ఆ చలికాలపు ఆదివారాలు… రాబర్ట్ హేడెన్, అమెరికను

ఆదివారాలు కూడా మా నాయన పొద్దున్నే లేచే వాడు

లేచి ఆ చీకటిలో చలిలో బట్టలుతొడుక్కుని, వారం అల్లా

ఎండనక వాననక చేసినశ్రమకి పగుళ్ళుబారిన చేత్తోనే,

నిద్రపోతున్న నిప్పుల్ని మేల్కొలిపి భగభగమండేలా చేసేవాడు.

అతనికెవరూ ఎన్నడూ కృతజ్ఞతలు చెప్పుకోలేదు.

చలి విరిగుతున్న చప్పుడుకి నేను మేల్కొనేవాడిని;

గదులు వేడేక్కుతుంటే నన్ను పిలిచేవాడు మా నాయన.

అప్పుడు నెమ్మదిగా లేచి, బట్టలు వేసుకునే వాడిని.

ఎక్కడ అలవాటుకొద్దీ కోపంతో తిడతాడోనని భయపడుతూ .

చలిని అవతలకి పారదోలడమే కాదు

అప్పుడప్పుడు నా జోళ్ళుకూడా పాలిష్ చేసిన అతనితో

చాలా నిర్లక్ష్యంగా మాటాడేవాడిని. ఓహ్!

ఒంటరిగా నిరాడంబరంగా ప్రేమ చేసుకుంటూపోయే సేవల గురించి

నేనేం తెలుసుకున్నాను, తెలుసుకోగలిగేను?

.

రాబర్ట్ హేడెన్

4 August 1913 – 25 February 1980  

అమెరికను.

మనలో చాలామందికి అనుభవమే… తల్లిదండ్రులు బ్రతికున్నంత కాలం వాళ్ల విలువా, వాళ్ళు మనకు చేసిన సేవల విలువా గుర్తించలేకపోవడం. వాళ్లని పోగొట్టుకున్నాకే మనకి క్రమంగా జ్ఞానోదయం అయేది. ఈ కవితలోని ఆర్ద్రత అంతా  చివరిపాదాల్లోనే ఉంది.  ప్రేమ ఒంటరిగా నిరాడంబరంగా ఏ ప్రతిఫలమూ కోరకుండా తనపని చేసుకుంటూ పోతుందని చెబుతూనే, తన అనుభవాన్నీ, తన అజ్ఞానాన్నీ నెమరువేసుకుంటూ, మనం కూడా కవితతో మమేకమయేలా చేస్తున్నాడు కవి. 

.

Robert Hayden

.

Those Winter Sundays

.

Sundays too my father got up early
 And put his clothes on in the blueback cold,
then with cracked hands that ached
from labor in the weekday weather made
banked fires blaze. No one ever thanked him.

I’d wake and hear the cold splintering, breaking.
When the rooms were warm, he’d call,
and slowly I would rise and dress,
fearing the chronic angers of that house,

Speaking indifferently to him,
who had driven out the cold
and polished my good shoes as well.
What did I know, what did I know
of love’s austere and lonely offices?

— Robert Hayden

4 August 1913 – 25 February 1980 

American Poet

It is our common experience that we never realize the true value and the essence of efforts of our parents until after we have lost them forever. A heartfelt regret follows youth as  insight develops with the passage of time. The beauty of the poem and the real pathos lies in the insistent reproach : “What did I know, what did I know/ of love’s austere and lonely offices.  Such poems as these haunt us through our life.

Links:

Biography of Hayden:  http://www.poets.org/poets/poets.cfm?prmID=200

Poem Courtesy: http://wonderingminstrels.blogspot.in/

“ఆ చలికాలపు ఆదివారాలు… రాబర్ట్ హేడెన్, అమెరికను” కి 2 స్పందనలు

  1. చాలా బావుంది నాలోకి నేను చూసుకున్నట్లు ఉంది

    మెచ్చుకోండి

  2. వనజ గారూ,

    అది నాలోకి నేను తొంగి చూసుకున్నట్టుకూడా ఉంది. ఏదో సినిమాలో ఘంటశాలపాట ఉంది: “ఏ పూట తిన్నావొ, ఎన్ని పస్తులున్నావొ, పరమాన్నం మాకు దాచి ఉంచావు” అని తండ్రిని గుర్తుచేసుకుంటూ పాడే పాట. నిజంగా నాలాంటి దిగువ మధ్యతరగతి కుటుంబాలనుండి వచ్చిన వాళ్ళందరికీ ఇది పరిచయమే. మన విద్యావిధానంలో లోపమో, పెంపకాల్లో లోపమో తెలీదుగాని, ఇవతలి వ్యక్తి శ్రమని గుర్తించడంలో ఇప్పటికీ మనం వెనకే అనిపిస్తుంది నాకు.

    అభివాదములతో

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: