చల్లగా మట్టిలో కలిసిపోయినపుడు … థామస్ మూర్

నువ్వు ప్రేమించిన మిత్రుడు చల్లగా మట్టిలో కలిసిపోయినపుడు

అతని తప్పిదాలూ, తెలివితక్కువ పనులన్నీ నువ్వు మరిచిపో.

పొరపాటున జ్ఞాపకాల ముసుగుతీసుకుని బయటికి వచ్చినప్పుడు

ఒక సారి వాటికై వగచి ఎప్పటిలాగే మరిచిపోడానికి ప్రయత్నించు.

హా! బలహీనతలకులోనై అతను ఎంత పక్కతోవలు పట్టేవాడోగుర్తొచ్చి

మనసుకలచివేసినపుడు,అతని చీకటి ప్రస్థానంలో ఎంత మసకదైనా

ఎంతచిన్నదైనా, అతని చీకటితోవలోవెలుగు చూపి

మార్గం మళ్ళించిన రేచుక్కవి నువ్వు కావడం గుర్తుచేసుకుని ఆనందించు.

నీ నుండీ, నీ నిర్మలమైన అమాయకత్వంలోంచీ మొదటిసారిగా

ఆరాధించతగిన నిజమైన ప్రేమతత్త్వం ఏమిటో అతనికవగాహన అయింది.

దాని దివ్యమైన ఉనికిని గుర్తించగలగడమేగాక,అప్పటివరకూ విగ్రహాలకి

తనుతెలివితక్కువగా మోకరిల్లినందుకు సిగ్గుపడేలా చేసింది.

జీవితపుటలలపై అలజడి చాలాకాలం పెత్తనం చలాయించింది,

నువ్వొక వచ్చావు… సముద్రం మీద ఒక ప్రశాంతమైఅ కమ్మతెమ్మెరలా;

అతని జీవన సంధ్యా సమయంలో చింతలులేని సంతోషంతో

మెరిసిందంటే, ఆ వెలుగులు ప్రసరించింది నీదగ్గరనుండే.

ఒకోసారి అతని పాట తెలివితక్కుదనము మళ్ళీ తలలెత్తినా,

కపటత్వం తప్పుతోవలో వెళ్ళడానికి ఉసికొలిపి రేపెట్టినా

అతను మళ్ళీ మార్గదర్శనానికి తేరి చూసింది ఆ కళ్ళవెలుగుకే

అంతే, ఆ కపటత్వమూ, ఆ తెలివితక్కువదనమూ పటాపంచలయేవి.


సూర్యారాధకుల పూజామందిరం చీకటైనప్పుడల్లా

అక్కడి కాంతివిహీనతని సూర్యకిరణం ఒక్కటే ఎలా పోగొట్టగలదో

అలాగే, ఒక్క క్షణ కాలం అతనిలో సుగుణం మందగించినపుడు

దాన్ని తిరిగి రగిల్చగలిగిన చిరునవ్వుకోసమే పరిగెత్తేవాడు.

 .

థామస్ మూర్

(28 May 1779 – 25 February 1852)

ఐరిష్ కవి

.

English: Thomas Moore (1779-1852) enamel on co...
English: Thomas Moore (1779-1852) enamel on copper 19th century 60mm high (Photo credit: Wikipedia)

When Cold in the Earth

.

When cold in the earth lies the friend thou hast loved,

Be his faults and his follies forgot by thee then;

Or, if from their slumber the veil be removed,

Weep o’er them in silence, and close it again.

And oh! if ’tis pain to remember how far

From the pathways of light he was tempted to roam,

Be it bliss to remember that thou wert the star

That arose on his darkness, and guided him home.

From thee and thy innocent beauty first came

The revealings, that taught him true love to adore,

To feel the bright presence, and turn him with shame

From the idols he blindly had knelt to before.

O’er the waves of a life, long benighted and wild,

 Thou camest, like a soft golden calm o’er the sea;

 And if happiness purely and glowingly smiled

 On his evening horizon, the light was from thee.

And though sometimes the shades of past folly might rise,

And though falsehood again would allure him to stray,

He but turn’d to the glory that dwelt in those eyes,

 And the folly, the falsehood, soon vanish’d away.

As the Priests of the Sun, when their altar grew dim,

 At the day-beam alone could its lustre repair,

 So, if virtue a moment grew languid in him,

 He but flew to that smile and rekindled it there.

.

Thomas Moore

(28 May 1779 – 25 February 1852) 

Irish Poet

“చల్లగా మట్టిలో కలిసిపోయినపుడు … థామస్ మూర్” కి 2 స్పందనలు

  1. అనువాదం చక్కగా అమరింది.కీర్తిశేషుల తప్పులు ఇప్పుడు తీరికూ ర్చుని లెక్కించ బూనడం నిజంగా బ్యాడ్ టేస్ట్ !

    మెచ్చుకోండి

    1. సూర్యప్రకాష్ గారూ,

      మనకి ఒక నీతి సూత్రం ఉంది. మరణాంతే వైరం… అని. మనశత్రువు మరణిస్తే, అతనితో వైరం ఆ క్షణంతో ముగుస్తుంది. ముగించాలి. అతను చేసిన తప్పిదాలనీ మన్నించి మరిచిపోవాలి. అలాంటిది ఒక మిత్రుడి విషయంలో వేరే చెప్పనక్కర లేదు. మీకు నచ్చినందుకు కృతజ్ఞతలు.
      అభివాదములతో

      మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: