రోజు: జూన్ 28, 2013
-
ఓ నా డేనియల్… అజ్ఞాత 8వశతాబ్దపు ఐరిష్ కవి
నిన్న రాత్రే పొద్దుపోయేక కుక్కపిల్ల నీ గురించి అడిగింది అదుగో చిత్తడినేల్లో ‘కసవుగువ్వ’ నీగురించే తలుచుకుంటోంది ఆ చిట్టడివిలో ఒంటరిగా అరిచే పిట్టవి నువ్వేననుకుంటాను నన్ను కలిసేదాకా నీకు తోడు దొరకకుండు గాక! నాకు మాటిచ్చావు; నాతో అబద్ధం చెప్పావు: గొర్రెలు మందకట్టేవేళకి నా ప్రక్కన ఉంటానని; నేను నీకోసం ఈలకొట్టి, మూడు వందసార్లు అరిచేను, నాకు ఆఖరికి దొరికిందల్లా అరుస్తున్న ఈ గొర్రెపిల్ల. నీకు అశక్యం అని తెలిసీ నాకు మాటిచ్చేవు: వెండి తెరచాపక్రింద ఓడనిండా…