ఏదీ శాశ్వతం కాదు… సిసిలీ హెర్బర్ట్, ఇంగ్లండు

.

ప్రతీదీ మార్పుకులోనౌతుంది.

మనం భవిష్యత్తరాలకోసం చెట్లు నాటుతాం.

సరే, జరిగిందేదో జరిగిపోయింది,

సముద్రాల్లోకి ఒలకపోసిన విషాల్ని

తిరిగి బయటకి తోడి పారబొయ్యలేము.

.

జరిగిందేదో జరిగిపోయింది.

సముద్రాల్లోకి ఒలకపోసిన విషాల్ని

తిరిగి బయటకి తోడి పారబొయ్యలేము,

అయినా, అన్నీ మార్పుకిలోనౌతాయి

మనం భవిష్యత్తరాలకోసం చెట్లు నాటుదాం.

.

సిసిలీ హెర్బర్ట్

ఇంగ్లండు

ఈ కవితలోని సౌందర్యం, అనులోమంలోనూ విలోమంలోనూ ఒకే రకమైన మాటలు ఉపయోగించి, ఒక సారి  నిరాశా నిస్పృహలు సూచిస్తే, రెండవ సారి ఆశావహమైన దృక్పథాన్ని ప్రకటించడం. ఈ కవితకి ప్రేరణ జర్మను కవి Bertolt Brecht కవిత. అతను తన కవితని తన రాజకీయ పరిస్థితుల నేపథ్యంతో వ్రాస్తే, సిసిలీ హెర్బర్ట్ పర్యావరణం నేపథ్యంలో వ్రాసింది. అయితే, ఈ కవిత చాలా సందర్భాలకు అనువర్తిస్తుంది. సముద్రంలో ఒలకపోసిన విషాలు అన్నది ఒక ప్రతీకగా తీసుకుంటే, దాన్ని మనుషుల మధ్య రాజకీయ ప్రయోజనాలకోసం కొంతమంది రగిల్చే చిచ్చుని ఊహించుకోవచ్చు. మనం చెయ్యవలసిందల్లా, మనుషుల మధ్య మళ్ళీ మంచిదనం, మానవీయత అనే చెట్లు నాటడం… మనకోసం కాదు, మన భవిష్యత్తరాలకోసం.

.

After, Brecht ‘Alles wandelt sich’

(Everything Changes )

.

Everything changes. We plant
trees for those born later
but what’s happened has happened,
and poisons poured into the seas
cannot be drained out again.

What’s happened has happened
poisons poured into the seas
cannot be drained out again, but
everything changes. We plant
trees for those born later.

Cicely Herbert

British Poet

The following bio courtesy:

http://wonderingminstrels.blogspot.in under the present poem :

“Cicely Herbert is a writer, a member of the Barrow Poets, and an adult education teacher. She has written several performance pieces with music by Jim Parker. These include, for BBC TW, “Petticoat Lane”, and two concert pieces commissioned by the Nash Ensemble, “Scenes from Victorian London” and “La Comedie Humaine”. Her poetry includes “In Hospital”, 1992.”

— “Poems on the Underground (print anthology)”

This poem was inspired by  German poet Bertolt Brecht’s Alles wandelt sich (Everything Changes) written in 1940’s in USA during his exile. The English translation of which is as follows:

Everything changes. You can make
A fresh start with your final breath.
But what has happened has happened. And the water
You once poured into the wine cannot be
Drained off again.

What has happened has happened. The water
You once poured into the wine cannot be
Drained off again, but
Everything changes. You can make
A fresh start with your final breath.

(The translator acknowledges his indebtedness for the Brecht’s translation to:

http://brintmadrid.blogspot.in/2008/10/everything-changes.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: