…..అప్పుడు నవ్వు… బెర్తా ఏడమ్స్ బేకస్, అమెరికను

నీకోసం ఒక దృఢమైన పెట్టె తయారుచేసుకో,

అందులో ప్రతి భాగాన్నీ చాలా శ్రద్ధగా తీర్చిదిద్దు, నీ చేత్తో

ఎంత దృఢంగా నేర్పుగా చెయ్యగలవో అంత దృఢంగా చేసి,

అందులో నీ బాధలన్నీ అందులో దాచిపెట్టు.

అందులోనే నీ గతించిన అపజయాల చరిత్ర దాచిపెట్టు;

నువ్వు దిగమింగుకున్న ప్రతి చేదు అనుభవాన్నీ పడెయ్;

నీ గుండె గాయం చేసిన సంఘటనలన్నీ అందులో వేసి మూసెయ్,

ఇప్పుడు దాని మూతవేసి, మీద కూర్చుని మనసారా నవ్వుకో.

మరెవ్వరికీ అందులో ఏముందో చెప్పకు,

అందులోని రహస్యాలను ఎవరితోనూ పంచుకోకు;

నువ్వు కష్టాలలోనూ, దుఃఖంలోనూ మునిగిపోయినపుడు

వాటిని అక్కడే శాశ్వతంగా భద్రంగా ఉండనీ.

మూడోకంటికి తెలియకుండా ఎంతభద్రంగా దాచాలంటే

ప్రపంచం అసలది ఉన్నట్టు కలలోనైనా ఊహించకూడదు.

ఆ పెట్టెని గట్టిగా గొలుసులతో కట్టిన తర్వాత, మూతవేసి

దాని మీద కూర్చుని అప్పుడు హాయిగా నవ్వుకో.

.

బెర్తా ఏడమ్స్ బేకస్

(1900-1940)

అమెరికను.

.

.

Then Laugh
 .

Build for yourself a strong box,
fashion each part with care;
When it’s strong as your hand can make it,
put all your troubles there;

Hide there all thought of your failures;
and each bitter cup that you quaff;
Lock all your heartaches within it,
Then sit on the lid and laugh.

Tell no one else its contents,
Never its secrets share;
When you’ve dropped in your care and worry
keep them forever there;

Hide them from sight so completely
That the world will never dream half;
 Fasten the strong-box securely—
Then sit on the lid and laugh.

.

Bertha Adams Backus

(1900-1940)

American Poet

“…..అప్పుడు నవ్వు… బెర్తా ఏడమ్స్ బేకస్, అమెరికను”‌కి ఒక స్పందన

  1. Great poem, undoubtedly. Kudos to the Poet and the Translator.

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: