సిపాయి బ్రౌన్ స్వర్గంలోకెలా వచ్చేడు? … గిల్బర్ట్ ప్రాంకో, బ్రిటిషు కవి

English: British novelist Gilbert Frankau (188...
English: British novelist Gilbert Frankau (1884-1952) (Photo credit: Wikipedia)

(గమనిక: నార్స్ జానపదగాధ ప్రకారం యుద్ధంలో వీరమరణం పొందిన వారు స్వర్గంలో  ‘vAlhAlA’ (War -Hall) అనే చోటుకి స్వర్గ సుఖాలనుభవించడానికి చేరుకుంటారు.)

.

వల్హాలాలో దిగువ హాల్లోకి, అంతగా పేరులేని యోధుల మధ్యకి

తన విధినిర్వహించే “సరిహద్దు-ఠాణా” నుండి విముక్తుడై సిపాయి బ్రౌన్

తన ఖాకీ చొక్కాకి ఒక్క చింకి లేకుండా, ముఖం మీద రక్తం మరక లేకుండా

భుజాలమీద నుండి సంచీని ప్రక్కకి విసిరి, ఖాళీ జాగాచూసుకు కూచున్నాడు.

వల్హాలాలోని వీర సైనికులు భోజనాల బల్లనుండి ఎగాదిగా చూసేరు:

వేలి గుర్తులైనాలేని తుపాకీ చెవుల్నీ, మాంసం అంటుకోని అతని కత్తి మొననీ.

కందకాల్లోమరణించిన అజ్ఞాత వీరులూ, ఎన్నడూ కిరీటం తాల్చని రాజులూ

సిపాయి బ్రౌన్ ని అసలు అతను లోనకెలా వచ్చేడో చెప్పమని నిలదీశారు.

“ఎవరది, గాయమైనా లేకుండా విందులో జొరబడింది?” అడిగేడు ఒక కుంటి కార్పొరల్

రింగులు తిరుగుతున్న అంతులేని పొగలోంచి గాట్లు పడ్డ తలలు అవునని వంతపాడేయి.

“ఎవరది మూతపడని ఈ పానశాలలో సురకోసమూ, సుగంధ పుష్పాలకోసమూ

బారకాసులోలా మెరిసే బాయ్ నెట్ తో, ఒక్కగుండూవాడని తుపాకితో వచ్చింది?”

సిపాయి బ్రౌన్ తనచుట్టూ ఉన్న పేరులేని సైనిక సమూహాన్ని పరికించేడు

ఫిరంగులూ-గుళ్ళూ చేసిన గాయాలూ, బాంబులకీ-మందుపాత్రలకీ కాలిన శరీరాలూ,

గుండెలమీద తొలి యుద్ధ పతకాలు…కెంపు వర్ణంలో గడ్డకట్టిన నెత్తురు

ఫ్లాండర్స్ లోని బురద గట్టిగా అట్టకట్టుకున్న చీలమండ బూట్లూ, పట్టీలూ.

అక్కడి రైఫిల్ రాక్ నిండా వేలకొద్దీ లీ-ఎన్ ఫీల్డ్ తుపాకులు; ప్రతీదీ

బ్లేడునుండి బట్ దాకా గోధుమ రంగులో, మజిల్ దగ్గర చీకటి పొడిలా నల్లగా;

సిపాయి బ్రౌన్ ఒక్కమాట సమాధానం చెప్పలేదు గాని, మనసులోపల అనుకున్నాడు:

ఈ క్రింది హాల్లో బీరు తాగడానికి తనకి కూడా పరిపూర్ణమైన హక్కు ఉందని.

ఆ కేంటీన్లో సేవలకీ, భోజనాల బల్ల దగ్గర కూర్చోడానికీ తనకి హక్కుంది

ఇక్కడివాళ్ళు తమశత్రువుల్ని చంపినట్టు తనకత్తితో ఎవరినీ చంపకపోయినా.

“ఈ అపరిచిత వ్యక్తి, సిపాయి గురించి , కేంటీన్ లోని సైనికుల్లారా, ఎవరు చెప్తారు?

ఏ అంగవైకల్యమూ లేక, నలగని యూనిఫాంతో ఇతన్ని లోపలికి ఎవరు వదిలేరు?”

గాట్లు పడ్డ తలలు బీరు తాగుతూ అతన్ని చూసేయి, గాయపడ్డ పెదాలు పొగ పీలుస్తున్నాయి

భోజనాల బల్లదగ్గర అతని ప్లెటూన్ వాళ్ళే ముగ్గురున్నారు, కానీ ఎవరూ మాటాడలేదు;

అతని నాలుక పిడచకట్టుకుపోతోంది బీరు కప్పుకోసమూ, ఒక సిగరెట్టు దమ్ముకోసమూ

కాని అతనికి తెలుసు తనగురించి తను చెప్పుకోలేడు, డంబాలుపలకని మృతవీరులతో.

తుపాకి మట్టం గేటుమీద గట్టిగా మోదినట్టయింది.తడబడుతూ ఒక వ్యక్తి లోనకొచ్చేడు.

నుదిటినుండి దవడవరకూ అతని తల రెండుగాచీలి ఎర్రని గాయం కనిపిస్తోంది.

అతని బాయ్ నెట్ బ్లేడు రక్తంతో తడిసి, గడ్డకడుతున్న రక్తం ఇంకా పచ్చిగానే ఉంది,

తన సైనికుల్ని చంపినవాళ్ళపై  అరుస్తూ, “ఎవడా ఆ సిపాయిని లోనకి వదిలింది?… నేను”

నేను చంపిన నలుగురు సాక్షిగా, నన్ను చంపిన ఫిరంగి సాక్షిగా,ఇప్పటికే

నా ఆడుగులు ఆలస్యం కాకుంటే, సిపాయి బ్రౌన్ గురించి ఒక సాటి సైనికుడుగా

చెప్పవలసింది చెబుతాను. ఆ వల్హాలాలోని దిగువ హాల్లోని మృతులు,

పేరు లేని వీరులు, వాళ్ళ కప్పులు క్రిందపెట్టి చెవులు రిక్కించి విన సాగేరు.

నామిత్రుడు సెంట్రీ డ్యూటేలో ఉన్నాడు; సేనాధిపతి అటువైపునుండి వెళుతూ,”శత్రువు

విషవాయువు ప్రయోగిస్తే ఏం చేస్తావు?” అని అడిగేడు. జో,”నేను గంట కొడతా”అన్నాడు.

“ఇంకేం చేస్తావు?” “గుళ్ల వర్షం కురిపిస్తాను, సర్” అన్నాడు. దానికి సేనాధిపతి కోపంగా :

“భలేవాడివి, నువ్వు రక్తం ఓడే ఆ గంట వాయించేలోపు, నువ్వు బ్రతికి ఉండవు.”

“ఓయ్ కుర్రాడా! ఒక్క సారి జాగ్రత్తగా ఆలోచించు.” “గాస్ హెల్మెట్ ఉందికద సర్.”

“అదే, ఆ గేస్ హెల్మెట్ పెట్టుకో ముందు.” జో మౌనంగా అచేతనంగా నిలబడ్డాడు

ఎందుకు సేనాధిపతి తనని తిట్టేడా అని. గాయపడ్డ తలలు సిపాయివంక చూసేయి;

రక్తం మరక లేకపోయినా దవడలదాకా నీలంగా ఎందుకుమారిందో ఇప్పుడు అర్థమైనట్టుంది.

“అతనికి మళ్ళీ రాత్రి డ్యూటే వేశారు.” గాట్లు పడ్డ ముఖాలు చెవులు రిక్కించేయి

రక్తంకారుతున్న బాయ్ నెట్ తో వచ్చిన వ్యక్తి తను మెచ్చిన సైనికుడిని వెనకేసుకొస్తుంటే

“మీకు తెలుసు కదా, సరిహద్దు పహరా ఎలాఉంటుందో; ఆ వెలుగుతున్న కొవ్వొత్తులే

ఇసుకబస్తాలు వాసన పసిగడితే బుల్లెట్లు కురిపిస్తాయి, వెదురుతీవలు తలదువ్వుతాయి.

మీకు కనిపించిన ప్రతి కుచ్చూ నీడల్లో కదులుతూ పాకుతూ అది మనిషే అని మీరు

నిర్థారించుకునేదాకా మీ చెవులూ కళ్ళూ ఆశ్చర్యంతో ఎలా అప్రమత్తమౌతాయో తెలుసు.

ఈశాన్యపు గాలి విషవాయువు మోసుకొస్తుంటే రాత్రి ఎలా తొంగి వాసన చూడాలో తెలుసు

“మనల్ని పుట్టించి గిట్టించేవాడి సాక్షిగా,”వల్హాలా క్రిందిహాలు మార్మోగింది,”మాకు తెలుసు.”

“అకస్మాత్తుగా, ఆ చీకటిలోంచి, నరకం విరుచుకుపడ్డట్టు దాడిచేసేరువాళ్ళు

అరుపులూ, తుపాకుల మోతతో, మంటలు విరజిమ్ముతున్న మరతుపాకులతో.

జో వాళ్ల వ్యూహమేమిటో పసిగట్టడానికి స్థావరం ముందు అగడ్తదగ్గరకి వెళ్ళేడు

ఒక్క ఉదుటున వాళ్ల ఫిరంగులు పేలేయి; అతని ముక్కుపుటాలు బిగుసుకున్నాయి.

మతి తప్పించే విషవాయువు వాసన, ఒక్క గాలిరివటతో మృత్యువు వేటు వెయ్యగల వాసన.

మృత్యువు! అర్థం అయిపోయింది ఆ క్షణం వచ్చిందని. తూటాకేసుకి జేగంటకొట్టనారంభించేడు

అతని ముఖం మీద వాయువు గింగుర్లు తిరుగుతూ అతనిశ్వాశనాళికలోకి మెల్లగా పాకుతోంది.

కందకంలో ఉన్న మేము అతని గంటచప్పుడు విన్నాం, రెండుసార్లే మోగించగలిగేడతను.

ఒక్క సారి గాస్ బేగులు ముఖాలమీదకి లాక్కున్నాం, ఒక్క క్షణంలో అక్కడనుండి ఉడాయించేం.

సైన్యాధిపతి చెప్పినట్టు చేసుంటే, పొగలుమమ్మల్ని చుట్టుముట్టి తలరాత ఇంకోలా ఉండేది.

అతని తల దవడనుండి కణతలదాకా చీలిపోయింది ఎర్రని గాయంతో; అతని గొంతుమాత్రం

మోగుతున్న గంటలా స్పష్టంగా ఖంగు మంటూనే ఉంది. “నేనొక్కడినే తాగితే పాపినే,

వల్హాలాలోని దిగువ హాల్లో అయినా సరే! ఈ ఉచిత పానశాలలో, మాంసం అంటని కత్తితో

గుళ్ళు వాడని మేగజీన్ తో వచ్చిన నా తోటి సైనికుడికి ప్రవేశం ఉన్నట్టేనా?

గాట్లు పడ్డ ముఖాలు సిపాయివంక చూశాయి, అంతులేని పొగలోంచి

ఒక్క సారి వెయ్యి తుపాకులు మోగినట్టు వల్హాలా సమాధానంతో దద్దరిల్లింది.

ఒక్క సారి వెయ్యి ఫిరంగులు పేలినట్టు సారాకప్పులు బల్లమీద చప్పుడు చేశాయి.

“అతనికి ఈ వీరుల పానశాలలో అన్నీ ఉచితంగా దొరుకుతాయి, మాంసం అంటని కత్తీ

గుళ్ళు వాడని మేగజీన్ తో వచ్చిన మీ మిత్రుడికి. మాకు మృత్యువువేగం ఎరుకే

మనిషిని వెనకనుంది గొంతుపిసికిపట్టుకుని, ఊపిరినిలుపుకుందికి నీళ్ళిస్తుంది.

ముందువరసలో కందకంలో ఉన్నవాళ్ళ జీవితాలు గంట చప్పుడుమీద ఆధారపడ్డప్పుడు

హెల్మెట్మీది గుడ్డ కొన్ని సెకెండ్లు ఆలస్యం అయితే ఏమవుతుందో తెలుసు.

నువ్వు చంపిన నలుగురు సాక్షిగా, అతని గంట, ఆ విషవాయువు సాక్షిగా

ఈ ఉచిత పానశాలలో అతనికి కావలసినంత సారాయి, మితిలేని పొగాకూ దొరుకుతాయి.

వల్హాలాలోని దిగువ హాలులో, పేరులేని శూరుల తో పాటు

మార్నీ, ఐస్నీ, మోన్స్, వైపర్స్ నగరాల్లోని అజ్ఞాత వీరుల్లాగే

మనకోసం ప్రాణాలర్పించిన వాళ్లతో సిపాయి బ్రౌన్ కూర్చున్నాడు.

.

గిల్బర్ట్ ప్రాంకో

బ్రిటిషు కవి.

ఈ కవిత చదువుతుంటే, లే హంట్ రాసిన  అబూ బెన్ ఏడం గుర్తొస్తుంది ఎందుకో. వీరోచితంగా పోరాడిన వారికే కాదు, అలా పోరాడిన వాళ్ల ప్రాణాలు కాపాడుతూ మరణించినవారు కూడా వీరులే అన్న తాత్పర్యం అందిస్తోంది ఈ కవిత.

గమనిక:

ఈ కవితలో చాలా పదాలకి తెలుగు వాడలేదు, ఆ ఇంగ్లీషు మాటలే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉండడం చేత.

.

.

HOW RIFLEMAN BROWN CAME TO VALHALLA

.

To the lower Hall of Valhalla, to the heroes of no renown

Relieved from his spell at the listening post, came Rifleman Joseph Brown

With never a rent in his khaki nor smear of blood on his face

He flung his pack from his shoulders, and made for an empty space.

The killer-men of Valhalla looked up from the banquet board

At the untouched breech of his rifle, at the unfleshed point of his sword.

And the unsung dead of the trenches, the kings who have never a crown

Demanded his pass to Valhalla from Rifleman Joseph Brown.

“Who comes unhit, to the party?” a one legged Corporal spoke.

And the gashed heads nodded approval through the rings of the Endless Smoke

“Who comes for the beer and the Woodbines of the never-closed Canteen

With the barrack-shine on his bayonet and a full-charged magazine?”

Then Rifleman Brown looked round him at the nameless men of the line.

At the wounds of the shell and the bullet, at the burns of the bomb and the mine.

At the tunics, virgin of medals but crimson-clotted with blood.

At the ankle-boots and the puttees, caked stiff with the Flanders mud.

At the myriad short Lee-Enfields that crowded the rifle-rack.

Each with its blade to the sword-cross brown, and its muzzle powder-black.

And Rifleman Brown said never a word, yet he felt in the soul of his soul,

His right to the beer of the lower hall, though he came to drink it, whole.

His right to the fags of the free Canteen, to a seat at the banquet board

Though he came to the men who had killed their man, with never a man to his sword.

“Who speaks for the stranger Rifleman, O boys of the free Canteen?

Who passes the chap with the unmaimed limbs and the kit that is far too clean?”

The gashed heads eyed him about their beers, the gashed lips sucked at their smoke

There were three at the board of his own platoon, but not a man of them spoke.

His mouth was mad for the tankard froth and the biting whiff of a fag

But he knew that he might not speak for himself to the dead men who do not brag

A gun-butt crashed on the gateway, a man came staggering in

His head was cleft with a great red wound from the temple-bone to the chin.

His blade was dyed to the bayonet-boss with the clots that were barely dry,

And he cried to the men who had killed their man, “Who passes the Rifleman?… I.”

By the four I slew, by the shell I stopped, if my feet be not too late

I speak the word for Rifleman Brown that a chap may speak for his mate.”

The dead of lower Valhalla, the heroes of dumb renown

They pricked their ears to the tale of the earth as they set their tankards down.

“My mate was on sentry this evening when General happened along,

And asked what he’d do in a gas attack. Joe told him, “Beat on the gong.”

“What else?” “Open fire, sir.” Joe answered. “Good God, man,” our General said,

“By the time you’d beaten the bloodstained gong the chances are you’d be dead

Just think, lad.” “Gas -helmet, of course, sir.” “Yes dammit, and gas helmet first.”

So Joe stood dumb to attention, and wondered why he’d been cursed.

The gashed heads turned to the Rifleman, and now it seemed that they knew

Why the face that had never a smear of blood was stained to the jaw-bones, blue.

“He was posted again at midnight.” The scarred heads craned to the voice

As the man with the blood-red bayonet spoke up for the mate of his choice.

“You know what it’s like in a listening post, the ‘Very’ candles aflare

Their bullets smacking the sand-bags, our Vickers combing your hair,

How your ears and your eyes get jumpy, till each known tuft that you scan

Moves and crawls in the shadows till you’d almost swear it was man.

You know how you peer and snuff at the night when the North-East gas-winds blow.”

“By the One who made us and maimed us,” quoth lower Valhalla, “We know.”

“Sudden, out of the blackness, sudden as Hell, there came,

Roar and rattle of rifles, spurts of machine-gun flame.

And Joe stood up in the forward sap to try and fathom their game

Sudden their shells come screaming; sudden his nostrils sniff

The sickening reek of the rotten pears, the death that kills with a whiff.

Death! and he knows it certain, as he bangs on his cartridge case

With the gas-cloud’s claws at his windpipe and the gas-clouds wings on his face.

We heard his gong in our dug-out, he only whacked on it twice

We whipped our gas-bags over our heads, and manned the steps in a trice.

For the cloud would have caught us for sure as Fate if he’d taken the Staff’s advice.”

His head was cleft with a great red wound from the chin to the temple-bone

But his voice was as clear as a sounding gong, “I’ll be damned if I’ll drink alone,

Not even in lower Valhalla! Is he free of your free Canteen

My mate who comes with the unfleshed point and the full-charged magazine?”

The gashed heads rose at the Rifleman, o’er the rings of the Endless Smoke

And loud as the roar of a thousand guns Valhall’s answer broke.

And loud as the crash of a thousand shells their tankards clashed on the board

“He is free of the mess of the killer-men, your mate of the unfleshed sword

For we know the worth of his deed on earth, as we know the speed of the death

Which catches its man by the back of the throat and gives him water for breath.

As we know how the helmet cloth may tarry seconds too long

When the very life of the front-line trench is staked on the beat of a gong.

By the four you slew, by the case he smote, by the grey gas-cloud and the green

We pass your mate for the Enless Smoke and the beer of the free Canteen.”

In the lower hall of Valhalla, with the heroes of no renown

With our nameless dead of the Marne and the Aisne, of Mons, and of Wipers town

With the men who killed ‘ere they died for us, sits Rifleman Joseph Brown.

.

Gilbert Frankau

(21 April 1884-4 November 1952)

British Novelist, War Poet and Short Story writer

A summary for any who don’t understand:

Rifleman brown has died and gone to Valhalla, the Norse afterlife of eternal drinking, fighting, eating and women. To get in, you must have died honorably in battle or else you are sent to the boring Helheim.

So these men who are already in Valhalla say “Your bayonet has no blood on it, and your gun is fully loaded. What did you do to deserve to get in here?”

Soon more men enter behind him, beaten, bloody and shot. They also have just died. They explain to the men in Valhalla why this Joeseph Brown deserved to get into Valhalla.

They tell the story of how Rifleman Brown was on guard duty, and if chemical weapons were used, he needed to beat on the warning gong (basically a flat bell) to signal to the other men to put their mask on. The general told him to put his mask on first though.

Well the gas DID come, but Rifleman Brown knew that in the time it took him to save his own life and put on his mask, it would be too late for everyone else. So he decided to beat the gong instead of putting his mask on. It alerted the other man and saved their lives, but Rifleman Brown died. Very quickly too, which serves to solidify that he didn’t have time to put the mask on. He only was able to hit the gong twice before he died. And so of course he is welcomed in to Valhalla.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: