చరమశ్లోకం … జేమ్స్ బీటీ, స్కాటిష్ కవి.
నీలాగే ఒకప్పుడు జీవనసాగరాన్ని ఈదేను,
నీలాగే నిరర్థకమైన సుఖాలకై ప్రాకులాడేను
నీలాగే జీవితపు పెను తుఫానులో శ్రమించేను
స్వల్ప విషయాలకు బాధపడి, ఆటబొమ్మలకు ఆనందించేను.
నా బలహీనతలు మరిచిపో; నీకూ బలహీనతలున్నాయి;
నా పొరపాట్లు మన్నించు; నువ్వూ పొరపాట్లు చెయ్యకపోవు;
ఏ సొగసులూలేని నా దీనగాథ విని నిర్వికారంగా ఉండకు.
ఓ మనిషీ! నీకూ, మీ కందరికీ నేను స్నేహితుడినే.
.
జేమ్స్ బీటీ,
(25 అక్టోబర్ 1735 – 18 ఆగష్టు 1803)
స్కాటిష్ కవీ, తత్త్వవేత్త.
.

Image Courtesy: http://en.wikipedia.org/wiki/File:Dr_James_Beattie.jpg