అనువాదలహరి

రెండు నిజాలు… హెలెన్ హంట్ జాక్సన్, అమెరికను

“ప్రేయసీ,” కళ్ళలో చెమ్మ కదలాడుతుండగా

అతనన్నాడు, “నిన్ను బాధించాలని నా ఉద్దేశం కాదు,

“ప్రపంచం పాదాక్రాంతమైనా నిన్ను బాధించను,

నేను మరిచిపోతే, అది నాదా తప్పు? చెప్పు.”

.

ఆమె అంది, “ఓహ్! ఎప్పుడూ నా గురించే ఆలోచించే

ఈ కన్నీళ్ళకి… క్షమించు. నేను అర్థం చేసుకోగలను

ప్రియా, నన్ను బాధించడం నీ అభిమతం కాదని.

నువ్వు మరిచిపోయి ఉంటావని కూడా తెలుసు!”

.

అయినప్పటికీ, ఆమె మనసు లో లోపలి పొరల్లో

ఈ ఆలోచన మెరమెరలాడి… ఇంకా రగుల్తూనే ఉంది:

“ప్రేమ నిజంగా గాఢంగా ఉన్నప్పుడు, వ్యక్తి ఎక్కడైనా

 తను ప్రేమించినవారి విషయాలు మరిచిపోగలడా?”

.

హెలెన్ హంట్ జాక్సన్

(October 15, 1830 – August 12, 1885)

అమెరికను.

స్త్రీల సున్నితమైన హృదయాన్నీ, అవగాహననీ, అదే సమయములో తమ మనసుని వీడని సందేహాలనీ చాలా సున్నితంగా చెప్పింది కవయిత్రి ఇక్కడ. ప్రేమించిన స్త్రీ దొరికేవరకూ ఉన్న తపన బహుశా, ఆ స్త్రీని అందుకున్న తర్వాత మగవాడికి ఉండకపోవచ్చు. ఆ వ్యక్తి తనదే నన్న ధైర్యంవలనగాని, వేరే ఇతరకారణాలవలన గాని తెలిసో తెలియకో కొంత ఉపేక్షభావన కలిగి ఉండొచ్చు. ప్రియుడు బహుశా తనపుట్టినరోజో, తమ పెళ్ళిరోజో, మొదటిసారి కలుసుకున్న రోజో ఇలా ఏదో ఇద్దరికీ అనుభూతమైనదీ, ఇష్టమైన ఒక రోజునో, వస్తువునో సంఘటననో మరిచిపోయాడు. ఇద్దరూ కలుసుకున్నప్పుడు ఆమె కంటనీరు పెట్టుకుంది. దానికి ప్రియుడామెను అనునయిస్తూ మరిచిపోయేనని ఒక సమాధానం చెప్పేడు. దానిని ఆమె సత్యంగా స్వీకరించింది. తనకి అలా కన్నీళ్ళు ఉబికినందుకు క్షమాపణలు చెప్పుకుంది కూడా. అయితే, ఆమె మనసుని కలుక్కుమనిపించిన ఒక ఆలోచన: “మనం నిజంగా ఒక వ్యక్తిని ప్రేమిస్తే, వాళ్లకి చెందిన విషయాలు నిజంగా మరిచిపోతామా?”.  ఆమెకు అటువంటి మరుపులేదు. అతనికి మరుపెందుకు వచ్చిందని శంక. ప్రేమ కీడుని శంకిస్తుంది అని సామెత. అందులో వ్యక్తులకు జరిగిందేమోనని ఊహించుకున్న హానే గాక, ఆ వ్యక్తికి తమపై ప్రేమ తగ్గిపోవడం కూడా ఉందేమో!

.

Helen Hunt Jackson

 Helen Hunt Jackson

.

Two Truths
 .

“Darling,” he said, “I never meant
 To hurt you;” and his eyes were wet.
 “I would not hurt you for the world:
 Am I to blame if I forget?”

“Forgive my selfish tears!” she cried,
 “Forgive! I knew that it was not
 Because you meant to hurt me, sweet—
 I knew it was that you forgot!”

But all the same, deep in her heart
 Rankled this thought, and rankles yet,—
 “When love is at its best, one loves
 So much that he cannot forget.”

.

Helen Hunt Jackson  

(October 15, 1830 – August 12, 1885)

American Poet

%d bloggers like this: