ఓ పైసా, నా పైసా… విలియం బట్లర్ యేట్స్, ఐరిష్ కవి
“నేనింకా చిన్న వాణ్ణి” అని నాలోనేనే గొణుక్కున్నాను.
వెంటనే,”ఫర్వాలేదు, నాకూ వయసొచ్చింది,”
అని నిశ్చయించుకుని పైసా పైకెగరేసా
నేను ప్రేమించొచ్చో లేదో తెలుసుకుందామని.
“ఓయ్ కుర్రాడా, ఫో! ఫో! తప్పకుండా ప్రేమించు
పిల్ల వయసులో ఉండి తీరుగా ఉంటే చాలు”
ఓ పైసా, నా పైసా, నా బంగారు పైసా
నే నామె కేశపాశాల్లో బందీనైపోయాను!
.
ఓహ్! ప్రేమ చాలా జటిలమైనది
అందులో ఉన్నదంతా అర్థం చేసుకోగల
తెలివైనవాడింకా నాకు కనిపించలేదు;
ఎందుకంటే, చుక్కలు తొలగిపోయేదాకా
నీడలు చందురుని కబళించేదాకా
ప్రేమంటూ మనిషి పాకులాడుతూనే ఉంటాడు.
ఓ పైసా, నా పైసా, ఓ నా బంగారు పైసా
ప్రేమించడానికి తరుణవయసంటూ లేదు.
.
విలియం బట్లర్ యేట్స్
ఐరిష్ కవి.
ఈ కవితలో రెండు విశేషాలున్నాయి. ఒకటి నిజమైన ప్రేమ ఎంత లాటరీవో చెప్పడం. అందుకే “నాణెం పైకెగరేసా” అంటాడు. రెండోది, ప్రేమని ఎవ్వరూ సరిగా అర్థం చేసుకో లేకపోవడం. అందుకే “చుక్కలు తొలగిపోయేదాకా, నీడలు చందురుని కబళించేదాకా” అంటాడు. ఇక్కడ “గుండమ్మ కథ చిత్రంలో ఎంతహాయి ఈ రేయి ఎంత మధురమీ హాయి” అన్న పింగళి వారి గీతం గుర్తుకు రాకమానదు. ప్రేమ శరీరాన్ని ఆశ్రయించి పెరిగే పూతీవ అయినా, దాని చిగుళ్ళు ఎప్పుడూ అనంత ఆకాశంలోకే ఉంటాయి. దాని ఉదాత్తత తెలుసుకోడం చాలా కష్టం.
.

.
Brown Penny
.
I whispered, “I am too young,”
And then, “I am old enough”;
Wherefore I threw a penny
To find out if I might love.
“Go and love, go and love, young man,
If the lady be young and fair.”
Ah, penny, brown penny, brown penny,
I am looped in the loops of her hair.
.
O love is the crooked thing,
There is nobody wise enough
To find out all that is in it,
For he would be thinking of love
Till the stars had run away
And the shadows eaten the moon.
Ah, penny, brown penny, brown penny,
One cannot begin it too soon.
.
William Butler Yeats
Irish Poet
నేను లేకుండా రోజు ఎగసిపోతుంది… జాన్ స్టామర్స్, బ్రిటిషు కవి
అన్ని దిక్కులకూ ప్రయాణమవుతున్న విమానాలు
నా ఆఫీసు కిటికీ మీద గీతలు గీస్తున్నాయి;
మేడమీద నుండి లండను అన్నిదిక్కులకూ జరుగుతోంది
దూరంగా: ప్రపంచం నిండా ఎన్నో స్పందిస్తున్న హృదయాలు.
నేను నిశ్చలంగా ఉన్నాను; నువ్వు మాత్రం దూరమౌతున్నావు;
నేనిప్పుడు కేవలం పటంమీద ఒక ప్రామాణిక బిందువుని;
నువ్వు రేఖాంశాలన్నిటినీ దాటుకుంటూ పోతుంటే,
నేను మాత్రం సున్నా మధ్యాహ్న రేఖ మీద ఉన్నాను.
మనిద్దరం సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటలకి
నువ్వు ఆకాశంలో ఉండగా మన వీడ్కోలు సందేశాలను
చదువుకోవాలనుకున్న ఒడంబడిక
బరువైన చలికాలపు ఉన్నికోటులా నన్నుపట్టి ఉంది.
నువ్వు తెరవని ఉత్తరం ఇంకా నా జేబులో నే ఉంది…
లబ్ డబ్ మని కొట్టుకుంటూ…
.
జాన్ స్టామర్స్
(1954 – )
బ్రిటిషు కవి.
ఇది అద్భుతమైన ప్రేమ కావ్యం. తీసుకున్న ప్రతీకలు చూడండి. ఒక్క సారి ఊహించుకొండి. ఒక భగ్న ప్రేమికుడు తన ఆఫీసుగదిలో కూచుని, తను ప్రేమించిన యువతికి వీడ్కోలు ఇచ్చి, ఆమె వెళుతున్న విమానం దిగంతాలకు పోవడం గమనిస్తున్నాడు. ఆమె తన ప్రేమ లేఖని చదవకుండా తిరిగి ఇచ్చేసింది. రెండుగంటలకి సరిగ్గా తమ తమ వీడ్కోలు సందేశాలను చదవాలని నిర్దేశిస్తూ. విమానం దిగంతాలకు వెళిపోతోంది… రేఖాంశాలు దాటుకుంటూ సుదూరతీరాలకి. ఎక్కడ చూసినా స్పందించే హృదయాలే… తనకి తప్ప. తన దగ్గర స్పందించేది తన హృదయం ఒక్కటే… అదికూడా… తెరవని తన ప్రేమ లేఖలో…
అతి తక్కువ మాటలో రసనిష్యందంగా రాసిన ఈ కవిత చూడ గానే నాకు ముచ్చటేసింది.
.

Photo Courtesy: http://www.poetryinternationalweb.net
.
The Day Flies Off Without Me
The planes bound for all points everywhere
etch lines on my office window. From the top floor
London recedes in all directions, and beyond:
the world with its teeming hearts.
I am still, you move, I am a point of reference on a map;
I am at zero meridian as you consume the longitudes.
The pact we made to read our farewells exactly
at two in the afternoon with you in the air
holds me like a heavy winter coat.
Your unopened letter is in my pocket, beating.
John Stammers
(1954 -)
British Poet
Read the bio of the poet here: http://www.poetryinternationalweb.net/pi/site/poet/item/6964/29/John-Stammers
ఓ నా డేనియల్… అజ్ఞాత 8వశతాబ్దపు ఐరిష్ కవి
నిన్న రాత్రే పొద్దుపోయేక కుక్కపిల్ల నీ గురించి అడిగింది
అదుగో చిత్తడినేల్లో ‘కసవుగువ్వ’ నీగురించే తలుచుకుంటోంది
ఆ చిట్టడివిలో ఒంటరిగా అరిచే పిట్టవి నువ్వేననుకుంటాను
నన్ను కలిసేదాకా నీకు తోడు దొరకకుండు గాక!
నాకు మాటిచ్చావు; నాతో అబద్ధం చెప్పావు:
గొర్రెలు మందకట్టేవేళకి నా ప్రక్కన ఉంటానని;
నేను నీకోసం ఈలకొట్టి, మూడు వందసార్లు అరిచేను,
నాకు ఆఖరికి దొరికిందల్లా అరుస్తున్న ఈ గొర్రెపిల్ల.
నీకు అశక్యం అని తెలిసీ నాకు మాటిచ్చేవు:
వెండి తెరచాపక్రింద ఓడనిండా బంగారం
పన్నెండు పట్టణాల్లో తిరుగులేని వ్యాపారం
సముద్రపొడ్డున ఒక రాజభవనం.
అసలు ప్రపంచంలో దొరకనివస్తువులు నాకు మాటిచ్చావు:
చేపపొలుసులతో చేసిన చేతితొడుగులిస్తాననీ
పిట్టతోలుతో చేసిన చెప్పుల జత ఇస్తాననీ
ఐర్లండులోనే అత్యంత ఖరీదైన సిల్కు బట్టలిస్తాననీ.
నాలుగు పక్కలా చూస్తున్నప్పుడు, బంగారు జరీ కుచ్చుల
జుత్తు గల నా వాడు కనిపించనపుడు
నేను ఒక్కర్తినీ ‘ ఏకాంత కూప ‘సమీపంలో కూచుని
వ్యథలన్నీ నాలో నేనే కలబోసుకుంటుంటాను.
ఆ ఆదివారం నాడే నేను నా ప్రేమని నీకర్పించింది,
అదే, ఈస్టరు ముందువచ్చే చివరి ఆదివారం…
మాకాళ్లమీద కూచుని నీకళ్ళలో ప్రేమను చదువుతూ
నా రెండు కళ్ళూ నా ప్రేమని శాశ్వతంగా సమర్పించాయి.
మా అమ్మ చెప్పింది మరుసటిరోజు : ఆ అబ్బాయితో మాటాడకు,
ఇవాళా, రేపూ, ఆదివారం కాదు … ఇక శాశ్వతంగా.
నాకు ఆమె చెప్పడానికి ఎంచుకున్న వేళ సరైంది కాదు…
ఎందుకంటే, అది ఇల్లుదోపిడీ అయేక తలుపులెయ్యడంలాంటిది.
నా మనసునిండా ఎంత చీకటి కమ్ముకుందంటే అడవి నేరేడంత నల్లనిది;
లేదా, కమ్మరివాని కొలిమిలో రాక్షసిబొగ్గంత నల్లనిది;
పాలరాతి చావడిమీద విడిచిన చెప్పులజత అడుగంత నల్లనిది.
ఆ చీకటిని నా బతుకునిండా నింపినది నువ్వే.
నువ్వు నానుండి పగలు దొంగిలించావు, రాత్రి దొంగిలించావు,
నా గతాన్నీ దొంగిలించావు, నా భవిష్యత్తునీ దొంగిలించావు
నా చల్లని ఆశలనీ, వేడి నిట్టూర్పులనీ దొంగిలించావు
నా భయం దేముడిమీద నా నమ్మకాన్నీదొంగిలించేవేమోనని.
.
అజ్ఞాత ఐరిష్ కవి.
మన జానపద సాహిత్యంలో లాగే ఐరిష్ జానపద సాహిత్యంలో కూడా అపురూపమైన ప్రేమ కావ్యాలున్నాయి. ఈ కవితని చాలా రకాలుగా ఇంగ్లీషులో వ్యాఖ్యానించారు గాని, నా మట్టుకి ఇది ఎంతో సున్నితంగా వ్యక్తీకరించిన ప్రేమ భావన. ఒక ముగ్ధ తన ప్రేమని ప్రియుడికి ధారపోస్తుంది. తల్లి హెచ్చరిక ఆలస్యం అయిపోతుంది అప్పటికే. ఆ రోజుల్లో అలవాటు ప్రకారం యువకుడు దేశం మీదకి వెళ్తాడు డబ్బు సంపాదించడానికి. ఆమెని సుఖపడతానని ఎన్నో బాసలు చేస్తాడు… అవి అసంభవమని తనకి తెలిసినా, ప్రేమ ఇచ్చే లావణ్య భావనల వల్ల ఆమె నిజమనే భ్రమలో ఉండకపోయినా, నిజమయితే బాగుండునని ఆశిస్తుంది. ‘ఏదీ, ఇదిగో చిటికెలో వచ్చెయ్యనూ‘ అని మాట ఇచ్చిన వ్యక్తి, ఏడాది తిరిగినా కబురు లేదు. ఎన్ని దిక్కుల్ని పలకరించినా ఆమె గొంతు ప్రతిధ్వనే తప్ప సమాధానం లేదు. ఇక్కడ “Bleating Lamb” అని ఇచ్చిన ప్రతీక అతనివల్ల కలిగిన సంతానం అవొచ్చు.
ఈ కవితలో సౌందర్యమంతా చివరి నాలుగు చరణాల్లో ఉంది: నా నిద్రా, మెలకువా, ఆశలూ, విచారాలూ భవిష్యత్తూ అన్నీ నువ్వే అంటూనే, ఆమె, అతను తిరిగిరాకపోతే, దేవునిమీద విశ్వాసం కూడా అతనితోనే అంతరించిపోతుందేమోనని చెబుతోంది. ప్రేమ ఉన్న చోట భయం, భయంతో పాటే అపనమ్మకాలూ, ముఖ్యంగా దేవునిమీద విశ్వాసం సన్నగిలడం మానవ సహజమైన బలహీనతలు. వాటిని చాలా చక్కగా చెబుతుందీ కవిత.
.
Donal Og
It is late last night the dog was speaking of you;
the snipe was speaking of you in her deep marsh.
It is you are the lonely bird through the woods;
and that you may be without a mate until you find me.
You promised me, and you said a lie to me,
that you would be before me where the sheep are flocked;
I gave a whistle and three hundred cries to you,
and I found nothing there but a bleating lamb.
You promised me a thing that was hard for you,
a ship of gold under a silver mast;
twelve towns with a market in all of them,
and a fine white court by the side of the sea.
You promised me a thing that is not possible,
that you would give me gloves of the skin of a fish;
that you would give me shoes of the skin of a bird;
and a suit of the dearest silk in Ireland.
When I go by myself to the Well of Loneliness,
I sit down and I go through my trouble;
when I see the world and do not see my boy,
he that has an amber shade in his hair.
It was on that Sunday I gave my love to you;
the Sunday that is last before Easter Sunday.
And myself on my knees reading the Passion;
and my two eyes giving love to you for ever.
My mother said to me not to be talking with you today,
or tomorrow, or on the Sunday;
it was a bad time she took for telling me that;
it was shutting the door after the house was robbed.
My heart is as black as the blackness of the sloe,
or as the black coal that is on the smith’s forge;
or as the sole of a shoe left in white halls;
it was you that put that darkness over my life.
You have taken the east from me; you have taken the west from me;
you have taken what is before me and what is behind me;
you have taken the moon, you have taken the sun from me;
and my fear is great that you have taken God from me!
.
Anonymous
This is an anonymous 8th Century Irish ballad; translated by Lady Augusta Gregory; published in The School Bag, edited by Seamus Heaney and Ted Hughes, 1997.
(Donal Og: ‘Young Daniel’)
Poem Courtesy: Wonderingminstrels.blogspot.in
నమ్మకానికి పరాకాష్ఠ … ఎర్నెస్ట్ హెమింగ్వే, అమెరికను కవి
మన ఆలోచనలన్నీ సుదీర్ఘమైనవే,
కానీ మనం నడిచేదే అడ్డదారి;
కోరికలదయ్యాల శృతికి నర్తించి నర్తించి
ఇంటిదారిలో భయంతో వేయి ప్రార్థనలు;
రాత్రి ఒక దొర దగ్గర కొలువైతే,
పగలు ఇంకొక ప్రభువు దగ్గర.
.
ఎర్నెస్ట్ హెమింగ్వే
Jul 21, 1899 – Jul 02, 1961
అమెరికను కవి, నవలా రచయిత
ఈ కవిత అతి పొందికైన తక్కువ మాటలలో, మన శరీరానికీ, మనసుకీ నిరంతరం జరిగే సంఘర్షణని సులభంగా పట్టిఇస్తుంది. ఇది అనాది నుండి ఉన్నదే. ఎద్దు ఎండకీ, ఎనుబోతు నీడకీ అని సామెత.
వివేచన ఎప్పుడూ తప్పుదారిలో వెళ్లకుండా నిరోధిస్తుంది,ఇంద్రియాలు మనసుకి లొంగవు… క్షణికమైనా దగ్గరదారినే పోదామంటాయి. తీరా తప్పుచేసిన తర్వాత, దాని పర్యవసానాలను నిర్విచారంగా స్వీకరించగల మనస్థైర్యం ఉండదు. దారి పొడుగునా దేమునికి… క్షమాపణలు వేడికోళ్ళు ప్రార్థనలు.
జీవితం ఇద్దరు యజమానులవద్ద కొలువు లాంటిది.
హెమింగ్వే పేరు చెప్పగానే A Farewell To Arms , The Old Man and the Sea గుర్తుకు వస్తాయి. మొదటిది తన మొదటి ప్రపంచ సంగ్రామపు అనుభవాల ఆధారంగా రాసింది. రెండవది అతనికి అమితమైన ఖ్యాతిని తెచ్చిపెట్టింది. 1954లో హెమింగ్వే కి సాహిత్యంలో నోబెలు పురస్కారం వచ్చింది. జీవితానికీ ఏదో సాధిద్దామన్న తపనే తప్ప ఏమి చేసినా చివరకి మిగిలేది శూన్యమనే సందేశాన్నిచ్చే కథ అది. జీవితం అంటే మనం జరిపే పోరాటపు నాణ్యత తప్ప వేరే అర్థం లేదని భావన.
.

.
Chapter Heading
.
For we have thought the longer thoughts
And gone the shorter way.
And we have danced to devil’s tunes
Shivering home to pray;
To serve one master in the night,
Another in the day.
.
Ernest Hemingway
Jul 21, 1899 – Jul 02, 1961
American Poet, Novelist
.
A boy’s will is the wind’s will,
And the thoughts of youth are long, long thoughts.
HW Longfellow in “My Lost Youth“.
— http://www.library.utoronto.ca/utel/rp/poems/heminw6.html
This poem expresses very powerfully the eternal conflict between the spirit and the flesh; the aim and the attainment; the desire and the failing. You can see how beautifully the irony is brought out in the pairing of words : ” we have thought the longer thoughts but gone the shorter way”; “Danced to Devil’s tunes shivering home to pray”. Always the addictions of the flesh dominate the edicts of the reason.
Links:
A biography of Hemingway:
http://www.nobel.se/literature/laureates/1954/hemingway-bio.html
The Hemingway Foundation:
http://www.hemingway.org/
Poem Courtesy: http://wonderingminstrels.blogspot.in/search?updated-min=2001-01-01T00:00:00-08:00&updated-max=2002-01-01T00:00:00-08:00&max-results=50
Severally…. Ravi Verelly, Telugu, Indian
In the absence of whiffs of breeze
that punctuate the air with fragrances,
two flowers blooming to the same sprig
shall experience impassable reaches
like the two detached gold discs hanging severally
to the thrice knotted sacred thread, sagging
under the weight of diverging lateral thoughts.
Like the light and darkness
lying like Siamese children
under the sheet of firmament,
we remain two perfectly sundered halves
when the yarns of necessities
fail to conjugate us double hard
Though we are pieces of the same cloth
We retain our identity intact
In the quilt of rags that Time mends.
Like the Longitudes and Latitudes
which notionally join a world
divided at its very natal hour,
Come; let us revolve round and round
Along with the earth, severally.
.
Ravinder Verelly
Indian
.
Mr. Ravi Verelly is a Software Architect with TMEIC. He lives in Roanoke, Virginia. He is very nostalgic about his village Amudalapalle and his childhood. He published his maiden collection of poems in Telugu … Doopa (Thirst) recently.
.
విడివిడిగానే…
పరిమళపు వాయనాలిప్పించే
పిల్లగాలి సడి లేనపుడు
ఒకే కొమ్మకు పూసిన రెండు పువ్వులు కూడా
అందుకోలేని దూరాల్ని మోస్తాయి
ముడుపుగా మూడు ముళ్ళేసిన దారానికి
జతకూడని ఆలోచనల్ని మోస్తున్న
రెండు విడివిడి బిళ్ళల్లా .
ఆకాశం దుప్పటి కింద
అటూ ఇటూ పడుకునే చీకటి వెలుగుల్లా
అవసరాల దారాలు కటికముడి పడనపుడు
నువ్వూ నేనూ
ఎప్పుడూ మట్రంగా విడిపోయిన
రెండు సగాలే
నువ్వూ నేనూ ఒకే రంగు నుంచి వచ్చినా
కాలం మనిద్దరిని కలిపి కుట్టే చరిత్ర బొంతలో
ఎవరి గుడ్డపేలిక రంగు వారికే ఉంటుంది
పుట్టుకతోనే విడిపోయిన ఈ ప్రపంచాన్ని
ఉత్తుత్తిగా కలిపినట్టుంచే ఊహా అక్షాంశ రేఖాంశాల్లా
విడివిడిగానే
కలిసి భూమితో తిరుగుదాం.
.
Ravi Verelly
ఆ చలికాలపు ఆదివారాలు… రాబర్ట్ హేడెన్, అమెరికను
ఆదివారాలు కూడా మా నాయన పొద్దున్నే లేచే వాడు
లేచి ఆ చీకటిలో చలిలో బట్టలుతొడుక్కుని, వారం అల్లా
ఎండనక వాననక చేసినశ్రమకి పగుళ్ళుబారిన చేత్తోనే,
నిద్రపోతున్న నిప్పుల్ని మేల్కొలిపి భగభగమండేలా చేసేవాడు.
అతనికెవరూ ఎన్నడూ కృతజ్ఞతలు చెప్పుకోలేదు.
చలి విరిగుతున్న చప్పుడుకి నేను మేల్కొనేవాడిని;
గదులు వేడేక్కుతుంటే నన్ను పిలిచేవాడు మా నాయన.
అప్పుడు నెమ్మదిగా లేచి, బట్టలు వేసుకునే వాడిని.
ఎక్కడ అలవాటుకొద్దీ కోపంతో తిడతాడోనని భయపడుతూ .
చలిని అవతలకి పారదోలడమే కాదు
అప్పుడప్పుడు నా జోళ్ళుకూడా పాలిష్ చేసిన అతనితో
చాలా నిర్లక్ష్యంగా మాటాడేవాడిని. ఓహ్!
ఒంటరిగా నిరాడంబరంగా ప్రేమ చేసుకుంటూపోయే సేవల గురించి
నేనేం తెలుసుకున్నాను, తెలుసుకోగలిగేను?
.
రాబర్ట్ హేడెన్
4 August 1913 – 25 February 1980
అమెరికను.
మనలో చాలామందికి అనుభవమే… తల్లిదండ్రులు బ్రతికున్నంత కాలం వాళ్ల విలువా, వాళ్ళు మనకు చేసిన సేవల విలువా గుర్తించలేకపోవడం. వాళ్లని పోగొట్టుకున్నాకే మనకి క్రమంగా జ్ఞానోదయం అయేది. ఈ కవితలోని ఆర్ద్రత అంతా చివరిపాదాల్లోనే ఉంది. ప్రేమ ఒంటరిగా నిరాడంబరంగా ఏ ప్రతిఫలమూ కోరకుండా తనపని చేసుకుంటూ పోతుందని చెబుతూనే, తన అనుభవాన్నీ, తన అజ్ఞానాన్నీ నెమరువేసుకుంటూ, మనం కూడా కవితతో మమేకమయేలా చేస్తున్నాడు కవి.
.
Robert Hayden
.
Those Winter Sundays
.
Sundays too my father got up early
And put his clothes on in the blueback cold,
then with cracked hands that ached
from labor in the weekday weather made
banked fires blaze. No one ever thanked him.
I’d wake and hear the cold splintering, breaking.
When the rooms were warm, he’d call,
and slowly I would rise and dress,
fearing the chronic angers of that house,
Speaking indifferently to him,
who had driven out the cold
and polished my good shoes as well.
What did I know, what did I know
of love’s austere and lonely offices?
— Robert Hayden
4 August 1913 – 25 February 1980
American Poet
It is our common experience that we never realize the true value and the essence of efforts of our parents until after we have lost them forever. A heartfelt regret follows youth as insight develops with the passage of time. The beauty of the poem and the real pathos lies in the insistent reproach : “What did I know, what did I know/ of love’s austere and lonely offices. Such poems as these haunt us through our life.
Links:
Biography of Hayden: http://www.poets.org/poets/poets.cfm?prmID=200
Poem Courtesy: http://wonderingminstrels.blogspot.in/
జీవితపు పూరేకులు మాడిపోయాయి… ఎల్సీ పంపెలీ కేబో, అమెరికను
రాలి, నలిగి, ధూళిలో కలిసిపోయిన గులాబిలా
జీవితపు పూరేకులుకూడా మాడిపోయాయి
గతకాలపు జ్ఞాపకాలు దగ్ధమైపోయాయి,
ఇక ఆ బూడిదను శాశ్వతంగా జల్లించవలసిందే
రేపటికోసం మొగ్గలను తెరిచే సూర్యకిరణాలకంటే అసాధారణంగా.
ఒకసారి నిర్మలినమైన ప్రేమ సమసిపోతే
దేవతలుకూడా దాన్ని తిరిగి రప్పించలేరు.
గతకాలపు జ్ఞాపకాలు దగ్ధమైపోయాయి,
ఇక ఆ బూడిదను శాశ్వతంగా జల్లించవలసిందే.
ఓ ఆశావహమైన రేపటి ప్రభాతమా!
గతకాలపు గులాబులే, అనంత జీవితకాలపు అవశేషాలు.
.
ఎల్సీ పంపెలీ కేబో
అమెరికను
.
.
Burnt are the petals of life
.
Burnt are the petals of life as a rose fallen and crumbled to dust.
Blackened the heart of the past is, ashes that must
Forever be sifted, more precious than sunbeams that open the budding to-morrow.
Once was a passion completed,—too perfect, the Gods have not broken to borrow—
Blackened the heart of the past is, ashes that must
Forever be sifted. O, loving to-morrow
The rose of the past is, Life—Eternity’s dust
.
(From Arizona and Other Poems)
Elsie Pumpelly Cabot
American
Poem Courtesy: http://www.gutenberg.org/files/2294/old/mpoet11.txt
An Anthology of Massachusetts Poets. Ed. William Stanley Braithwaite.
ఎప్పుడూ అన్యోన్యంగా ఉండండి… లారీ ఎస్. చెంగెజ్, అమెరికను
మీరు ఈ రోజులాగే సన్నిహితంగా, ఆనందంగా ఉండగలుగుతూనే
ఎవరికి వారు ఎదుగుతూ, కాలంతోపాటు మారగలిగే నిబ్బరం కలిగి ఉంటే
భార్యాభర్తలుగా మీరు అనురాగాన్ని ఒకరికొకరు పంచుకుంటూనే
ఇతరులతో ఆనందాన్ని పంచుకుందికి సమయం కేటాయించగలిగితే
చేతులో చెయ్యివేసుకుని ఇద్దరూ ఒకరిగా దాంపత్య జీవితాన్ని గడుపుతూనే
మీరు ఒకరి ఆశలనీ, కలలనూ రెండవవారు సాకారంచేసేలా సహకరించుకోగలిగితే
ఇద్దరూ ఎవరి మార్గంలో వాళ్ళు వెళ్లగలిగే సాహసాన్ని ప్రదర్శించగలిగితే
ఈ రోజు మీరు చవిచూస్తున్న సంభ్రమం మీ జీవితకాలం మిమ్మల్ని వెన్నంటి ఉంటుంది.
.
లారీ చెంగెజ్
.
.
Always Love Each Other
By Larry S. Chengges
If you can always be as close and happy as today,
Yet be secure enough to grow and change along the way.
If you keep for you alone your love as husband and wife,
Yet find the time to share your joy with others in your life.
If you can be as one and walk through marriage hand in hand,
Yet still support the goals and dreams that each of you have planned.
If you dare to always go your separate ways together,
Then all the wonder of today will stay with you forever.
మొత్తానికి అచ్చమైన ప్రేమ… డి. హెచ్. లారెన్స్, ఇంగ్లీషు కవి
తనలో తాను నిమగ్నమైపోయిన అందమైన యువకుడు
తనలో తాను నిమగ్నమైపోయిన అందమైన పిల్లని చూసి
ఎంతో పరవశించాడు.
తనలోతాను నిమగ్నమైపోయిన ఆ అందమైన పిల్ల
తనలోతాను నిమగ్నమైపోయిన,ఈ అందమైన ఈ యువకుడిని చూసి
ఎంతో పరవశించింది.
ఆ పరవశంలో ఇలా అనుకున్నాడు:
నాకంటే కూడా ఎక్కువగా ఆమె తనలో తాను నిమగ్నమై పోయింది.
చూడాలి. ఆమె ఏకాగ్రతని భంగం చేసి
ఆమె నా వంక చూసేలా చెయ్యగలనో లేదో.
ఆ పరవశంలో ఆమె కూడా ఇలా అనుకుంది:
నాకంటే కూడా ఎక్కువగా అతను తనలో తాను నిమగ్నమైపోయాడు.
చూడాలి. అతని ఏకాగ్రతని భగ్నం చేసి
తను నా వంక చూసేలా చెయ్యగలనో లేదో.
అలాగ ఇద్దరూ ఒకరినొకరు ఆరాథనగా చూసుకుంటూ
చివరికి
ఇద్దరూ కలవరంతోనే గడిపేరు. ఎందుకంటే
పరవశించడంలోనూ, స్వప్రయోజనమాశించడంలోనూ ఎవరూ తీసిపోలేదు.
.
డి. హెచ్. లారెన్స్
(11 September 1885 – 2 March 1930)
ఇంగ్లీషు కవీ, నవలాకారుడూ, వ్యాసకర్తా, నాటకకర్తా, సాహితీ విమర్శకుడూ, చిత్రకారుడూ
ఈ కవితలో సున్నితమైన వ్యంగ్యం ఉంది. ఈ కవితలోని యువతీ యువకులిద్దరూ ఒకరి అందాన్ని ఒకరు గుర్తించి ఆనందించడానికి బదులు, తమ అందం అవతలి వాళ్ళని ఎంతమేరకు లోబరచుకోగలుగుతుందో అంచనా వేసే ఆలోచనలో నిమగ్నమై ఉన్నారు. అందుకనే వాళ్ళు Restless గా మిగిలిపోయారు. అదే ఒకరి అందాన్ని ఒకరు ఆశ్వాదించగల మానసిక ప్రవృత్తిలో ఉండిఉంటే, ఇద్దరూ సుఖంగా ఉండగలిగే వాళ్ళేమో.
ప్రేమించడంకన్నా, ప్రేమిస్తున్నామన్న భ్రమలో చాలామంది గడుపుతారు. అంతర్లీనంగా తమ ప్రేమ లక్ష్యం అవతలివ్యక్తి కాకుండా, తామే అవడంలోనే ఈ అసంతృప్తికి కారణమవుతుందేమో. దీనినే కవి అచ్చమైన ప్రేమ అన్న మాట ద్వారా ఆక్షేపించదలుచుకున్నాడేమో.
.
