ఆగ్రహం… ఛార్లెస్ లాంబ్, ఇంగ్లీషు కవి
.
తగిన సమయంలో, తగినచోట
ఆగ్రహమైనా అందం సంతరించుకుంటుంది,
అయితే, దానికి తగిన కారణం ఉండాలి
ఒక నిముషం దాటి అది ఉండకూడదు.
అంతకుమించి ఇంకా కొనసాగిందా
అది పగ క్రింద మారుతుంది.
అది ఒక పాముకీ, ఒక తేనెటీగకీ మధ్య
మనం గమనించే వ్యత్యాసం లాంటిది.
వెనకచెప్పినదాన్ని మీరెప్పుడైనా రేపెడితే
తొందరపడి ఒకసారి గట్టిగా కుడుతుంది,
మీకు క్షణకాలం తీవ్రంగా నొప్పెడుతుంది
కానీ, రెండోసారి మరి కుట్టదు.
గుబురు పొదలమాటునో, వెదురు, ముళ్లపొదలచాటునో
విషం నిండిన పాము పొంచి ఉంటుంది
దాని కోపాన్ని తీర్చుకునే మార్గం అన్వేషిస్తూ;
దాని త్రోవ చుట్టుపక్కలకి, చలి అయినా ఎండ అయినా
ఉపకారం చేద్దామనుకునైనా అపకారం చేద్దామనుకునైనా
ఎప్పుడు మీ విధి మిమ్మక్కడకి తీసుకువచ్చినా
కాటువెయ్యడానికి ఆ విషసర్పము సంసిద్ధంగా ఉంటుంది.
.
ఛార్లెస్ లాంబ్
(10 February 1775 – 27 December 1834)
ఇంగ్లీషు వ్యాసకర్త.
.
