క్షణికం… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
అంతవరకూ కడలికెరటాలమూపున సుడులుతిరుగుతూ
తిరుగాడిన నురుగు, అలలుభంగమవగానే నిండు సముద్రంలో
నిశ్చలంగా మిగిలినట్లు, నేను మరణించిన కొద్ది సేపటికే
నా జీవితం సంగీతంలోనే మిగులుతుంది నా అనంతరం.
క్షణికమైన బుద్బుదంలో మెరిసే హరివిల్లులా
కొన్ని రేయింబవళ్ళు సంగీతంతో జ్వలిస్తాయి
ఒక వెలుగు వెలిగి, తమ శాశ్వతనివాసమైన
శూన్యంలోకి నిర్గమించేదాకా…
.
సారా టీజ్డేల్
(August 8, 1884 – January 29, 1933)
అమెరికను కవయిత్రి
.

.
A Little While
A little while when I am gone
My life will live in music after me,
As spun foam lifted and borne on
After the wave is lost in the full sea.
A while these nights and days will burn
In song with the bright frailty of foam,
Living in light before they turn
Back to the nothingness that is their home.
.
Sarah Teasdale
For some fine poems of Sarah Teasdale please visit:
http://theinkbrain.wordpress.com/2012/05/20/sarah-teasdale-selected-poems/
Related articles
- Superstitions (mvaintrob.wordpress.com)
- Yana: Poem #3 (lizkimfieldschool.wordpress.com)