నేను లేకుండా రోజు ఎగసిపోతుంది… జాన్ స్టామర్స్, బ్రిటిషు కవి

అన్ని దిక్కులకూ ప్రయాణమవుతున్న విమానాలు

నా ఆఫీసు కిటికీ మీద గీతలు గీస్తున్నాయి;

మేడమీద నుండి లండను అన్నిదిక్కులకూ జరుగుతోంది

దూరంగా:  ప్రపంచం నిండా ఎన్నో స్పందిస్తున్న హృదయాలు.   

నేను నిశ్చలంగా ఉన్నాను; నువ్వు మాత్రం దూరమౌతున్నావు;

నేనిప్పుడు కేవలం  పటంమీద ఒక ప్రామాణిక బిందువుని;

నువ్వు రేఖాంశాలన్నిటినీ దాటుకుంటూ పోతుంటే,

నేను మాత్రం సున్నా మధ్యాహ్న రేఖ మీద ఉన్నాను.

మనిద్దరం సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటలకి

నువ్వు ఆకాశంలో ఉండగా మన వీడ్కోలు సందేశాలను

చదువుకోవాలనుకున్న ఒడంబడిక

బరువైన చలికాలపు ఉన్నికోటులా  నన్నుపట్టి ఉంది.  

నువ్వు తెరవని ఉత్తరం ఇంకా నా జేబులో నే ఉంది…

లబ్ డబ్ మని కొట్టుకుంటూ… 

.

జాన్ స్టామర్స్

(1954 – )

బ్రిటిషు కవి.

ఇది అద్భుతమైన ప్రేమ కావ్యం. తీసుకున్న ప్రతీకలు చూడండి. ఒక్క సారి ఊహించుకొండి. ఒక భగ్న ప్రేమికుడు తన ఆఫీసుగదిలో కూచుని, తను ప్రేమించిన యువతికి వీడ్కోలు ఇచ్చి, ఆమె వెళుతున్న విమానం దిగంతాలకు పోవడం గమనిస్తున్నాడు. ఆమె తన ప్రేమ లేఖని చదవకుండా తిరిగి ఇచ్చేసింది. రెండుగంటలకి సరిగ్గా తమ తమ వీడ్కోలు సందేశాలను చదవాలని నిర్దేశిస్తూ. విమానం దిగంతాలకు వెళిపోతోంది… రేఖాంశాలు దాటుకుంటూ సుదూరతీరాలకి. ఎక్కడ చూసినా స్పందించే హృదయాలే… తనకి తప్ప. తన దగ్గర స్పందించేది తన హృదయం ఒక్కటే… అదికూడా… తెరవని తన ప్రేమ లేఖలో…

అతి తక్కువ మాటలో రసనిష్యందంగా రాసిన ఈ కవిత చూడ గానే నాకు ముచ్చటేసింది.

.

John Stammers
John Stammers
Photo Courtesy: http://www.poetryinternationalweb.net

.

The Day Flies Off Without Me

The planes bound for all points everywhere
etch lines on my office window. From the top floor
London recedes in all directions, and beyond:
the world with its teeming hearts.

I am still, you move, I am a point of reference on a map;
I am at zero meridian as you consume the longitudes.
The pact we made to read our farewells exactly
at two in the afternoon with you in the air
holds me like a heavy winter coat.

Your unopened letter is in my pocket, beating.

John Stammers

(1954 -)

British Poet

Read the bio of the poet here: http://www.poetryinternationalweb.net/pi/site/poet/item/6964/29/John-Stammers

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: