అనువాదలహరి

నదీ వర్తకుని భార్య ప్రేమలేఖ… ఎజ్రా పౌండ్, అమెరికను క

నా నుదిటిమీద పడుతున్న ముంగురులని

తిన్నగా కత్తిరిస్తున్న రోజుల్లో

ఇంటి ముందరగేటు దగ్గర

పూలు కోస్తూ ఆడుకుంటున్నాను;

నువ్వు వెదురుబొంగు ఊతకర్రలమీద  

గుర్రంలా గెంతుకుంటూ వచ్చి

నేరేడుపళ్ళతో ఆడుకుంటున్న నా చుట్టూ తిరిగేవు.

తర్వాత మనం “చోకాన్” గ్రామం వెళ్ళేం … జీవించడానికి

ఇద్దరు బాలలం… ఏ సందేహాలూ అయిష్టాలూ లేకుండా.

 

పధ్నాలుగో ఏట నిన్ను నా స్వామిగా చేసుకున్నాను.

సిగ్గుముంచెత్తడం వల్ల ఎప్పుడూ నవ్వేదాన్ని కాదు;

తల వాల్చుకుని, గోడవైపు అలా చూస్తుండేదాన్ని

ఎన్నిసార్లు పిలిచినా, వెనుదిరిగి చూడకుండా.

 

పదిహేనో ఏట నా భయాలన్నీ తొలగిపోయాయి

ఎన్నటికైనా…ఎప్పటికైనా… శాశ్వతంగా…

నీతోపాటే నా శరీరమూ మట్టిపాలవాలని కోరుకున్నాను

నేనెందుకు అనుమానపు అగడ్తలెక్కాలి?

 

పదహారో ఏట నువ్వు వెళ్లిపోయావు

ఎక్కడికో చాలా దూరంగా ఉన్న

సుడిగుండాల “కూ-టో-ఎన్” నది మీదకి. 

నువ్వెళ్ళి అప్పుడే అయిదునెలలు కావస్తోంది

నెత్తిమీద కోతులు విషాదంగా అరుస్తున్నాయి.

 

నువ్వు వెళ్తున్నప్పుడు అయిష్టంగా వెళ్ళేవు

ఇప్పుడు గేటుదగ్గర నాచు పెరిగిపోయింది

ఎన్నిరకాల నాచో, పెరకలేనంతగా!

గాలికి, ఆకులు ముందుగానే రాలడం ప్రారంభించేయి శరత్తులో.

 

పడమటితోటలో గడ్డిమీద పచ్చగా

జతగూడిన సీతాకోకచిలుకలు అందగిస్తున్నాయి;

అవి నన్ను బాధిస్తున్నాయి. నాకు వయసు మీరుతోంది.

“కియాంగ్” నది సన్నని పాయలగుండా తిరిగివస్తుంటే

నాకు ముందుగా కబురురంపడం మరిచిపోకు.

నిన్ను కలవడం కోసం “చో-ఫ్యూ-సా” దాకా వస్తాను. 

ఎజ్రా పౌండ్.

(30 October 1885 – 1 November 1972)

ప్రవాస అమెరికను కవి 

.

ఈ కవితలో చక్కని ప్రతీకలతో, బాల్య వివాహం, అమాయకత్వం, ప్రేమా, విరహం, సమాగమాకాంక్షా ఇందులో అద్భుతంగా తీసుకు రాగలిగేడు కవి.  ఇది విశ్లేషణాత్మకంగా చదువుతున్న కొద్దీ దీనిలోని సౌందర్యం మనకి అవగతమౌతుంటుంది.

.

Ezra Pound, cropped mug shot
Ezra Pound, cropped mug shot (Photo credit: Wikipedia)

.

The River-Merchant’s Wife

.

While my hair was still cut straight across my forehead
I played about the front gate, pulling flowers.
You came by on bamboo stilts, playing horse,
You walked about my seat, playing with blue plums.
 And we went on living in the village of Chokan:
Two small people, without dislike or suspicion.

At fourteen I married My Lord you.
I never laughed, being bashful.
Lowering my head, I looked at the wall.
Called to, a thousand times, I never looked back.

At fifteen I stopped scowling,
I desired my dust to be mingled with yours
Forever and forever and forever.
Why should I climb the look out?

At sixteen you departed,
You went into far Ku-to-en, by the river of swirling eddies,
And you have been gone five months.
The monkeys make sorrowful noise overhead.

You dragged your feet when you went out.
By the gate now, the moss is grown, the different mosses,
Too deep to clear them away!
The leaves fall early this autumn, in wind.

The paired butterflies are already yellow with August
Over the grass in the West garden;
They hurt me. I grow older.
 If you are coming down through the narrows of the river Kiang,
Please let me know beforehand,
And I will come out to meet you
As far as Cho-fu-Sa.

Ezra Pound

(30 October 1885 – 1 November 1972)

American Expatriate Poet

For an interesting analysis of this poem pl.visit:

http://www.english.illinois.edu/maps/poets/m_r/pound/letter.htm

%d bloggers like this: