అనువాదలహరి

“హలో! బాగున్నారా?”… జాన్ ప్రైన్, అమెరికను

మాకు సిటీలో ఒక అపార్ట్ మెంటు ఉంది,

నాకూ లొరెటా కీ అక్కడ ఉండడం ఇష్టం.

పిల్లలు పెద్దవాళ్ళయిపోయి చాలా కాలం అయింది

వాళ్ళబ్రతుకులు వాళ్ళుబ్రతకటం మమ్మల్ని ఒంటరిచేసింది.

జాన్, లిండా ఒమాహా లో ఉంటారు,

జో ఎక్కడో రోడ్లంబట తిరుగుతుంటాడు.

కొరియన్ యుద్ధంలో డేవీ చనిపోయాడు,

ఇప్పటికీ నాకు తెలీదు ఎందుకో, అయినా,

ఇప్పుడు తెలియడంవల్ల ప్రయోజనంకూడా లేదు.

మీకు తెలుసును కదా,

పాతబడిన చెట్లు బలంగా ఎదుగుతాయనీ

పురాతనమైన నదులు రోజురోజుకీ

ఏ మరుభూముల్లోకో పరిగెడుతుంటాయనీ.

అలాగే, వృద్ధులుకూడా ఒంటరి అయిపోతారు

ఎవరైనా వచ్చి “ఏమండీ, ఎలా ఉన్నారు?”

అని పలకరిస్తారేమోనని ఆశగా ఎదురుచూస్తుంటారు.

నేనూ, లోరెటా ఇప్పుడు పెద్దగా సంభాషించుకోము,

తను అలా కూచుని పెరటిగుమ్మం తెరలోంచి

గుడ్లప్పగించి ఏటో చూస్తూ ఉంటుంది, అంతే.

విషయాలన్నీ పదే పదే పునరావృతమౌతుంటాయి

ఇద్దరం కన్న మరిచిపోయిన కలలా …

ఏదో రోజు నేను రూడీని పలకరించడానికి వెళ్తాను

మేమిద్దరం ఒకే కర్మాగారంలో కలిసి పనిచేసేము.

కానీ, అతను “ఏమిటి సంగతులు?” అని అడిగితే

ఏమిటి చెప్పాలి? “ఏమీ లేదు. నీ సంగతేమిటి?

నాకైతే చెయ్యడానికేమీ లేదు.” అనాలి.

కనుక, మీరు ఎప్పుడైనా వీధిలో నడిచి వెళ్తున్నప్పుడు

ఏవో రెండు లోతుకి పోయిన పాత కనుగుడ్లు ఎదురైతే,

వాటివంక తేరిపారజూస్తూ, మీకేమీ పట్టనట్టు

మీ మానాన్న మీరు వెళ్ళిపోకండి.

“ఏమండీ, బాగున్నారా?” అని ఒక్క కుశలప్రశ్న వెయ్యండి.

.

జాన్ ప్రైన్

అక్టోబరు 10, 1946

అమెరికను.

.

English: John Prine at MerleFest (2006). Photo...
English: John Prine at MerleFest (2006). Photo by Ron Baker. (Photo credit: Wikipedia)

.

Hello In There

 We had an apartment in the city,
 Me and Loretta liked living there.
 Well, it'd been years since the kids had grown,
 A life of their own left us alone.
 John and Linda live in Omaha,
 And Joe is somewhere on the road.
 We lost Davy in the Korean war,
 And I still don't know what for, don't matter anymore.

 Ya' know that old trees just grow stronger,
 And old rivers grow wilder ev'ry day.
 Old people just grow lonesome
 Waiting for someone to say, "Hello in there, hello."

 Me and Loretta, we don't talk much more,
 She sits and stares through the back door screen.
 And all the news just repeats itself
 Like some forgotten dream that we've both seen.
 Someday I'll go and call up Rudy,
 We worked together at the factory.
 But what could I say if asks "What's new?"
 "Nothing, what's with you? Nothing much to do."

 So if you're walking down the street sometime
 And spot some hollow ancient eyes,
 Please don't just pass 'em by and stare
 As if you didn't care, say, "Hello in there, hello."

.
John Prine
(born October 10, 1946)
American Folk Singer and Song Writer.

(Poem Courtesy:
https://teluguanuvaadaalu.wordpress.com/wp-admin/post-new.php)
%d bloggers like this: