కరుణ … నే ఓ మీ షిహాబ్ నై … పాలస్తీనియన్ అమెరికన్ కవయిత్రి

నీకు నిజంగా కరుణ అంటే ఏమిటో తెలియాలంటే

ముందు నీకున్న సమస్తవస్తువుల్నీ కోల్పోవాలి;

వారాంతంలో తయారు చేసుకునే వంటకంలో ఉప్పు కరిగినట్టు

భవిష్యత్తు ఒక్క క్షణంలో కరిగిపోవడం అనుభూతమవాలి;

ప్రస్తుతం నీ స్వాధీనంలో ఉన్నదీ,

విలువైనదని తలచి జాగ్రత్తగా కూర్చుకున్నదీ

అవన్నీ పోగొట్టుకోవాలి రెండు కరుణార్ద్ర సంఘటనలమధ్య

నిరామయ జీవనదృశ్యం అర్థం అవడానికి…

నువ్వు ఎక్కిన బస్సు ఆగకుండా

అలా వెళుతూనే ఉంటుందని అనుకుంటావు

ప్రయాణీకులు దొరికిన చిరుతిళ్ళు తింటూ

కిటికీలోంచి ప్రకృతిని గమనిస్తుంటారు.

సున్నితమైన కారుణ్య ప్రభావం అర్థం చేసుకుందికి

రోడ్డువార తలదూర్చి తొడుక్కునే తెల్లని స్వెట్టరుతోనే

చచ్చిపడున్న అమెరికను ఇండియనుని చూడాలి.

అపుడు తెలుస్తుంది: ఆ స్థానంలో నువ్వు ఉండి ఉండొచ్చనీ,

నీ లాగే అతనూ వెలుగుచొరని బాటలలో నడిచి వచ్చేడనీ,

భవిష్యత్ప్రణాళికలూ, చిరుశ్వాశా అతన్నిప్పటిదాకా  నిలబెట్టేయనీ.

కరుణ ఎంతగాఢంగా లోతుగా ఉంటుందో

నీకు అర్థమవడానికి ముందు  

విషాదమనేదొకటి అంతే గాఢంగా,

లోతుగా ఉంటుదని నీకు తెలియాలి; 

నువ్వు విషాదంతో నిదురలేవాలి;

నువ్వు దానితోనే సంభాషించాలి

పడుగు పేకలా అల్లుకున్న విషాదవస్త్రపు

అన్నిపోగుల్నీ నీ గొంతు తడిమగలిగేదాకా. 

  

కేవలం అప్పుడే నీకు అవగాహన అవుతుంది

కరుణ ఒక్కటే అర్థవంతమైనదని;

కరుణ ఒక్కటే నీ కాలి జోళ్ళ లేసులు బిగించి

విశాలమైన భవిష్యత్తులోకి నడిపిస్తుందని;

నువ్వు ఉత్తరాలు పంపాలన్నా, రొట్టెకొనాలన్నా

ఈ పరీవ్యాప్త జనప్రవాహంలో తలపైకెత్తి చూసి,

‘నువ్వు వెతుకుతున్నది నన్నే’ అని పలకరించి

ఒక నీడలా,  ఒక ఆత్మీయ స్నేహితుడిలా

నీ వెనకే ఎక్కడకి పడితే అక్కడికి

నిన్ననుసరించేది ఒక్క కరుణ మాత్రమే.

.

నే ఓ మీ షిహాబ్ నై

(born March 12, 1952)

పాలస్తీనియన్- అమెరికన్ కవయిత్రి

భవభూతి వ్రాసిన ‘ఉత్తరరామచరితం’ గురించి చెబుతూ, పండితులు ఏకో రసః కరుణ ఏవ అని తరచుగా ప్రస్తావిస్తుంటారు. అంటే, ప్రపంచంలో ఉన్నదంతా ఒక్క కరుణ రసమేననీ, దాని తీవ్రతలూ, వ్యగ్రతలవల్ల వచ్చే గుణదోషాలవల్ల మిగతా రసాలన్నీ, కరుణరస రస సంభూతాలనీ అంటారు. నిజానికి మనం ప్రకృతినుండీ ఎందరో జ్ఞాత, అజ్ఞాత వ్యక్తుల అవ్యాజమైన కరుణ కారణంగానే మనుగడ సాగిస్తున్నా, దాన్ని గ్రహించలేక, అలా వాళ్ల కరుణని పొందటం తెలియకుండానే అలవాటుపడిపోవడంతో, దాని విలువా, ఇతరులకి అందించవలసిన ఆవశ్యకతా గుర్తించలేకపోతున్నాం.

ద్యుమణి పద్మాకరము వికచముగజేయు,

కుముదహర్షంబుగావించు నమృతసూతి,

అర్థితుడుగాక జలమిచ్చునంబుధరుడు,

సజ్జనులు తారె పరహితాచరణమతులు…

అని చిన్నప్పుడు చదివిన పద్యం గుర్తొస్తోంది. ఇలాగ ప్రకృతిలో చాలా వస్తువులున్నై మనం అడక్కుండానే మనకు సాయం చేసేవి.  


అయితే, మనం కష్టాలలో ఉన్నప్పుడు దీని అవసరం, విలువా తెలిసి వస్తాయి. దీన్నే కవయిత్రి ఈ కవితలో చెప్పింది.

Naomi Shihab Nye
Naomi Shihab Nye (Photo credit: Wikipedia)

.

Kindness
.

Before you know what kindness really is
you must lose things,
feel the future dissolve in a moment
like salt in a weakened broth.
What you held in your hand,
what you counted and carefully saved,
all this must go so you know
how desolate the landscape can be
between the regions of kindness.
How you ride and ride
thinking the bus will never stop,
the passengers eating maize and chicken
will stare out the window forever.

Before you learn the tender gravity of kindness,
you must travel where the Indian in a white poncho
lies dead by the side of the road.
You must see how this could be you,
how he too was someone
who journeyed through the night with plans
and the simple breath that kept him alive.

Before you know kindness as the deepest thing inside,
you must know sorrow as the other deepest thing.
You must wake up with sorrow.
You must speak to it till your voice
catches the thread of all sorrows
and you see the size of the cloth.

Then it is only kindness that makes sense anymore,
only kindness that ties your shoes
and sends you out into the day to mail letters and purchase bread,
only kindness that raises its head
from the crowd of the world to say
 It is I you have been looking for,
and then goes with you everywhere
like a shadow or a friend.

.

Naomi Shihab Nye

(born March 12, 1952)

Palestinian-American Poet, Song Writer and Novelist.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: