అనువాదలహరి

ప్రమాదం… రాబర్ట్ విలియం సెర్విస్, బ్రిటన్

నా కారులో నిన్న రాత్రి తీసుకెళ్ళిన ఆ కుర్రాడు,

శరీరం దారుణంగా చితికి వేలాడిపోతూ,

పెదాలు రక్తంగడ్డకట్టి ఎర్రగా,

కళ్ళు నిప్పుకణికల్లా మెరుస్తూ,

పాపం చేతులు మట్టిముద్దల్లా చల్లగా, ముడుచుకుని…

ఓహ్, ఈ రోజు రోజల్లా అతనే గుర్తుకొచ్చాడు.

అలసిపోయిన ఆ ముసలి డాక్టరు నాతో అన్నాడు గదా:

“మహా అయితే అతనొక గంటకుమించి బతకడేమో.

అతని కాళ్లు రెండూ ముణుకులవరకూ

బాంబుపేలుడుకి  తెగిపోయాయి, కాబట్టి బాబూ నెమ్మదిగా వెళ్ళు.

పాపం అతనికి ఈ విషయం తెలీదు. గుర్తుంచుకో!

అందుకని ఎంతో జాగ్రత్తగా కారునడపడానికి ప్రయత్నించేను.

ఈ దిక్కుమాలిన రోడ్లని పిచ్చిగా తిట్టుకోని క్షణం లేదు

వెనకనుండి ప్రేతాత్మ మాటాడినట్టు గొంతు వినిపీంచింది:

“నిజం చెప్పు పెద్దాయనా! మరీ అంత పెద్ద దెబ్బలు తగిలేయా?”

నేనన్నాను, “అబ్బే అదేం లేదు.”  “హమ్మయ్య, బతికేను.”

“నా మనసిపుడు కుదుటబడింది,” అంటూ,

“ఇరవై రెండేళ్ళకి జీవితం ఎంతో సుందరంగా ఉంటుంది.

నాకిపుడు చనిపోవాలని లేదు.

చిన్నప్పట్నుండీ ఎన్నోకష్టలుపడ్డాను

ఎన్నో బాధలు అనుభవించేను.

ఇప్పుడు అకస్మాత్తుగా చనిపోవాలంటే

ఎంతబాధగా ఉంటుందో తెలుసా?”

“కాసేపు అవన్నీ మరిచిపో,”

అని కారు నడుపుతునా.

అతన్ని ఉత్సాహపరచడానికి

ఉండుండి ఒకటిరెండు మాటలు చెబుతూ…

కాని చాలాదూరంవెళ్ళే వరకూ

ఒక్క మాటామాటాడలేదతను.

చివరికి ఎలాగైతేనేం హాస్పిటలు

అల్లంతదూరంలో కనిపిస్తుంటే

“నేను ఏమైనా సాయం చెయ్యాలా?” అని అడిగేను.

అతనపుడు కళ్ళు తెరిచి, నావంక చూసి నవ్వేడు.

వణుకుతున్న అతని చేతుల్లోకి నా చెయ్యి తీసుకుని

“కృతజ్ఞతలు…మీరు చాలా మంచివారు,” అన్నాడు

“నాకు మాత్రం చాలా హాయిగా ఉంది….చూద్దాం ఏమవుతుందో!

నా దుప్పటీ పక్కకి తప్పిపోయినట్టు ఉంది.

ఒకసారి దుప్పటీ కాళ్ళమీద  కప్పగలరా?

నా పాదాలు చాలా చల్లగా ఉన్నాయి…  చల్లగా అనిపిస్తున్నాయి…”

.

రాబర్ట్ విలియం సెర్విస్

బ్రిటన్

.

Robert William Service

.

Image Courtesy: http://en.wikipedia.org/wiki/Robert_W._Service
Image Courtesy: http://en.wikipedia.org/wiki/Robert_W._Service

.

Casualty

.

That boy I took in the car last night,

With the body that awfully sagged away,

And the lips blood-crisped, and the eyes flame-bright,

And the poor hands folded and cold as clay

— Oh, I’ve thought and I’ve thought of him all the day.

For the weary old doctor says to me:

“He’ll only last for an hour or so.

Both of his legs below the knee

Blown off by a bomb. . . . So, lad, go slow,

And please remember, he doesn’t know.”

So I tried to drive with never a jar;

And there was I cursing the road like mad,

When I hears a ghost of a voice from the car:

“Tell me, old chap, have I `copped it’ bad?”

So I answers “No,” and he says, “I’m glad.”

“Glad,” says he, “for at twenty-two

Life’s so splendid, I hate to go.

There’s so much good that a chap might do,

And I’ve fought from the start and I’ve suffered so.

‘T would be hard to get knocked out now, you know.”

“Forget it,” says I; then I drove awhile,

And I passed him a cheery word or two;

But he didn’t answer for many a mile,

So just as the hospital hove in view,

Says I: “Is there nothing that I can do?”

Then he opens his eyes and he smiles at me;

And he takes my hand in his trembling hold;

“Thank you — you’re far too kind,” says he:

“I’m awfully comfy — stay . . . let’s see:

I fancy my blanket’s come unrolled —

My feet, please wrap ’em — they’re cold . . . they’re cold.”

.

Robert William Service

%d bloggers like this: