కన్యలకి… సమయముండగానే మేలుకొమ్మని… రాబర్ట్ హెర్రిక్, ఇంగ్లీషు కవి మీరు గులాబిమొగ్గలు ఏరుకుంటే ఏరుకున్నారు కానీ ఈ ముసలినక్క కాలం పరిగెడుతూంటుంది. జాగ్రత్త. ఇవాళ చిరునవ్వులు చిందించే ఈ పువ్వే రేపు ఉదయానికి వాడి రాలిపోతుంది. అద్భుతమైన ఆకాశ దీపం, సూరీడు, వాడు నెత్తిమీదకొస్తున్నకొద్దీ వాడి పరుగు ముగియబోతుంది, అస్తమయానికి దగ్గరౌతాడు. ఏ వయసులో అయితే యవ్వనం, రక్తం వేడిగా ఉంటాయో అదే ఉత్తమమైనది, ఒకసారి ఖర్చుపెట్టేసేక, వెనక వచ్చేవి గడ్డురోజులూ, అంతకంటే గడ్డురోజులూ. అందుకే, సిగ్గుపడొద్దు. కాలం సద్వినియోగం చేసుకొండి అవకాశం వస్తే, తొందరగా ఒకింటివాళ్లవండి; ఎందుకంటే, ఒకసారి మీ మిసమిసలు పోతే ఇక జీవితాంతం నిరీక్షించవలసిందే. . రాబర్ట్ హెర్రిక్ (baptized 24 August 1591 – buried 15 October 1674)[ ఇంగ్లీషు కవి. . Robert_Herrick_Hesperides – the title pafe of the book (Photo credit: Wikipedia) . To Virgins, to Make Much of Time . Gather ye rosebuds while ye may, Old time is still a-flying And this same flower that smiles today Tomorrow will be dying. The glorious lamp of heaven, the sun, The higher he’s a-getting, The sooner will his race be run, And nearer he’s to setting. That age is best which is the first, When youth and blood are warmer; But being spent, the worse, and worst Times still succeed the former. Then be not coy, but use your time, And, while ye may, go marry; For, having lost but once your prime, You may forever tarry. Robert Herrick (baptized 24 August 1591 – buried 15 October 1674) English Poet (Poem Courtesy: http://wonderingminstrels.blogspot.in/) You can also see the poems of Herrick in this link: http://www.luminarium.org/sevenlit/herrick/herribib.htm Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… వ్యాఖ్యానించండిజూన్ 19, 2013