.   The millions of people, armed in the holy cause of liberty, and in such a  country as that which we possess, are invincible by any force which our enemy  can send against us.  Besides, sir, we shall not fight our battles alone.   There is a just God who presides over the destinies of nations, and who will  raise up friends to fight our battles for us.  The battle, sir, is not to the strong alone; it is to the vigilant, the active, the brave.  Besides, sir, we have no election.  If we were base enough to desire it, it is now too late to retire from the contest.  There is no retreat but in submission and slavery! Our chains are forged!  Their clanking may be heard on the plains of Boston!   The war is inevitable—and let it come!  I repeat it, sir, let it come.

It is in vain, sir, to extenuate the matter.  Gentlemen may cry, Peace, Peace—but there is no peace.  The war is actually begun!  The next gale that sweeps from the north will bring to our ears the clash of resounding arms! Our brethren are already in the field!  Why stand we here idle? What is it that gentlemen wish?  What would they have?  Is life so dear, or peace so sweet, as to be purchased at the price of chains and slavery? Forbid it, Almighty God!  I know not what course others may take; but as for me, give me liberty or give me death!

Notes:

To avoid interference from Lieutenant-Governor Dunmore and his  Royal Marines, the Second Virginia Convention met March 20, 1775 inland  at Richmond–in what is now called St. John’s Church–instead of the Capitol  in Williamsburg. Delegate Patrick Henry presented resolutions to raise a  militia, and to put Virginia in a posture of defense. Henry’s opponents urged  caution and patience until the crown replied to Congress’ latest petition for  reconciliation.

On the 23rd, Henry presented a proposal to organize a volunteer company of cavalry or infantry in every Virginia county. By custom, Henry addressed himself to the Convention’s president, Peyton Randolph of Williamsburg. Henry’s words were not transcribed, but no one who heard them forgot their eloquence, or Henry’s closing words: “Give me liberty, or give me death!”

(Article Courtesy: http://www.history.org/almanack/life/politics/giveme.cfm)

“స్వాతంత్య్రాన్నయినా యినా ఇవ్వు, లేకుంటే మృత్యువైనా !… పాట్రిక్ హెన్రీ, అమెరికను” కి 3 స్పందనలు

 1. ఆలోచనాస్ఫోరకంగా ఉంది!

  మెచ్చుకోండి

  1. Yes, Suryaprakas garu. That was a generation of people who really defined the independent spirit and upheld the personal right of individual to pursue whatever he likes in that new world. People we see there now are but a pale shadow of them …subverting that great human spirit in the name of every excuse…just as in India.
   with regards

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: