చీమల పుట్ట … రాబర్ట్ విలియం సెర్విస్
మా పెరట్లో ఊదారంగు పైన్ చెట్టుక్రింద
నల్ల చీమలు ఒక పెద్ద పుట్ట పెట్టేయి,
చివికినట్టుండే ఆ పుట్టని గమనిస్తూ
తరచు నేను ఆశ్చర్యపోతూ ఉండేవాడిని.
నిరంతరం శ్రమిస్తూ అవి తిరగడం నాకు
చూడ్డానికి చాలా వింతగా అనిపించేది;
చూస్తున్నప్పుడు, వాటిలాగే శ్రమించే మనుషులని
గమనించే దేముడిలా నన్నునేను ఊహించుకునే వాడిని.
అలా ఉండగా ఒక రోజు మా పనిమనిషి వచ్చింది
సరిగ్గా సమయానికి ఆమె చేతులు పట్టుకున్నాను
గనక సరిపోయింది; ఎందుకంటే, బలిష్టమైన
రెండుచేతుల్లోనూ రెండు బాల్టీల మరుగునీళ్ళున్నాయి.
ఆమె నవ్వుతూ అంది: “ఈ నీళ్ళు పోసేనంటే
ఒక్క దెబ్బకి అవన్నీ చచ్చి ఊరుకుంటాయి.”
నేనన్నాను: “దొంగ ముం…! నువ్వు ఒక్క చీమని
ఏం చేసినా చూసుకో, నీ పని పడతాను.”
వేలకొద్దీ ప్రాణులు, అలా ఎంతో ఆత్రంగా
ఒకరి ఊసులేక, అలుపెరుగక శ్రమపడుతున్నాయి;
అవన్నీ వాటి ఇళ్ళూ, భార్యా పిల్లలతో సహా
ఒక్క దెబ్బకి నశించడమంటే, ఒకసారి ఆలోచించండి!
నిలువునా ఒళ్ళుకాల్చేసే ఆ నరకాన్ని ఊహించండి.
అది ఏదో విపరీతంగానూ, మరీ అసంబద్ధమైన
పోలికలా ఒకవేళ కనిపిస్తోందేమో; అయితే ఒక్కసారి
చరిత్ర గుర్తుకు తెచ్చుకొండి: హిరోషిమా .
.
రాబర్ట్ విలియం సెర్విస్

.
chala chaala baaga anuvadincharu. thanks
మెచ్చుకోండిమెచ్చుకోండి
Beautiful poems – original and its translation.
మెచ్చుకోండిమెచ్చుకోండి
రత్నశిఖామణి గారూ,
మీ ప్రోత్సాహకరమైన వ్యాఖ్యకి ధన్యవాదాలు.
అభివాదములతో
మెచ్చుకోండిమెచ్చుకోండి