అనువాదలహరి

దేవుని నిష్క్రమణ … గెమాలియల్ బ్రాడ్ ఫోర్డ్, అమెరికను కవి

మన తాత, తండ్రులకి దేముడు అన్నది ఒక నిజం

ఎంత నిజమంటే ఎదురుగా చూస్తున్నంత

అది వాళ్ళని దండించేంతగా భయపెట్టడమే గాక

విలువల్ని నిబద్ధతతోపాటించేట్టు చేసింది

 

వాళ్ళు ఇరుకైన  న్యాయమార్గంలో

అతి జాగరూకతతో నడిచేరు,

ఎందుకంటే వాళ్ళు నిరతాంధకార నరకాన్నీ

అక్కడి మరిగే నూనెలో శిక్షలకీ భయపడే వారు.

 

ఇప్పుడు నరకమే ఏకంగా కొట్టుకుపోయింది

దేముడు ఇప్పుడొక ఛాయామాత్రంగా మిగిలేడు.

పాపం, అతను సృష్టించిన ఈ ప్రపంచంలోనే

అతనికి తలదాచుకుందికి చోటు లేదు.

 

విలియం జేమ్స్ అనుచరులు

ఇంకా దేముణ్ణి మన నిస్తున్నారు

అతన్ని ఇంకా గొప్ప, గంభీరమైన పేర్లతో

స్తుతిస్తూ ప్రార్థిస్తున్నారు.

 

కానీ ఇప్పుడు ధైర్యానికీ, దౌర్జన్యానికే విలువ

మెదడులో తెలివితేటలతో పాటు,

అయినా ఆశ్చర్యకరమైన ప్రమాణంలో

చెప్పుకోలేని బాధ అనుభవించక తప్పడం లేదు.

 

నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది విశాలమైన ఈ

అంధకార ప్రపంచంలోకి దేముడు మళ్ళీ వస్తే బాగుణ్ణని.

అతనికి ఏ అతీత మైన శక్తులూ లేకపోవచ్చును గాని

అతను ఉండడంలో ఒక అందమైన పార్శ్వం  ఉంటుంది.

.

 

గెమాలియల్ బ్రాడ్ ఫోర్డ్

అమెరికను కవి.

ఇది పెద్దగా వ్యాఖ్యానాలక్కరలేని కవిత. సీదాసాదాగా ఉంటూనే దాని వ్యంగ్యం సూటిగా అవగతమౌతుంది.

.

EXIT GOD

Of old our father’s God was real,
Something they almost saw,
Which kept them to a stern ideal
And scourged them into awe.

They walked the narrow path of right
Most vigilantly well,
Because they feared eternal night
And boiling depths of Hell.

Now Hell has wholly boiled away
And God become a shade.
There is no place for him to stay
In all the world He made.

The followers of William James
Still let the Lord exist,
And call Him by imposing names,
A venerable list.

But nerve and muscle only count,
Gray matter of the brain,
And an astonishing amount
Of inconvenient pain.

I sometimes wish that God were back
In this dark world and wide;
For though sonic virtues He might lack,
He had his pleasant side.

GAMALIEL BRADFORD

American Poet

%d bloggers like this: