రోజు: మే 21, 2013
-
పాళా ఐస్ క్రీం … శ్రీ మోహన్ కృష్ణన్, మలయాళం, ఇండియా
Watch the poem in video here. ఇదిగో నా చిన్ని పలకా, నా బంగారు బలపమా! రేపు తెల్లారేలోగా గనక మీరీ లెక్కలన్నీ చేసేసేరనుకో మీ ఇద్దరికీ పాళా ఐస్ క్రీం కొనిపెడతా, వన్ బై టూ కాదు, చెరొకటీ. కానీ లెక్కలుగనక తప్పుచేసేరో, ఇదిగో పలకా, నిన్ను విసిరి ముక్కలు చేస్తాను, బలపమా, నిన్నూ అంతే, పొడిచి పోగుబెడతా. నాకు లెక్కలు చెయ్యడం చాతగాకనో లేక నిద్రముంచుకోస్తోందనో అడగడం లేదు ఈ ప్లేట్లన్నీ ఇపుడు…