జెన్నీ నన్ను ముద్దుపెట్టుకుంది … జేమ్స్ లే హంట్, ఇంగ్లండు

వాళ్ళింటికెళ్ళినపుడు, తనుకూర్చున్న కుర్చీలోంచి

ఒక్కసారి ఉరికి మరీ, జెన్నీ నన్ను ముద్దుపెట్టుకుంది;

కాలమా! దొంగదానా! నీ చిఠాలోకి మంచివన్నీ

రాసి దాచుకుంటావుగదా! దీన్ని కూడా రాసుకో! ఫో!

నేను జీవితంలో అలిసిపోయాననో, దుఃఖంతో ఉన్నాననో

ఆరోగ్యం బాగులేదనీ, డబ్బులేనివాడిననీ, ఒకటేమిటి

ముసిలాడినయిపోతున్నాననీ, ఎన్నైనా రాసుకో.

వాటితో పాటే, ఇదికూడా రాయడం మరిచిపోకు:

జెన్నీ నన్ను ముద్దుపెట్టుకుంది.

.

జేమ్స్ లే హంట్,

(19 October 1784 – 28 August 1859),

ఇంగ్లండు.

 లే హంట్ పేరు చెప్పగానే, “ఏబూ బెన్ ఏడం” కవిత వెంటనే గుర్తుకొస్తుంది. ఇంగ్లీషు సాహిత్యంలో అంత పేరుపడ్డ కవిత. దానితో పాటే, ఈ కవిత కూడా అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఒకసారి అతనికి “ఇన్ ఫ్లూయెంజా జ్వరం” తగిలి  చికాకు చేసి, బాగా కుదుటపడ్డాక, ఆ విషయం చెబుదామని అతని మిత్రుడు థామస్ కార్లైల్ ఇంటికి వెళ్ళినపుడు, అతని భార్య (జేన్ వెల్ష్ కార్లైల్) ఎప్పుడూ లేనిది తన కుర్చీలోంచి లేచి వచ్చి అతన్ని ముద్దుపెట్టుకుందిట. ఇక్కడ ఒక విషయం గమనించాలి. పరపురుషుడిని ముద్దుపెట్టుకోవడంలో ఆ సమాజంలో వాళ్లకి అభిమాన ప్రకటనే తప్ప వేరే ఆలోచనలు ఉండవు. వాళ్ళు తమకి ఒక అనుభూతి కలిగినపుడు దాన్ని ప్రకటించడంలో Inhibition చూపరు.  అయితే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసినది, కవి కూడా ఆ సంఘటనకి ఆశ్చర్యపోవడమే కాదు, అది ఒక అపూర్వ సంఘటనగా తీసుకున్నాడు. దాన్ని తన జీవితంలో ఒక ముఖ్యమైన అంశంగా భావించాడు. మనలో కూడ సచిన్ తో ఒకే విమానంలో ప్రయాణం చేశామనీ, బిల్ క్లింటన్ తో షేక్ హేండ్ చేశామనీ చెప్పుకోరా. అలాటిదే ఈ సంఘటన కూడా.  దీన్ని మరింత తాత్త్విక స్థాయికి పెంచుతూ, మన జీవితాలలో ఎన్ని చీకటి పార్శ్వాలున్నా, జాగ్రత్తగా గమనిస్తే మనకి కొన్ని మధురక్షణాలు కూడా ఉండకపోవనే సందేశం కూడా ఇందులో ఉంది.

.

Leigh Hunt (1784-1859), an English essayist an...

 

.

Jenny Kissed Me

.

Jenny kiss’d me when we met,
Jumping from the chair she sat in;
Time, you thief, who love to get
Sweets into your list, put that in!
Say I’m weary, say I’m sad,
Say that health and wealth have miss’d me,
Say I’m growing old, but add,
Jenny kiss’d me.

James Leigh Hunt 

(19 October 1784 – 28 August 1859),

English Poet, Critic, Essayist and writer.

Note: The Jenny in question was Jane Welsh Carlyle, wife of Thomas Carlyle. Hunt had  just recovered from an extended battle with influenza, and when he went to tell the Carlyles  the news, Jenny (in a very  uncharacteristic  move) leaped up and kissed him.

For interesting sidelights about the poem please visit:
http://wonderingminstrels.blogspot.in/1999/05/jenny-kissed-me-james-leigh-hunt.html

“జెన్నీ నన్ను ముద్దుపెట్టుకుంది … జేమ్స్ లే హంట్, ఇంగ్లండు” కి 2 స్పందనలు

    1. Thank you Phanindra garu.
      with best regards

      మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: