అనువాదలహరి

నే నేమీ కాను… ఎమిలీ డికిన్సన్, అమెరికను

నేనేమీ కాను…

నేనొక అనామికను. మరి నువ్వెవరు?

నువ్వు కూడా నాలాగే ఏమీ కావా?

అలాగైతే  మనమొక అనామకపు జంటమన్నమాట.

ఈ విషయం ఎవరికీ చెప్పకు. నీకు తెలీదు,

తెలిస్తే, వాళ్ళు మనల్ని వెలివేస్తారు.

.

ఏదో ఒకటవడం ఎంత నిస్సారంగా ఉంటుంది!

ఇది కప్ప అని పోల్చుకున్నట్టు,

జీవితాంతమూ, ఈ సారవంతమైన నేలలో

ఏదో ఒకపేరుతో బతకడం

ఎంత బహిరంగమైపోతుంది.

.

ఎమిలీ డికిన్సన్.

అమెరికను

ఎమిలీ డికిన్సన్  అజ్ఞాతంగా బ్రతకడం గురించి వ్రాయడంలో వింతలేదు. ఎందుకంటే, ఆమె అలాగే జీవించింది. ఆమె చనిపోయే వరకూ ఆమె అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించిందని ఇంటిలోని వాళ్లకే తెలీదంటే, ఈ విషయంలో ఆమె నిజాయితీ, నిబద్ధత చెప్పనలవికానివి. అన్ని వ్యామోహాల్లోకీ తప్పించుకోలేనివ్యామోహం మన పేరు. అది చిరస్థాయిగా ఉండాలని సంపన్నులనుండి సామాన్యులవరకూ ఎన్నో తంటాలు పడుతూనే ఉంటారు. చివరకి రాళ్ళమీదా చెట్లమీదా తమపేరు చెక్కేసుకుంటారు… ఆఖరికి అవేవో శాశ్వతమైనట్టు. సూర్యుడు అంతరించేవేళకి కొన్ని యుగాలు ముందుగానే, ఈ భూమి ఒక మరుభూమిగా మారిపోయి జీవరాశి ఉనికే ఉండదు. ఆ సత్యం అవగతమైతే, … మన వంశం, మన పిల్లలూ, మన జాతీ … మిగతాజాతులన్నీ హరించిపోయినా ఈ భూమిమీద బతకాలనే యావ, దానికోసం దేశాధినేతలూ, వ్యాపారవేత్తలూ చేసే అనర్థాలకి భరతవాక్యం పలికి, ఉన్నన్నాళ్లూ అందరూ సుభిక్షంగా ఉండే దిశవైపు అడుగులు వేయగలుగుతారు.  కానీ, అది అత్యాశే.

.

Cover of "I'm Nobody! Who Are You? (Schol...
Cover via Amazon

.

I’m Nobody
I’m nobody! Who are you?
Are you nobody, too?
Then there’s a pair of us—don’t tell!
They’d banish us, you know.

How dreary to be somebody!
How public, like a frog
To tell your name the livelong day
To an admiring bog!

.

Emily Dickinson

%d bloggers like this: