రోజు: జూన్ 30, 2013
-
ఓ పైసా, నా పైసా… విలియం బట్లర్ యేట్స్, ఐరిష్ కవి
“నేనింకా చిన్న వాణ్ణి” అని నాలోనేనే గొణుక్కున్నాను. వెంటనే,”ఫర్వాలేదు, నాకూ వయసొచ్చింది,” అని నిశ్చయించుకుని పైసా పైకెగరేసా నేను ప్రేమించొచ్చో లేదో తెలుసుకుందామని. “ఓయ్ కుర్రాడా, ఫో! ఫో! తప్పకుండా ప్రేమించు పిల్ల వయసులో ఉండి తీరుగా ఉంటే చాలు” ఓ పైసా, నా పైసా, నా బంగారు పైసా నే నామె కేశపాశాల్లో బందీనైపోయాను! . ఓహ్! ప్రేమ చాలా జటిలమైనది అందులో ఉన్నదంతా అర్థం చేసుకోగల తెలివైనవాడింకా నాకు కనిపించలేదు; ఎందుకంటే, చుక్కలు తొలగిపోయేదాకా…