రోజు: ఏప్రిల్ 27, 2013
-
సానెట్ LXVII … ఛార్లెట్ స్మిత్, ఇంగ్లండు.
. ఆకాశంలో నల్లమబ్బులు ఎగిరెగిరి పడుతున్నాయి, కమ్ముకొస్తున్నతుఫానుకి నేల భయంతో వణుకుతున్నట్టుంది; కేవలం నాలాంటి ఏ దిక్కూలేని వాళ్ళం మాత్రమే రివ్వున వీస్తున్న ఈ రొజ్జగాలి తాకిడికి తలఒగ్గి ఉన్నాం; నలుచెరగులా కూలుతున్నగోడలకి వెరచి, ఆకలేస్తున్నా గుడ్లగూబ తన సాయంత్రపు తిండి వేట విరమించుకుంది; దట్టమైన చిట్టడవిలో గుంటనక్కొకటి గుహలో దాక్కుని ఈ రాత్రి తుఫానుబారి నుండి తన్నుతాను కాపాడుకుంటోంది; కాని, నేను విసర్జించిన ఈ ప్రపంచానికి నన్ను కనపడనీని ఈ చీకటి నా మనసుకి ఎంతో […]