అనువాదలహరి

గాలి నెవరు చూసేడు?… క్రిస్టినా రోజెటి, ఇంగ్లీషు కవయిత్రి

గాలి నెవరు చూసేడు?

నువ్వూ లేదు, నేనూ లేదు.

కానీ, ఆకులు కదుల్తూ వేలాడుతుంటే

గాలి వాటిలోంచి వెళుతోందని అర్థం.

.

గాలి నెవరు చూసేడు?

నువ్వూ లేదు, నేనూ లేదు.

కాని చెట్లు తమ తలలు వాల్చేయంటే

గాలి వాటిమీంచి పోతోందని లెఖ్ఖ.

.

క్రిస్టినా రోజెటి

(5 December 1830 – 29 December 1894)

ఇంగ్లీషు కవయిత్రి.  

మనకి కపిల మహర్షిచే ప్రచారంలోకి తీసుకురాబడిన సాంఖ్యము అనబడే దర్శనములో, వేటిని ప్రమాణాలుగా తీసుకోవాలి అన్న మీమాంస వచ్చిన చోట, నాలుగురకాలయిన ప్రమాణాలు చెప్పబడ్డాయి: ప్రత్యక్ష ప్రమాణం (Direct Evidence), పరోక్ష ప్రమాణం (Indirect Evidence), వేద ప్రమాణం, (Evidence of Veda or Holy Text)శబ్ద ప్రమాణం (Evidence Upon Oath… this is the key factor in Indian Jurisprudence.) . అందులో రెండవది పరోక్షప్రమాణం. అంటే ఒకటి చూస్తూ రెండవదాని ఉనికి ఊహించడం. ఉదాహరణకి పొగను చూసి నిప్పు ఉందని పోల్చుకోవడం. అదే విషయాన్ని, కవయిత్రి గాలికి అన్వయిస్తూ చెప్పింది. గాలి కంటికి కనిపించదు. అంతమాత్రం చేత కనిపించనివన్నీ అసత్యాలు కాదు.  గాలి ఉనికీ, లేమీ మనకి అనుభవంలోని విషయాలే. ఆకులు అల్లాడితే గాలి వీస్తుంది. చెట్లు అవనతం అవుతున్నాయంటే, గొప్ప గాలి వీచడం వల్లనే… అని అంటోంది కవయిత్రి. అయితే ఇందులో ఇంకొక పార్శ్వం కూడా ఉంది. Pre-Raphaelite Brotherhood లో సభ్యత్వం లేకపోయినా, క్రియాశీలకంగా ఉన్న క్రిస్టినా, ఆ ఉద్యమ స్ఫూర్తి అయిన ప్రకృతిని యథాతథంగా ప్రతిబింబించాలన్న నియమాన్ని అనుసరించి ఇది వ్రాసి ఉండొచ్చు.

.

English: Christina Rossetti, portrait by her b...
English: Christina Rossetti, portrait by her brother (Photo credit: Wikipedia)

.

Who Has Seen The Wind?
.
Who has seen the wind?

Neither I nor you.

But when the leaves hang trembling,

The wind is passing through.

Who has seen the wind?

Neither you nor I.

But when the trees bow down their heads,

The wind is passing by.

.

Christina Rossetti

(5 December 1830 – 29 December 1894)

English Poetess.

%d bloggers like this: