అనువాదలహరి

పిల్లలు…. HW లాంగ్ ఫెలో, అమెరికను కవి

ఇదిగో పిల్లలూ! నా దగ్గరకి ఇలా రండి,

మీరు ఆడుకుంటున్నారని నాకు తెలుస్తోంది,

నన్నెప్పటినుండో వేధిస్తున్న సమస్యలు

అన్నీ వాటంతట అవే మాయమయిపోయాయి.

 

మీరు సూర్యుడి దిక్కు చూస్తున్న

తూరుపు కిటికీలు తెరిచేరు

ఆలోచనలు పిచ్చుకలై కిచకిచమంటున్నై

వెలుగు వాగులై ప్రవహిస్తోంది.

 

 మీ మనసులే పిట్టలూ, వెలుతురూ

 మీ ఆలోచనలలో పిల్లవాగులు పరుగిడతై;

 నా మనసులో మాత్రం ఆకులురాల్చే వడిగాలి

 తొలి హిమపాతం చూసిన హేమంతం.

 

 అమ్మో! అసలు ఈ పిల్లలే గనకలేకుంటే

 ఈ ప్రపంచంతో మనకి పనేమిటి?

 మన ముందున్న చీకటి కంటే ఎక్కువగా

 వెనుకనున్న ఎడారికి భయపడాలి మనం 

 

 గాలీ వెలుతురునుండి ఆహారం

 తయారుచేసుకుని, ఆ తీయని జీవరసాలు

 కాండమై గట్టిపడడానికి

 అడవిలోని చెట్లకు ఆకులెలాగో

 

 ప్రపంచానికి పిల్లలూ అలాగే;

 ఉజ్జ్వలమైన పర్యావరణపు మిలమిలలు

 దిగువ వాటి మొదళ్ళకు చేరినదానికంటే

 ఆకులద్వారానే చెట్లు ఎక్కువ అనుభూతిస్తాయి

 

 ఇదిగో పిల్లలూ! నా దగ్గరకి ఇలా రండి,

 మీ దివ్యమైన ప్రపంచంలో పులుగులూ,

 పిల్లగాలులూ ఏ సంగీతం వినిపిస్తున్నాయో  

 ఏదీ, ఒక్క సారి నా చెవిలో ఊదండి.  

 

 మీ చూపులలో తొణికిసలాడే సంతోషంతోనూ  

 మీ చేతుల మురిపాలతో పోలిస్తే

 మా పుస్తక పరిజ్ఞానమెంత?

 మా శక్తియుక్తులు ఏపాటివని?

 

 ఇంతవరకూ వ్రాయబడిన, పాడబడిన

 అన్ని నృత్తగీతాదులకంటే మీరు గొప్పవారు;

 జీవంతో తొణికిసలాడే సిసలైన కావ్యాలు మీరు

 తక్కినదంతా… అచేతనమైన జడపదార్థమే.  

 .

 HW లాంగ్ ఫెలో

(February 27, 1807 – March 24, 1882) 

అమెరికను కవి

 .

 

Henry Wadsworth Longfellow
Henry Wadsworth Longfellow (Photo credit: Wikipedia)

.

Come to me, O ye children!
For I hear you at your play,
And the questions that perplexed me
Have vanished quite away.

Ye open the eastern windows,
That look towards the sun,
Where thoughts are singing swallows
And the brooks of morning run.

In your hearts are the birds and the sunshine,
In your thoughts the brooklet’s flow,
But in mine is the wind of Autumn
And the first fall of the snow.

Ah! what would the world be to us
If the children were no more?
We should dread the desert behind us
Worse than the dark before.

What the leaves are to the forest,
With light and air for food,
Ere their sweet and tender juices
Have been hardened into wood, –

That to the world are children;
Through them it feels the glow
Of a brighter and sunnier climate
Than reaches the trunks below.

Come to me, O ye children!
And whisper in my ear
What the birds and the winds are singing
In your sunny atmosphere.

For what are all our contrivings,
And the wisdom of our books,
When compared with your caresses,
And the gladness of your looks?

Ye are better than all the ballads
That ever were sung or said;
For ye are living poems,
And all the rest are dead.
.

HW Longfellow

(February 27, 1807 – March 24, 1882)

American Poet

%d bloggers like this: