అనువాదలహరి

కల్పిత కథ … చిత్ర కె.పి. మలయాళం, భారతీయ కవయిత్రి

నాటక ప్రదర్శన ముగిసి చాలసేపయింది.

ఆహార్యం మార్చుకోవడమూ పూర్తయింది.

ప్రేక్షకులెప్పుడో వెళ్ళిపోయారు.

అయినా,

నేనిక్కడ రంగస్థలం మీదనే ఉన్నాను…

పోగొట్టుకోని దానికోసం వెతుక్కుంటూ…


ఇక్కడ

నేనే పాత్రధారినీ, ప్రేక్షకుడినీ.

అంతేకాదు

ఆ రెండూ రూపాంతరంచెంది ఏకమయినవేళ

మధ్యలో అంతరించిపోయిన కట్టుకథని నేను

.

చిత్ర కె.పి

మలయాళం

భారతీయ కవయిత్రి

.

Chitra KP

Chitra KP

Poem and Image Courtesy:  Poetrans.wordpress.com

.

The Fictitious Tale

.

The play was enacted
long since. Garbs
have come off.
Audience has dispersed.

Yet, here I’m,

still on the stage,
searching
for something, that
hasn’t been lost.

Here,
I’m the character and the seer.
More.
I’m the fictitious tale
that was lost, when
the two morphed, emerged
as one.

Malayalam Original: Chitra KP

Translation: Divya Rajan

%d bloggers like this: