నేను ఒంటరిగా నిద్రించే
ఏకాకిని కాను…
నేను భయపడతానని అనుకున్నావు
ఏంలేదు, నేనిపుడు పెద్ద పిల్లనయ్యాను
నేనిప్పుడు ఏడవటం
లాంటివి ఏవీ చెయ్యడం లేదు.
నాకిప్పుడు చాలా పెద్ద మంచం ఉంది
దాని మీద సరిపడా జాగా ఉంది
విశాలంగా ఎటుపడితే అటు దొర్లవచ్చు;
ఇకమీదట…
పూర్వం నువ్వు నన్ను
విడిచిపెట్టి వెళ్ళినట్టు వచ్చినలాంటి
పీడకలలు మరి రావు
నువ్వింక నన్ను వదిలి
వెళ్ళిపోయేవు కనుక
నాకు కలలే రావు.
నువ్వేమనుకున్నా సరే
నేను ఒంటరిగా నిద్రించే
ఏకాకిని కాను.
.
నికి జియొవాని,
(born June 7, 1943)
అమెరికను
.
ఈ కవితలోని నాకు నచ్చినది ఏ నేరారోపణలూ లేకుండా, తను భయపడినదంతా జరిగినదని చెబుతూనే, దాన్ని తట్టుకోగల మానసిక తనకి ఉందని వివరిస్తూ, ఎడబాటుని రొమాంటిసైజ్ చెయ్యకుండా చాలా సెదాసద్దా మటలలోనే, ఎంతో గంభీరమైన అనుభూతిని చెప్పడం.


.
I’m not Lonely
.
I’m not lonely
Sleeping all alone
You think I’m scared
But I’m a big girl
I don’t cry
Or anything
I have a great big bed
To roll around
In and lots of space
And i don’t dream
Bad dreams
Like I used
To have that you
Were leaving me
Anymore
Now that you’re gone
I don’t dream
And no matter
What you think
I’m not lonely
Sleeping
All alone
.
Nikki Giovanni
(born June 7, 1943)
American
She is currently a distinguished professor of English at Virginia Tech
Poem Courtesy: http://wonderingminstrels.blogspot.in/2004/09/i-not-lonely-nikki-giovanni.html
స్పందించండి