అనువాదలహరి

నిర్లక్ష్యానికి నివేదన… ఫేనీ గ్రెవిల్,ఇంగ్లండు

నా ప్రేమకి ప్రతిగా ప్రేమని కోరను,

ఆకర్షించడానికి ఏ అందాలూ కోరను;

ప్రశాంతతకోసం, సుఖంకోసం నిట్టూర్చే    

మనసునుండి అవి దూరంగా తొలగిస్తే చాలు. 

మనసుకి సుఖమూ శాంతీ రెండూ తెలీవు,

అది ఒక వాడి సూది మొనలాగ

ఆనందమూ, విషాదమూ స్పర్శిస్తే చాలు స్పందిస్తుంది,

స్పందిస్తూ, భయపడుతుంది కూడా.

దుఃఖాలు మనసుకి గాయం చెయ్యడం మాటకి వస్తే

అది ఎప్పుడూ బాధే, తప్పితే, అవస్థలోనే తేడా;

సుఖాల విషయానికి వస్తే, ఎప్పుడూ హద్దులే;

హద్దుదాటితే, తీరని వేదనే.

.

ఫేనీ గ్రెవిల్

ఇంగ్లండు

.

.

Prayer for Indifference

.

I ask no kind return of love,
No tempting charm to please;
Far from the heart those gifts remove,
That sighs for peace and ease.

Nor peace nor ease the heart can know,
That, like the needle true,
Turns at the touch of joy or woe,
But turning, trembles too.

Far as distress the soul can wound,
‘Tis pain in each degree:
‘Tis bliss but to a certain bound,
Beyond is agony.
.
Fanny Greville.
English
18th Cent
Poem Courtesy: Arthur Quiller-Couch, ed. 1919. The Oxford Book of English Verse: 1250–1900

%d bloggers like this: