అనువాదలహరి

సెయింట్ ప్రాన్సిస్ ప్రార్థన …ఫాదర్ బొకెరెల్, ఫ్రాన్సు (?)

ప్రభూ! నీ శాంతి సందేశానికి నన్నొక సాధనంగా నియోగించు;

ఎక్కడ ద్వేషం ప్రబలంగా ఉందో, అక్కడ నన్ను ప్రేమని విత్తనీ;

ఎక్కడ మదికి గాయమయిందో, అక్కడ క్షమనీ;

ఎక్కడ అనుమానం ఉందో అక్కడ నమ్మకాన్నీ;

ఎక్కడ నిరాశ మిక్కుటమై ఉందో అక్కడ ఆశనీ;

ఎక్కడ చీకటి ఉందో అక్కడ వెలుగునీ;

ఎక్కడ విషాదం ఉందో అక్కడ ఆనందాన్నీ నింపనీ.

నేను ఒకరి ఓదార్పుకై వగచే బదులు

ఒకరిని ఓదార్చగలిగేలా అనుగ్రహించు;

ఒకరు అర్థంచేసుకోడానికి బదులు

ఒకర్ని అర్థం చేసుకునేలానూ;

ఒకరి ప్రేమకోసం అర్రులుచాచడానికి బదులు

ఇతరుల్ని ప్రేమించగలిగేలానూ అనుగ్రహించు;

ఎందుకంటే, పరులకివ్వడంలోనే మేము పొందగలుగుతున్నాం;

ఒకర్ని క్షమించడంలోనే మేం క్షమని అందుకోగలుగుతున్నాం;

మరణంలోనే శాశ్వతత్వంలోకి పునర్జన్మిస్తున్నాం.
.

ఫాదర్ బొకెరెల్ (?)

ఫ్రాన్సు

(ఈ ఆకృతిలో కేథొలిక్ ప్రీస్టు ఫాదర్ బొకెరెల్ 1912లో వ్రాసి ఉండొచ్చు)

.

Prayer of St. Francis

Lord, make me an instrument of your peace;
where there is hatred, let me sow love;
when there is injury, pardon;
where there is doubt, faith;
where there is despair, hope;
where there is darkness, light;
and where there is sadness, joy.
Grant that I may not so much seek to be consoled as to console;
to be understood, as to understand,
to be loved as to love;
for it is in giving that we receive,
it is in pardoning that we are pardoned,
and it is in dying that we are born to eternal life.

.

Father Bouquerel (?)

France

(In this present form this might have been written by  Father Bouquerel and the actual french version was first published in 1912 AD in the French magazine La Clochette)

This prayer is attributed to St Francis of Assissi but it looks very controversial.

Read about it here: Prayer of St Francis

Here is an interesting information about it as well in a very recent post  in  Telegraph :

http://www.telegraph.co.uk/news/religion/9991301/The-real-prayer-of-Francis-of-Assisi.html

and

http://wahiduddin.net/saint_francis_of_assisi.htm

%d bloggers like this: