రోజు: మే 8, 2013
-
చల్లగా మట్టిలో కలిసిపోయినపుడు … థామస్ మూర్
నువ్వు ప్రేమించిన మిత్రుడు చల్లగా మట్టిలో కలిసిపోయినపుడు అతని తప్పిదాలూ, తెలివితక్కువ పనులన్నీ నువ్వు మరిచిపో. పొరపాటున జ్ఞాపకాల ముసుగుతీసుకుని బయటికి వచ్చినప్పుడు ఒక సారి వాటికై వగచి ఎప్పటిలాగే మరిచిపోడానికి ప్రయత్నించు. హా! బలహీనతలకులోనై అతను ఎంత పక్కతోవలు పట్టేవాడోగుర్తొచ్చి మనసుకలచివేసినపుడు,అతని చీకటి ప్రస్థానంలో ఎంత మసకదైనా ఎంతచిన్నదైనా, అతని చీకటితోవలోవెలుగు చూపి మార్గం మళ్ళించిన రేచుక్కవి నువ్వు కావడం గుర్తుచేసుకుని ఆనందించు. నీ నుండీ, నీ నిర్మలమైన అమాయకత్వంలోంచీ మొదటిసారిగా ఆరాధించతగిన నిజమైన ప్రేమతత్త్వం…