అనువాదలహరి

తగువూ— వియోగమూ…యునిస్ టీచెన్, అమెరికను

.

బాధతో ఎర్రబారిన కళ్ళతో, వలలో చిక్కిన

జంతువులా నా వంక చూసేవు; తల తాటించేవు

అట్నుంచి ఇటూ ఇట్నుంచి అటూ, నీగొంతుకని బాధ 

కోపంతోనూ భయంతోనూ మెలిపెట్టిందేమోనన్నట్లు.

 .

అప్పుడు నువ్వు వెనుతిరిగి నన్ను వీడిపోయావు.

తెలీని నిశ్చేష్టత ఏదో నన్నావహించి అలా నిలబడ్డాను

నువ్వు తొడుక్కున్న వర్షపుకోటు గుండీలని సరిగ్గా

పెట్టుకుంటే బాగుండునని మనసులో అనుకున్నాను.

 .

నువ్వు వెళ్ళేదాకా అలా చూస్తూనే ఉన్నా. ఒక్కసారి

నా కడపటి మాటలు బెదురుతూ, గాలివాటులోకలిసిపోయాయి.

నా గుండె లోపల లోపల ఎక్కడో మెల్లగా, శాశ్వతంగా

ఒక తలుపుమూసుకున్న చిరు సవ్వడి వినిపించింది.

.

యునిస్ టీచెన్

(July 29, 1884 – September 6, 1944) 

అమెరికను

.

Eunice Tietjens Image Courtesy: http://www.poetryfoundation.org/bio/eunice-tietjens
Eunice Tietjens
Image Courtesy: http://www.poetryfoundation.org/bio/eunice-tietjens

.
Parting After a Quarrel
.

You looked at me with eyes grown bright with pain,
Like some trapped thing’s. And then you moved your head
Slowly from side to side, as though the strain
Ached in your throat with anger and with dread.

And then you turned and left me, and I stood
With a queer sense of deadness over me,
And only wondered dully that you could
Fasten your trench-coat up so carefully.

Till you were gone. Then all the air was quick
With my last words, that seemed to leap and quiver.
And in my heart I heard the little click
Of a door that closes—quietly, forever.

.

Eunice Tietjens,

(July 29, 1884 – September 6, 1944)

American Poet, Novelist, Journalist, Children’s Author, Lecturer, and Editor.

%d bloggers like this: