అనువాదలహరి

సంఘర్షణ… గెమాలియల్ బ్రాడ్ ఫోర్డ్, అమెరికను కవి

నా జీవితం ప్రశాంతంగా నీకు కనిపించొచ్చు

కాని నా మట్టుకు అది ఎన్నో మార్పులకి లోనైంది

అవి అనంతంగా సాగుతూనే ఉన్నై

ఎంత మనోరంజకమో అంత చిత్రంగా. 

 

మెదడులో నిప్పు రవ్వల్లాఆలోచనలు

విశృంఖలంగా పరిగెడుతూనే ఉన్నై

ఇలా మెరిసి, మరుక్షణంలో మాయమౌతున్నై

మళ్ళీ మరోసారి రగుల్కోడానికే.

 

అందమైన ఊహలు ఒళ్ళు పులకలెత్తిస్తే,

నా కళ్ళముందు అయిష్టంగా

కొన్ని భయంకరమైన ఆలోచనలు మెదుల్తునై  

అప్పుడప్పుడు నిద్రలోకూడా వెంటాడుతూ. 

 

ఒక స్పష్టమైన అంతులేని సంఘర్షణ

రాత్రీ పగలూ చుట్టుముడుతుంది.

నా జీవితం నీకు ప్రశాంతంగా కనిపిస్తోందా?

నువ్వేం మాటాడుతునావో నీకు తెలియడంలేదు.

 

గెమాలియల్ బ్రాడ్ ఫోర్డ్

(October 9, 1863 – April 11, 1932)

అమెరికను కవి

.

The Riot

.

You may think my life is quiet.
I find it full of change,
An ever-varied diet,
As piquant as ’tis strange.

Wild thoughts are always flying,
Like sparks across my brain,
Now flashing out, now dying,
To kindle soon again.

Fine fancies set me thrilling,
And subtle monsters creep
Before my sight unwilling:
They even haunt my sleep.

One broad, perpetual riot
Enfolds me night and day.
You think my life is quiet?
You don’t know what you say.

Gamaliel Bradford

(October 9, 1863 – April 11, 1932)

American Poet, Critic, Dramatist and Biographer.

Poem Courtesy: Anthologu of Massachusetts Poets Ed. William Stanley Braithwaite
http://www.gutenberg.org/files/2294/old/mpoet11.txt

%d bloggers like this: