ఇద్దరు కవులెప్పుడైనా కలుసుకుంటే… హరీశ్ ఎడవన, మలయాళం
ఇద్దరు కవులెప్పుడైనా కలుసుకుంటే
వాళ్ల ఆత్మలు సమావేశాన్ని బహిష్కరిస్తాయి.
ఒకరికొకరు వీడ్కోలుచెప్పుకునేదాకా
వాళ్ల పద్యాలు విసుగుతో ఆవులిస్తూనే ఉంటాయి.
అక్షరాలు నిశ్శబ్దంగా ప్రార్థిస్తుంటాయి దేముడా
మమ్మల్ని ఈ హింసనుండి రక్షించమని.
పుకార్లకీ వ్యర్థప్రసంగాలకీ అధిదేవతలు
సైతానుని సంకీర్తనలతో స్తుతిస్తాయి.
ఇద్దరు కవులు ఎప్పుడైనా కలిస్తే
తమని తాము ఆకాశానికి ఎత్తేసుకుంటారు
పాపము శమించుగాక! ఒకచోట
ఇద్దరు కవులెన్నడూ కలవకుందురు గాక!
.
హరీశ్ ఎడవన
మలయాళం
.
