అనువాదలహరి

ఇక్కడ చచ్చి పడున్నాం… ఆల్ఫ్రెడ్ ఎడ్వర్డ్ హౌజ్మన్, ఆంగ్ల కవి

మేం ఇక్కడ చచ్చి పడున్నాం

ఎందుకంటే, మేం బ్రతికి

జన్మించిన ఈ గడ్డకి అగౌరవం

తీసుకురాదలుచుకో లేదు.

.

జీవితం… నిజానికి

అందులో పోగొట్టుకున్న దేదీ లేదు.

కాని యువకులు అలా భావిస్తారు,

మరి మేం అందరం యువకులమే.

.

ఆల్ఫ్రెడ్ ఎడ్వర్డ్  హౌజ్మన్

26 March 1859 – 30 April 1936

ఆంగ్ల కవి

ఈ కవితలో గొప్ప తాత్త్విక చింతన ఉంది. జీవితం అపురూపమైనదీ, విలువైనదీ అని వృద్ధులు నమ్ముతారు. అసలు చాలా కాలం జీవించాలనుకోవడంలోని మర్మం కూడా అదే. కానీ, ఆ జీవించడం ఎటువంటిదై ఉండాలి? ప్రపంచ సంగ్రామాలూ, ఆర్థికమాంద్యాలూ, నేపథ్యంలో వ్రాస్తున్న కవితలో, నిరాశ, నిర్వేదమూ కలగలిసిన జీవన సంక్షోభలో, జీవించడం దుర్భరమైనప్పుడు, మరణానికీ జీవితానికీ మధ్యనున్న పలుచని రేఖ తొలగిపోతుంది. అప్పుడు ఒక లక్ష్యం కోసం, ఒక ఆదర్శంకోసం మరణించడం జీవితానికి విలువనిచ్చిన సంతృప్తి మిగులుస్తుంది.

ఈ కవితలో యుద్ధభూమిలో మరణించిన యువకుడి అంతరంగం ఆవిష్కరించబడింది. అందరికీ బ్రతకాలనే ఉంటుంది. కానీ, బ్రతుకు దుర్భరమైనపుడు మరణమే మేలనిపిస్తుంది. మనం వెతుకుతున్న అర్థం జీవితానికి దొరకనప్పుడు మనమే జీవితానికి ఒక అర్థాన్నీ, నిర్వచనాన్నీ ఇయ్యవలసిన సందర్భం తటస్థిస్తుంది. ఆ పని ఒక్క యువకులే చెయ్యగలరు. ఈ కవితలో యువకుడు తన మరణానికి విచారం వ్యక్తపరచడంతో పాటు, దానివల్ల పోగొట్టుకున్నదేదీ లేదనీ, అంతకుమించి, బ్రతికి తనుపుట్టిన నేలకి తలవంపులు తెచ్చేకన్నా, మరణమే మెరుగన్న సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాడు

.

English: English classical scholar and poet .
English: English classical scholar and poet . (Photo credit: Wikipedia)

.

Here Dead We Lie…

.

Here dead we lie

Because we did not choose

To live and shame the land

From which we sprung.

 

Life, to be sure,

Is nothing much to lose,

But young men think it is,

And we were young.

 

Alfred Edward Housman

26 March 1859 – 30 April 1936 

English classical scholar and Poet

Poem Courtesy: http://wonderingminstrels.blogspot.in/2003/04/here-dead-we-lie-e-housman.html

%d bloggers like this: