అనువాదలహరి

నమ్మకానికి పరాకాష్ఠ … ఎర్నెస్ట్ హెమింగ్వే, అమెరికను కవి

మన ఆలోచనలన్నీ సుదీర్ఘమైనవే,

కానీ మనం నడిచేదే అడ్డదారి;

కోరికలదయ్యాల శృతికి నర్తించి నర్తించి

ఇంటిదారిలో భయంతో వేయి ప్రార్థనలు;

రాత్రి ఒక దొర దగ్గర కొలువైతే,

పగలు ఇంకొక ప్రభువు దగ్గర.

.

ఎర్నెస్ట్ హెమింగ్వే

Jul 21, 1899 – Jul 02, 1961

అమెరికను కవి, నవలా రచయిత

ఈ కవిత అతి పొందికైన తక్కువ మాటలలో, మన శరీరానికీ, మనసుకీ నిరంతరం జరిగే సంఘర్షణని సులభంగా పట్టిఇస్తుంది. ఇది అనాది నుండి ఉన్నదే. ఎద్దు ఎండకీ, ఎనుబోతు నీడకీ అని సామెత.

వివేచన ఎప్పుడూ తప్పుదారిలో వెళ్లకుండా నిరోధిస్తుంది,ఇంద్రియాలు మనసుకి లొంగవు… క్షణికమైనా దగ్గరదారినే పోదామంటాయి. తీరా తప్పుచేసిన తర్వాత, దాని పర్యవసానాలను నిర్విచారంగా స్వీకరించగల మనస్థైర్యం ఉండదు. దారి పొడుగునా దేమునికి… క్షమాపణలు వేడికోళ్ళు ప్రార్థనలు.

జీవితం ఇద్దరు యజమానులవద్ద కొలువు లాంటిది.

హెమింగ్వే పేరు చెప్పగానే  A Farewell To Arms , The Old Man and the Sea గుర్తుకు వస్తాయి. మొదటిది తన మొదటి ప్రపంచ సంగ్రామపు అనుభవాల ఆధారంగా రాసింది.  రెండవది అతనికి అమితమైన ఖ్యాతిని తెచ్చిపెట్టింది.  1954లో హెమింగ్వే కి సాహిత్యంలో నోబెలు పురస్కారం వచ్చింది. జీవితానికీ ఏదో సాధిద్దామన్న తపనే తప్ప ఏమి చేసినా చివరకి మిగిలేది శూన్యమనే సందేశాన్నిచ్చే కథ అది. జీవితం అంటే మనం జరిపే పోరాటపు నాణ్యత తప్ప వేరే అర్థం లేదని భావన.

.

Ernest Hemingway in Milan, 1918
Ernest Hemingway in Milan, 1918 (Photo credit: Wikipedia)

.

Chapter Heading

.

For we have thought the longer thoughts
And gone the shorter way.
And we have danced to devil’s tunes
Shivering home to pray;
To serve one master in the night,
Another in the day.

.

Ernest Hemingway

Jul 21, 1899 – Jul 02, 1961

American Poet, Novelist

.

A boy’s will is the wind’s will,
And the thoughts of youth are long, long thoughts.

HW Longfellow in  My Lost Youth“.

http://www.library.utoronto.ca/utel/rp/poems/heminw6.html

This poem expresses very powerfully the eternal conflict between the spirit and the flesh; the aim and the attainment; the desire and the failing. You can see how beautifully the irony is brought out in the pairing of  words : ” we have thought the longer thoughts but gone the shorter way”; “Danced to Devil’s tunes shivering home to pray”. Always the addictions of the flesh dominate the edicts of the reason.

Links:

A biography of Hemingway:
http://www.nobel.se/literature/laureates/1954/hemingway-bio.html

The Hemingway Foundation:
http://www.hemingway.org/

Poem Courtesy: http://wonderingminstrels.blogspot.in/search?updated-min=2001-01-01T00:00:00-08:00&updated-max=2002-01-01T00:00:00-08:00&max-results=50

%d bloggers like this: