అనువాదలహరి

అపాచీల వైవాహిక మంగళాచరణం … ఏలియట్ ఆర్నాల్డ్, అమెరికను

ఇక మీ ఇద్దరికీ వర్షం భయం లేదు

ఎందుకంటే, ఒకరికొకరు ఆశ్రయంగా ఉంటారు;

ఇక మీకు భవిష్యత్తు గురించి చింతలేదు

ఎందుకంటే, ఒకరికొకరు సలహాలిచ్చుకుంటారు;

ఇక మీకు ఏ తీపులూ ఉండవు, ఎందుకంటే

మీరు ఒకరికొకరు ఉపశమనమిచ్చుకుంటారు;

ఇక మీకు రాత్రి గూర్చి దిగులు లేదు

ఎందుకంటే, ఒకరికొకరు వెలుగై ఉంటారు;

ఇక మీకు చలిగూర్చి వెరపు లేదు

ఎందుకంటే ఒకరికొకరు కవోష్ణమై ఉంటారు;

ఇక మీకు ఎన్నటికీ జడత్వమన్నది ఉండదు,

ఎందుకంటే మీ బాధలూ, ఆకాంక్షలూ చిత్తగించేయి;

ఇక  నేడూ, రేపూ, భవిష్యత్తంతా ఇలాగే ఉంటుంది

ఎందుకంటే, చిరకాలం ఒకరికొకరు మంచి తోడై ఉంటారు;

ఇక ఇప్పటినుండి మీ ఇద్దరికీ కాలం ఒకటే;

కాని అది ఎన్నడూ ఒంటరితనం కాదు;

ఇక మీరు ఎప్పటికీ ఇద్దరూ ఒక్కటే

పేరుకి మాత్రమే శరీరాలు రెండు, అంతే!

ఇక మీ ఇద్దరిలో కొట్టుకునేది ఒకటే గుండె 

వ్యకులుగా మీరిద్దరూ ఒక్కటిగా జీవించండి.

.

ఏలియట్ ఆర్నాల్డ్ 

(September 13, 1912 – May 13, 1980)

అమెరికను.

.

Elliot Arnold Image Courtesy: http://www.goodreads.com/author/show/230699.Elliott_Arnold
Elliot Arnold
Image Courtesy: http://www.goodreads.com/author/show/230699.Elliott_Arnold

.

Apache Wedding Prayer

.

Now for you there is no rain
For one is shelter to the other.

Now for you there is no darkness
For one is counsel to the other.

Now for you there is no pain
For one is comfort to the other.

Now for you there is no night
For one is light to the other.

Now for you there is no cold
For one is warmth to the other.

Now for you the snow has ended, always
Your fears, your wants, your needs are at rest.

It is that way today, tomorrow and forever.
Now it is good and there is always shelter.

And now there is always one.
And now there is no loneliness.

Now, forever, forever you are as one.
There are two bodies.

But now there is only one heart in both
And you are as one person.
.

(From ‘Blood Brother’… a novel )

Elliot Arnold

(September 13, 1912 – May 13, 1980)

American Newspaper Feature Writer, Novelist, and Screenwriter.

There is an interesting discussion about the doubtful origins of this poem .

 You may be interested to read interesting discussions on this matter here:

 http://marriage.about.com/cs/blessings/a/apache.htm http://boards.straightdope.com/sdmb/showthread.php?t=444140

Apache

%d bloggers like this: