రోజు: మే 6, 2013
-
చీమల పుట్ట … రాబర్ట్ విలియం సెర్విస్
మా పెరట్లో ఊదారంగు పైన్ చెట్టుక్రింద నల్ల చీమలు ఒక పెద్ద పుట్ట పెట్టేయి, చివికినట్టుండే ఆ పుట్టని గమనిస్తూ తరచు నేను ఆశ్చర్యపోతూ ఉండేవాడిని. నిరంతరం శ్రమిస్తూ అవి తిరగడం నాకు చూడ్డానికి చాలా వింతగా అనిపించేది; చూస్తున్నప్పుడు, వాటిలాగే శ్రమించే మనుషులని గమనించే దేముడిలా నన్నునేను ఊహించుకునే వాడిని. అలా ఉండగా ఒక రోజు మా పనిమనిషి వచ్చింది సరిగ్గా సమయానికి ఆమె చేతులు పట్టుకున్నాను గనక సరిపోయింది; ఎందుకంటే, బలిష్టమైన…